Telugu News

భారత్ లోకి టెస్లా ‘వై’ రాక..!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఆయనకు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం అయిన టెస్లా ఇప్పుడు మన భారత్ లోకి అడుగుపెట్టింది. ఈ వారంలో ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లోని మేకర్‌ మ్యాక్సిటీ మాల్‌లో టెస్లా తన ఫస్ట్ ఎవర్ షోరూంను గ్రాండ్‌గా లాంఛ్‌ చేసింది. 

తొలి షోరూం కోసం టెస్లా సంస్థ వై మోడల్‌ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకురావడం విశేషం! ఇక్కడ డిమాండ్‌ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షోరూంను ఏర్పాటవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ షోరూం కోసం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకోగా.. పార్కింగ్‌ సౌకర్యాలుగల ఈ షోరూమ్‌ స్పేస్‌కుగాను మస్క్‌ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించింది. 

భారత్ లో అమ్మకాలు మొదలు పెట్టడానికి కారణం.. యూరప్, చైనాలో అమ్మకాలు అనేవి పడిపోవడంతో ఇండియాలో ప్రాఫిట్ చేసుకోవాలనే ఆలోచనతో ఎలాన్ మస్క్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముంబైలో తమ తొలి షోరూంను ప్రారంభించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో ఎక్కువ సేల్స్ రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు రేట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అంతా కలిపితే రూ.48 లక్షలపైనే అవుతుంది.

భారత్‌లో టెస్లా కారు ధర సుమారుగా రూ.60లక్షలు. ప్రస్తుతం మోడల్ వై రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఇందులో రేర్ వీల్ డ్రైవ్ కారు ధర రూ.59.89 లక్షలు కాగా.. 

లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ రూ.67.89 లక్షలు పలుకుతుంది.

ఒకసారి ఛార్జింగ్ తో 500-4622 కి.మీ. ప్రయాణించొచ్చు.

జులై 15 నుంచి అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఆగస్టులో కార్లు డెలివరీ అవుతాయి.

ఈ కార్ల ధరలు అమెరికాలో దాదాపు రూ.38 లక్షలు కావడం అంటే భారత్ లోని ధరతో పోలిస్తే సగానికి సగం ధర ఉండటం గమనార్హం.

ఈ రెండు వేరియంట్ల డెలివరీలు వరుసగా ఈ ఏడాది మూడో, నాలుగో త్రైమాసికం నుంచి మొదలవుతాయి. తొలుత ఢిల్లీ, ముంబయి, గురుగ్రామ్ లలో ఈ వాహనాల డెలివరీ, రిజిస్ట్రేషన్ అనేవి ఉంటాయి. యూజర్లు కావాలంటే ఎక్స్ టీరియర్, ఇంటిరీయర్, ఇతర ఫీచర్లను తమకు కావాల్సినట్లు మార్చుకునే వీలు టెస్లా డిజైన్ స్టూడియో కల్పిస్తుంది.

అమెరికా ధరతో పోలిస్తే భారత్ లో రెట్టింపు ధర.. ఎందుకంటే.?

ప్రస్తుతం భారత తయారీ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా అందిస్తున్న విద్యుత్తు కార్ల ధరలు రూ.30 లక్షల్లోపే ఉన్నాయి. అమెరికాలో మోడల్ వై లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 87,190 డాలర్లు (దాదాపు రూ.32 లక్షలు)గా ఉంది. దిగుమతి సుంకాల కారణంగా మన దగ్గరికి వచ్చేసరికి ఈ కారు ధర రెట్టింపైంది. 

మన దేశంలోకి దిగుమతి చేసుకుంటున్న కారు ప్రైస్ 40,000 డాలర్లకు మించితే 100% సుంకం, ఆ పరిమితిలోపైతే 20% దిగుమతి సుంకం వర్తించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Show More
Back to top button