
పదవీవిరమణ తర్వాత.. ఆనందంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే చిన్న వయస్సు నుంచే పెట్టుబడులు ప్రారంభించాలి.. ఇలా చేస్తేనే అధిక రాబడులు సొంతమవుతాయి. ఎంత త్వరగా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే వయస్సు పైబడ్డాక అంత హాయిగా జీవించవచ్చు. మరి ఏ వయస్సులో ఎలాంటి పెట్టుబడుల ప్రణాళిక ఉండాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
20-30 ఏళ్లు
ప్రతి ఒక్కరి సంపాదన ఈ వయస్సులోనే ప్రారంభమవుతుంది. కాబట్టి వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే ఈ వయసులో సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. ఈ వయసులో ఎంత తక్కువ ఖర్చు చేస్తే భవిష్యత్తులో అన్ని లాభాలు ఉంటాయి. ఇక ఈ వయస్సులో అధిక రిస్క్ ఉండి మంచి రాబడి అందించగల పథకాల్లో మదుపు చేయడం మేలు, ఉద్యోగం పొందితే మీరు PF పథకంలో చేరుతారు. అలాగే PPFలోనూ కొంత పెట్టుబడి పెట్టండి. ఈ వయస్సులో ఆదాయం తక్కువగానే ఉంటుంది కాబట్టి రిస్క్ చేస్తూనే.. ఈక్విటీల్లో పొదుపు చేయండి. కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా బ్యాంకు ఖాతాలో పొదుపు చేయండి.
30-40 ఏళ్లు
ఈ వయస్సులో పిల్లలు, వారి స్కూల్ ఫీజులు వంటి ఖరులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కాబట్టి వ్యక్తిగత ఖర్చులు తగ్గించాలి. సరదాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇప్పటినుంచే పదవీవిరమణకు ప్లాన్ చేసుకోవాలి. NPSలో చేరడానికి ఇది మంచి ఏజీ అని చెప్పుకోవచ్చు. NPSలో పొదుపు చేస్తే రిటైర్మెంట్ వరకు మంచి లాభాలు వస్తాయి. 30-40 వయస్సులో మీ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే ఏమీ ఆలోచించకుండా.. లంప్పమ్లో పెట్టుబడి పెట్టండి. 20-30 ఏళ్లలో మొదలెట్టిన సిప్‌ను టాప్లప్ చేసుకోండి. మీ పొదుపులో 60-70% వరకు ఈక్విటీల కోసమే కేటాయించండి.
40-50 ఏళ్లు
ఈ వయస్సులో మీలో కొన్ని మార్పులు వస్తాయి. అందుకే ఖర్చులు సైతం పెరుగుతాయి. పిల్లలకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే మీకొచ్చే జీతంతో వీటన్నింటినీ సరిపెట్టగలరో లేదో ముందే చెక్ చేసుకోవాలి. ఈ అవసరాలను బట్టి ఖర్జులను తగ్గించుకోవాలి. ఈ ఏజ్ మీ పెట్టుబడుల్లో రిస్క్ కూడా ఎక్కువగా ఉండకూడదు. తక్కువ రిస్క్ ఉన్న పథకాల్లోనే పెట్టుబడులు పెట్టాలి. పోర్ట్‌ఫోలియోను సరిగ్గా పొదుపుగా నిర్వహించాలి. అత్యవసర నిధిలో డబ్బు కూడా ఒక సంవత్సర జీతం అంత ఉండేలా చూసుకోవాలి.
50-60 ఏళ్లు
ఇది పదవీవిరమణకు ముందు కాలం. ఈ ఏజ్‌లో వైద్యఖర్చులతో పాటు పిల్లల కోసం కూడా అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు కూడా రిస్క్ లేని ఫండ్లలోనే పెట్టుబడులు పెట్టాలి. నమ్మకం. ఉంటే వడ్డీకి మీ డబ్బును ఎవరికైనా అప్పు ఇవ్వొచ్చు. ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి కేవలం జీతంపై నూత్రమే ఆధారపడకుండా.. వ్యాపారం వంటి ఇతర మార్గాలను సైతం ఎంచుకోవాలి. అధిక రాబడి లభించే బాండ్లు వంటి పెట్టుబడి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలి. 40% ఈక్విటీ, 60% బాండ్ల ఎక్స్ పోజర్ పోర్ట్‌ఫోలియో కొనసాగించాలి.
60 ఏళ్ల తర్వాత
ఈ వయస్సులో అందరూ సంపాదించలేరు. కాబట్టి పెట్టుబడుల రిటర్నులపై ఆధారపడాల్సి వస్తుంది. కొన్ని సందర్బాల్లో అవి కూడా మీకు సరిపోకపోవచ్చు. అందుకే ముందుగానే మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం అయితే పెన్షన్ వస్తుంది. ప్రైవేటు ఉద్యోగులు SWPలో కొంత డబ్బును ఇన్వెస్ట్ చేసి పెన్షన్ పొందవచ్చు. మీ దగ్గర ఉన్న పదవీ విరమణ నిధిని ఎఫ్ఎల్లో గానీ, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీంలో గానీ, పీఎంవీవీవై వంటి హామీ పథకాల్లో గానీ పొదుపు చేయడం ఉత్తమం.