Telugu Featured News

ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ ప్రకటన.

కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు పర్యటించి, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఈ క్రింది విధంగా మనం చూడవచ్చు.

తెలంగాణ
నవంబర్‌ -30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
నవంబర్‌ – 3న ఎన్నికల నోటిఫికేషన్‌
నవంబర్‌ – 10 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
నవంబర్‌ – 13న నామినేషన్ల పరిశీలన
నవంబర్‌ – 15న నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్‌ – 3న ఎన్నికల కౌంటింగ్‌

మిజోరాం
అక్టోబర్ 13 – ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 7 – పోలింగ్
డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు

రాజస్థాన్
అక్టోబర్ 30 – ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 23 – పోలింగ్
డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు

ఛత్తీస్‌గఢ్‌
అక్టోబర్ 13- ఫేజ్-1 ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 21 – ఫేజ్-2 ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 7 – ఫేజ్-1 పోలింగ్
నవంబర్ 17 – ఫేజ్ -2 పోలింగ్ డిసెంబర్ 3 – ఫేజ్-1 & ఫేజ్-2 ఎన్నికల ఫలితాలు

మధ్య ప్రదేశ్
అక్టోబర్ 21 – ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 17 – పోలింగ్
డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు

Show More
Back to top button