Telugu News

గ్యారెజ్ టు గ్లోబ్.. Amazon ప్రయాణం

Amazon అని వినగానే గ్యారెజ్ న అందరికీ గుర్తొచ్చేది షాపింగ్ సైట్. ఏదైనా వస్తువు కావాలంటే వెంటనే Amazon సైట్‌కు వెళ్లి, దాని గురించి వెతుకుతాం. ఇంతలా ప్రభావం చూపుతున్న.. Amazon.Com ఎంత చిన్న గ్యారెజ్ లో ప్రారంభమైందో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం అది గ్యారేజ్ నుంచి గ్లోబ్ వరకు విస్తరించింది. ఇంతటి విజయం సాధించిన Amazon ప్రయాణం ఎలా నడిచింది అనేది తెలుసుకుందాం.

Amazonను స్థాపించింది జెఫ్ బెజోస్, తన చిన్నతనం నుంచి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి, జీవితం సుఖంగా సాగుతున్న సమయంలో తనకంటూ ఒక పేరు సంపాదించాలనే ఆలోచనతో 1994లో తన ఉద్యోగం మానేశారు. తన తండ్రి దగ్గర కొంత డబ్బును తీసుకుని ఒక చిన్న గ్యారేజ్‌లో వ్యాపారం ప్రారంభించారు.

వ్యాపార పేరు గురించి ఎంతో ఆలోచించాడు. చివరగా Amazon నదిలా వ్యాపారం విస్తరించాలని Amazon అనే పేరుతో వ్యాపారం, వెబ్‌సైట్ సృష్టించారు. మొదట్లో కేవలం పుస్తకాలనే అమ్మేవారు. కొత్తలో తక్కువ మంది కస్టమర్లే వచ్చేవారు. పుస్తకాలను పెట్టడానికి స్థలం లేకపోవడంతో ఆర్డర్ వచ్చాక ఆ పుస్తకాన్ని వెతికి, వాటిని కొని, అమ్మేవారు. దీని గురించి ఉద్యోగం మనేయాలా? అని చాలామంది వెక్కిరించినా.. తన మీద తనకు ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు. అలా పుస్తకాలతో పాటు ఇతర వస్తువులను అమ్మకానికి ఉంచారు.

కొన్నాల్లకు పెట్టుబడి సరిపడా లేకపోవడంతో 1997లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. దీంతో కస్టమర్లు పెరిగారు..

వ్యాపారం జోరందుకుంది. ఇలా 7 సంవత్సరాలు ఎలాంటి లాభం లేకుండా నడిచిన Amazon మొదటిసారి 2001లో కొన్ని మిలియన్ డాలర్ల లాభం సంపాదించింది.

కస్టమర్లే తన మొదటి ప్రాధాన్యత అని భావించడం వల్లే విజయం సాధించగలిగానని జెఫ్ బెజోస్ పలు ఇంటర్వ్యూలో తెలిపారు.

విజయం అనే మొదటి మెట్టు ఎక్కిన Amazon తిరిగి వెనక్కి చూడలేదు. ఆ తర్వాత చిన్న, చిన్న కంపెనీలను కొనుగోలు చేసి, అన్ని రంగాల్లో విస్తరించింది.

అసలు దీని స్ట్రాటజీ ఏంటి, ఇది ఎలా ఇంత పెద్ద వ్యవస్థగా మారిందో ఇప్పుడు చూద్దాం.

మొదటి నుంచి జెఫ్ బెజోస్ డబ్బు సంపాదించాలనే ఆలోచన కంటే వ్యాపారం పెంచాలనే ఆలోచనతోనే ఉన్నారు. కస్టమర్ల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఒక లక్ష్యం పెట్టుకొని దాని కోసం కష్టపడ్డారు.

చిన్న చిన్నగా వ్యాపారాన్ని ముందుగా సాగిస్తూ తనకు వచ్చే తక్కువ లాభాలను, తిరిగి వ్యాపారంలోనే పెట్టేవారు.

నాణ్యమైన సేవను వినియోగదారులకు అందిస్తూ.. ముందుగా ప్రజల వద్ద నమ్మకం పెంచుకున్నారు. అలా ఓపిగ్గా 7 సంవత్సరాలు లాభాలు లేకుండా పని చేయడం అనేది చిన్న విషయం కాదు. అంత కష్టపడ్డ జెఫ్ బెజోస్ ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో లిస్ట్ అయ్యారు.

రాబోయే మరో 25 సంవత్సరాల్లో మొదటి ట్రిలియనీర్‌గా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Show More
Back to top button