
ఫ్యాషన్, బ్రాండ్ అంటూ మనం విదేశీ వస్తువుల వాడకం చాలా పెంచాం. ప్రస్తుతం చాలా ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్‌ను వాడుతున్నారు. అవి సౌకర్యవంతంగా ఉండటంతో వాడకం పెరిగింది. స్వదేశంలో ఈ వస్తువులను ఎందుకు చేయకూడదనే ఆలోచనతో ప్రారంభమైందే ఈ Dolphy India Pvt. Ltd. దీన్ని సూరత్‌కు చెందిన భగీరథ సోరతీయ ప్రారంభించారు. 2008లో డిగ్రీ చదివే సమయంలో తన సోదరులతో కలసి ఫార్మా వ్యాపారం ప్రారంభించారు.
అందులో Vitamin B12తో పాటు 22 రకాల ఔషధాలు అమ్మేవారు.
సూరత్‌లో వీళ్ళ దగ్గరే Human Albumin Injectionను గుజరాత్ హాస్పిటల్లో రూ.5వేలకు అమ్మేవారు.
తన చదువుకు తగిన వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు భగీరథ. భారతదేశంలో చాలా హోటల్స్‌లో సౌకర్యాలు రెప్యుటేషన్ పెంచుకోడానికి వెస్టెన్ స్టైల్ వాష్ రూమ్ వాడుతారు.
కానీ ఇవి అన్ని మార్కెట్లో సులువుగా దొరకవు. ఆర్డర్ చేస్తే రావడానికి 3-4 నెలల టైం పడుతుంది.
వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుందని గమనించిన భగీరథ.. తానే ఈ వస్తువులను తయారు చేసి అమ్మవచ్చనే ఆలోచన వచ్చింది. దీంతో 2017లో రూ.5కోట్ల పెట్టుబడితో కంపెనీని ప్రారంభించారు.
ఇందులో హోటల్లో అవసరమైన ఆటోమేటెడ్ హ్యాండ్ డ్రైయర్, శానిటైజర్ డిస్పెన్సర్స్, ఆటోమేటిక్ యూరినల్ ఫ్లష్‌లు వంటి వస్తువులను తయారు చేశారు.
వ్యాపారం ప్రారంభంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని భగీరథ తెలిపారు. డీలర్లు దొరకడం పెద్ద సమస్యగా మారింది. వారికి ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయడానికి ఉచిత వస్తువులు, వేర్‌హౌస్ కావాలి. అలానే ఒక సంవత్సరం వరకు క్రెడిట్ టైమ్ కావాలన్నారు.
దీని వల్ల వ్యాపారం దెబ్బతింటుందని తెలిసి 2018లో బెంగళూరులో సొంతంగా సేల్స్ ఆఫీస్ తెరిచారు. దీంతో చాలా వరకు నష్టం రాకుండా చూసుకున్నారు.
ప్రారంభంలో తక్కువ వస్తువులతో ప్రారంభించారు. కానీ మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత దాదాపు 200 పైగా వస్తువులను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
వ్యాపారం పెరగడంతో తన బ్రాండ్‌ను ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ దాకా విస్తరించారు. ఏర్పోర్ట్లు, మాల్స్, కోపరేట్ ఆఫీసులతో బిజినెస్ మరింత అభివృద్ధి చెందుతుందని భగీరథ అన్నారు.
కేవలం 20మంది పనివారితో మొదలైన Dolphy India Pvt. Ltd ఇప్పుడు 200 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇక్కడ తయారు చేసే వస్తువులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి E-Commerceలో మార్కెటింగ్ చేస్తున్నారు.
బిజినెస్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలో రూ.17కోట్ల రెవెన్యూ పొందారు. ప్రస్తుతం దీని రెవెన్యూ రూ.151 కోట్లకు చేరింది.
వినియోగదారులను ఆకర్షించాలంటే నాణ్యమైన వస్తువులు అందించడమే మార్గమని భగీరథ అంటున్నారు.