Telugu Breaking NewsTelugu News

ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది?

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ.. ఇజ్రాయెల్​పై డ్రోన్​లు, క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్​. దీంతో వివిధ రిపోర్టులు, ప్రపంచ దేశాల ఆందోళనలను నిజం చేస్తూ.. శనివారం రాత్రి.. 200కుపైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయెల్​పై దాడి చేసింది. ఫలితంగా.. ఈ రెండు దేశాల మధ్య ప్రాంతీయ యుద్ధం జరుగుతుందా? అన్న సందేహాలు మరింత బలపడ్డాయి. అసలు.. ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది?

ఆరు నెలలుగా పాలస్తీనియన్ల మీద ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధ రంగంలోకి ఇరాన్ కూడా ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయిల్ ఏప్రిల్ ఒకటవ తేదీన సిరియాలోని డెమాస్కస్ ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయం మీద దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ దళాలకు చెందిన ఏడుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు జనరల్ స్థాయి సైనికాధికారులు కూడా ఉన్నారు. అప్పుడే ఇరాన్ ఏదో ఒక రోజు పగ తీర్చుకుంటాం అని ప్రకటించింది. అందుకు ప్రతీకారంగా.. ఏప్రిల్ 13 న, ఇరాన్ ఇజ్రాయెల్​పై డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల దాడి చేసింది. అంతేకాదు ఇరాన్ విప్లవ దళాలు శనివారం పర్షియన్ సింధు శాఖలో ఇజ్రాయిల్ తో సంబంధం ఉందంటున్న సరుకు రవాణా నౌక ఎంసీఎస్. ఏరిస్‌ను ఇరాన్ నౌకాదళం ప్రత్యేక దళాలవారు స్వాధీనం చేసుకున్నారు. 

హెలీకాప్టర్ల మీంచి తాళ్ల సహాయంతో ఆ సరుకు రవాణా మీదకు దూకి ఆ నౌకను ఇరాన్ సముద్రజలాల వేపు పంపించారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికార వార్తా సంస్థ ధ్రువీకరించింది. ఈ నౌకకు ఇజ్రాయిల్ తో సంబంధం ఉన్నదని ఇరాన్ అంటోంది. మరోపక్క గాజాలో ఇజ్రాయెల్​ దళాలు దండయాత్ర చేస్తున్నారు. కాగా.. లెబనాన్​లోని హిజ్బుల్లా ఫైటర్లకు ఇరాన్​ మద్దతు ఇస్తోంది. ఇరాన్​ సాయంతోనే.. హిజ్బుల్లా ఫైటర్లు తమపై దాడి చేస్తున్నారని ఇజ్రాయెల్​ ఆరోపిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్​ కూడా బలంగా ప్రతిఘటిస్తోంది.

అయితే ఇరాన్​ దాడిని సమర్థవంతంగా అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్​ చెబుతోంది. ఇందుకు.. అమెరికా కూడా ఇజ్రాయెల్​కు సాయం చేసినట్టు కనిపిస్తోంది. అమెరికా దళాలు దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులను కాల్చివేయడం ద్వారా ఇజ్రాయెల్​కు మద్దతు తెలిపాయి. ఈ వివాదంపై ఇరాన్​  జీ7 సమావేశాన్ని నిర్వహిస్తామని అమెరికా చెబుతోంది. అయితే, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చు విశ్లేషకులు చెబుతున్నారు.

Show More
Back to top button