CINEMATelugu Cinema

వెండితెర సోగ్గాడు శోభన్ బాబు

తెలుగు చిత్ర పరిశ్రమలో “సోగ్గాడు” అనే పదం వినిపించగానే గుర్తొచ్చే హీరో అలనాటి అందాల నటుడు శోభన్ బాబు. ఇలా శోభన్ బాబుకి పేరు రావడానికి గల కారణం సోగ్గాడు చిత్రం. ఈ మూవీ వచ్చి దశబ్దాలు గడుస్తున్నా ఎప్పటికీ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్ర విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను తమిళ రచయిత బాలమురుగన్ రచించగా.. మోదుకూరి జాన్సన్ మాటలు సమకూర్చారు.

ఈ కథను మంచి కాంబినేషన్‌లో తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని రామానాయుడు గారు అనుకున్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దర్శకుడు కె. బాపయ్యతో ఈ సినిమాను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి కథానాయకులుగా జయసుధ, జయచిత్రను ఎంపిక చేశారు. ఇంకా మిగిలిన తారాగణంగా సత్యనారాయణ, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, నగేష్, గిరిబాబు, అంజలిదేవి, రమాప్రభ వంటివారిని సెలెక్ట్ చేశారు.

కె.వి. మహదేవన్‌ సంగీతంలో.. ఆచార్య ఆత్రేయ పాటలు ఈ మూవీలో ఆకట్టుకున్నాయి. ఖర్చుకు ఢోకాలేకుండా హైదరాబాద్, విజయవాడ, కారంచేడు పరిసరాల్లో షూటింగ్ చేశారు. ఇక కథ విషయానికొస్తే బావ, మరదళ్ల మధ్య హీరో భార్యగా ప్రవేశించిన అమ్మాయి కథతో ట్రయాంగిల్ స్టోరీగా తీసిన ఈ సినిమాలో సన్నివేశాలు ప్రేక్షకుల మనసులను గెలుచుకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో ఏ అంశం కూడా మిస్ అవ్వకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా కెమెరా మెన్ విన్సెన్ట్ తీర్చిదిద్దారు. 1975 డిసెంబర్ 19న విడుదలైన “సోగ్గాడు” చిత్రం మీద జనం కలెక్షన్ల వర్షం కురిపించారు. 31 కేంద్రాలలో 50 రోజులు, 19 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. శోభన్‌ బాబు సినిమాలలో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇదే. 1976 ఏప్రిల్ లో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో శత దినోత్సవ వేడుకను ఘనంగా జరిపారు.

Show More
Back to top button