HEALTH & LIFESTYLE

ఇంట్లో ఉండే ఔషధాలతోనే ఇమ్యూనిటీ బూస్ట్

ఈరోజుల్లో చాలామంది సాధారణ జలుబు వచ్చినా వెంటనే టాబ్లెట్‌ వాడటానికి అలవాటు పడ్డారు. కానీ మన కిచెన్‌లో ఉండే పదార్థాల్లోనే రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు ఉన్నాయని మీకు తెలుసా?. ఇమ్యూనిటీ అంటే బయట నుండి వచ్చే బాక్టీరియా, వైరస్‌లను తట్టుకుని పోరాడే శక్తి. దీన్ని మెరుగుపరచాలంటే శరీరంలో యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్లు, మంచి నిద్ర, శారీరక శ్రమ అనేవి చాలా అవసరం. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం, తులసి, అల్లం, మిరియాల కషాయం  

వెల్లుల్లి, పసుపు, తేనె లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో డిటాక్స్ బాగా జరుగుతుంది.

రోజూ 7–8 గంటలు నిద్రపోవడం, 30 నిమిషాల నడక లేదా సాధారణ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే.. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది కూడా ఇమ్యూనిటీకి కీలకం.

నిత్యం ఫ్రెష్‌గా దొరికే పండ్లు, కూరగాయలను తినాలి. ఇలా చిన్న చిట్కాలతో మనం ఇమ్యూనిటీని నెమ్మదిగా పెంచుకోవచ్చు.

Show More
Back to top button