Telugu Featured NewsTelugu Politics

మహిళా రిజర్వేషన్ బిల్లు ఓ ఎన్నికల ఎర..?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రత్యేక పార్లమెంట్‌లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సెప్టెంబర్‌ 19న ప్రవేశపెట్టగా.. దీనిపై చర్చ (Debate) జరిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చ అనంతరం.. న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. దీంతో లోక్‌సభలో 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేయ్యాగా.. రాజ్యసభలో 215 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఓటు వేయలేదు. దీంతో దీనిని రాష్ట్రపతి ఆమోది చట్టంగా మారనుంది. అయితే, ఈ చట్టాన్ని కొందరు అభినందిస్తుండగా.. మరికొందరు ఈ సమయంలో ఈ చట్టాన్ని తీసుకురావడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ చట్టం అమలు సాధ్యమేనా? దీనిపట్ల రాజకీయ నిపుణులు ఏం అంటున్నారు? ఒక లక్ వేద్దాం పదండి.

* రిజర్వేషన్ బిల్లు చరిత్ర

మొట్టమొదటిసారిగా 1989లో మహిళల కోసం మే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అనుకున్నారు.  అయితే, బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. కానీ, రాజ్యసభలో ఆమోదం పొందడంలో విఫలమయింది. తర్వాత మళ్లీ 1992, 1993లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహా రావు రాజ్యాంగ సవరణ బిల్లులు 72, 73లను తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో రెండు సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారిగా పార్లమెంట్‌లో మహిళల రిజర్వేషన్ కోసం 81వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంలో విఫలమయింది. తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు 1998లో లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బి‌ల్లు ప్రవేశపెట్టింది.

ఈ సారి కూడా బిల్లు ఆమోదం పొందలేదు. అనంతరం 1999, 2002, 2003లో వాజ్ పేయి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆమోదం పొందలేదు. తర్వాత మళ్లీ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 2008 మే 6న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లు లోక్‌సభలో ఎప్పుడూ పరిశీలనకు రాలేదు. చివరగా 2014లో లోక్‌సభ రద్దుతో బిల్లు ఆమోదం నిలిచిపోయింది. రాజ్యసభలో ప్రవేశపెట్టినా.. బిల్లు ఆమోదం పొందదు.. కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. ఇక మోడీ నేతృత్వంలో ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
 
 ఆకాశంలో సగం అంటూ మహిళలను కీర్తిస్తున్నప్పటికీ రాజ్యాధికారంలో వారికి తగిన ప్రాతినిధ్యం ఇన్నాళ్లూ లేదు.

ఇప్పుడు బిల్లు ఆమోదం ద్వారా వారికి పెద్దపీట వేసే దిశగా అడుగు ముందుకు పడింది.

అయితే, ఈ బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ 2024 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదు.

ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘మహిళా రిజర్వేషన్ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.

కానీ, దీనిని 2024 ఎన్నికల నుంచే అమలు చేయాలి’ అని అన్నారు.

దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం, అంటే 2029 ఎన్నికల్లో అమలు చేసేందుకు మాత్రమే అవకాశాలు ఉన్నాయని సాక్ష్యాత్తు పార్లమెంట్‌లో చెప్పారు.

దీనిని బట్టి అర్థం చేసుకుంటే… ఈ బిల్లు 2024లో జరగబోయే ఎన్నికలకు ఎర మాత్రమే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఈ బిల్లుపై కొందరు రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలిపారు అవేంటో ఇప్పుడు చూద్దాం.


Show More
Back to top button