Telugu News

గోవా గవర్నర్‌గా పుసపాటి అశోక్ గజపతి రాజు

2025 జూలై 14న, భారత్‌ రాష్ట్రపతి ద్రౌపది మూర్తి ద్వారా పుసపాటి అశోక్ గజపతి రాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈయన తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేతగా ప్రసిద్ధి చెందారు. 2014‑19 మధ్య కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పౌర విమానయానశాఖ మంత్రి (Civil Aviation Minister)గా సేవలు అందించారు. 

ఈయన పదవిలో ఉన్నప్పుడు.. దేశంలో UDAN రీజనల్ కనెక్టివిటీ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా పేరుపొందాడు. రాజమండ్రి, కడప వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ఈయన నాంది పలికారు. కాగా, ఈయన 1951 జూన్ 26న జన్మించారు. 1978లో తొలిసారి జనతా పార్టీ తరుపున విజయనగరం స్థానం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా 1983, 85, 89, 94, 99, 2009 లోనూ విజయనగరం నుండి టి.డి.పి ఎమ్.ఎల్.ఎగా గెలిచారు.

Show More
Back to top button