Telugu Featured NewsTelugu Politics

2024 బడ్జెట్‌‌ : కీలక అంశాలు ఇవే..!

పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వరసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో 9 రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుంది. నాలుగు అంశాలపై మధ్యంతర బడ్జెట్‌లో దృష్టి పెట్టామన్నారు. ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించామన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన- ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాతతరం సంస్కరణలు- ఈ తొమ్మిది అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ముఖ్యంగా ఈ బడ్జెట్ లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టామన్నారు. అందులో భాగంగా ఐదు పథకాలతో కలిపి పీఎం ప్యాకేజీ తీసుకొచ్చామన్నారు. దీనికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించామన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఇకపోతే ఈ బడ్జెట్‌లో ఏపీకి వరాలు జల్లు కురిపించింది. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఏపీలో నాలుగు రంగాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. 

* శాఖల వారీగా కేటాయింపులు ఇవే..!

మొత్తం బడ్జెట్: రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌

వ్యవసాయ, అనుసంధాన రంగాలు – రూ. లక్షా 52 వేల కోట్లు

విద్య, నైపుణ్యాభివృద్ధి – రూ.లక్షా 48 వేల కోట్లు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – రూ.2.2లక్షల కోట్లు

గ్రామీణాభివృద్ధి – రూ.2.66 లక్షల కోట్లు

మహిళాభివృద్ధి – రూ.3 లక్షల కోట్లు

మౌలిక సదుపాయాలు – రూ. 11.11 లక్షల కోట్లు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు – రూ.15 వేల కోట్లు

బిహార్‌లో జాతీయ రహదారులకు రూ.20 వేల కోట్లు సహాయం

ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు

దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు

* బడ్జెట్‌లో ఇతర అంశాలు

ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు

25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు

ప్రతి భూకమతానికి యూఎల్‌ పిన్‌ నెంబర్‌ కేటాయింపు

ప్రతి భూకమతాన్ని భూ ఆధార్‌ ద్వారా గుర్తింపు

యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్

కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్

ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు

MSMEలకు క్రెడిట్‌ గ్యారంటీ పథకాలు

త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం

తనఖాలు, గ్యారంటీలు లేకుండా.. యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్‌ రుణాలు

100 నగరాల్లో ప్లగ్ &ప్లే తరహా పారిశ్రామిక పార్కులు

దేశంలో చిన్న ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం

వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్‌

తగ్గనున్న బంగారం, వెండి ధరలు

సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు

మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు

Show More
Back to top button