HEALTH & LIFESTYLE

ఫిట్స్ ఎందుకు వస్తాయి? వచ్చినప్పుడు తాళాలు పట్టొచ్చా?

ఫిట్స్‌ ఇది తెలియని వారు ఉండరు. సాధారణంగా దీనిని మూర్ఛగా పిలుస్తారు. ఈ వ్యాధి అంత ప్రమాదం కాకపోయినా.. ప్రమాదానికి గురి చేసే పరిస్థితులను తీసుకొస్తుంది. ఈతకొట్టే సమయంలో, కారుగాని, బైక్‌గాని నడుపుతునప్పుడు ఫిట్స్ వస్తే వారు ప్రమాదానికి గురవుతారు. దీనిని తగ్గించుకోవాలంటే నిర్దిష్టంగా నిర్ణీత కాలంలో చికిత్స తీసుకోవాలి.  అసలు ఫిట్స్ ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.
 
అసలు ఫిట్స్ రాకుండా ఉండడానికి మనలోనే ఒక యంత్రాంగం ఉంది. అదే థ్రెష్‌హోల్డ్, ఇది మనలో తక్కువైతే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది తగ్గడానికి ప్రధాన కారణం మనం అవలంభిస్తున్న జీవన విధానం ముఖ్యంగా.. మద్యపానం, నిద్రసరిగా లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వెలుగుతూ, ఆరుతూ ఉండే లైట్ల మధ్య ఉండడం వంటివి థ్రెష్‌హోల్డ్ తగ్గడానికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.

 ఫిట్స్‌కు గురైన వారిలో 75% మందికి నిర్దిష్టంగా కారణం ఏమిటన్నది తెలియదు. కేవలం 25% మందిలోనే కారణాన్ని కనుగొనవచ్చు. వీటి నిర్ధారణ గురించి వైద్యులు నిర్ధారణ కోసం సీటీ స్కాన్ లేదా ఎమ్మారై బ్రెయిన్, ECG  పరీక్షలు చేస్తారు.

* తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సాధారణంగా ఫిట్స్ రోగిని చూసినప్పుడు చాలామంది వాళ్లకు తాళం చెవులు అందించడం, చేతిలో ఏదైనా లోహపు వస్తువు పెట్టడం వంటివి చేస్తారు. నిజానికి ఇలా చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఫిట్స్ వచ్చినప్పుడు, అతడిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచి.. రోగిని ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి.  రోగి కాళ్లు, చేతులు కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు.

ఫిట్స్ వచ్చినప్పుడు 5-6 నిమిషాల్లో రోగి తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. అయినా  మామూలు స్థితికి రాకపోతే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడం ఉత్తమం. దీని ప్రభావం పూర్తిగా తగ్గడానికి పూర్తిస్థాయిలో మందుల కోర్సును వాడాల్సి ఉంటుంది.

Show More
Back to top button