CINEMATelugu Cinema

‘తండేల్‌’ మూవీ రివ్యూ

చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్ లో చిక్కుకున్న కొందరు మత్సకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం “తండేల్” మూవీ ఈరోజు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మరి ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్‌ వెరావల్‌ నుంచి బయలుదేరి చేపల వేట చేస్తుండగా పొరపాటున పాకిస్థాన్‌ జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్‌ వారిని అరెస్ట్‌ చేసి జైల్లో వేస్తుంది. బుజ్జితల్లి (సాయి పల్లవి)పై సముద్రమంత ప్రేమ ఉన్న రాజు (నాగ చైతన్య) సముద్రంలో వేటకి వెళ్లి.. పాకిస్తాన్‌ చెర నుంచి రాజు ఎలా బయటపడ్డాడు? తన తోటి జాలర్ల కోసం ఎలాంటి యుద్ధం చేశాడు? రాజు కోసం బుజ్జితల్లి చేసిన సాహసం ఏంటి? అనేదే ‘తండేల్’ కథ.

నాగచైతన్య పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించాడు. చాలా సాధారణ సన్నివేశాల్లో కూడా మంచి ఎమోషన్ పండించాడు చైతన్య. సాయిపల్లవి నటిగా విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో శ్రీకాకుళం యాసలో సహజత్వం లోపించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. శామ్ దత్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రేమకథలో, దేశభక్తిని జొప్పించే ప్రయత్నంలో ఎమోషన్ లోపించింది. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.

Show More
Back to top button