
జుట్టురాలడం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నూటికి తొంభైతొమ్మిది మందిలో ఈ సమస్యతో ఏదో ఒక సమయంలో బాధపడే ఉంటారు. కొంత మందిలో జుట్టు ఎక్కువగా రాలిపోయి బట్టతల వస్తుంది. బట్టతల రావడానికి గల కారణాలపై కాలిఫోర్నియా యూనివర్సిటిలో కొన్ని పరిశోధనలు చేశారు. బట్టతల ఎక్కువగా వంశపారపర్యంగా వస్తుందనుకుంటారు. కానీ అలా వచ్చే అవకాశాలు తక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోజు తలస్నానం చేయడం, హెల్మెట్, టోపీలు ఎక్కువసేపు ధరించడంతో జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని భావిస్తుంటారు. కానీ జుట్టు రాలిపోవడానికి ఇవేవి కారణాలు కావని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడానికి ఒత్తిడికి గురికావడం, కొన్నిరకాల మెడిసిన్లు వాడడం, తగినంత నిద్రలేకపోవడం వంటి పలు అంశాలు కారణంగా చెబుతున్నారు. ఆడవారిలో బట్టతల రాదనుకుంటారు అది అవాస్తవం. కొంతమంది మహిళలకు నడినెత్తిన పాపిడితీసే చోట కనిపిస్తుంది.
హార్మోన్‌లే కారణమా?
టెస్టొస్టిరాన్ హార్మోన్ స్త్రీ, పురుషుల్లో ఉంటుంది. ఇది పురుష లక్షణాలు కనబర్చే హార్మోన్ కాబట్టి పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. జన్యపరమైన ఆండ్రొజనిటిక్ అలోపేసియా వెంటుకల ఊడిపోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదే సమయంలో అలోపేసియా.. టెస్టొస్టిరాన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. కాబ్టటి మగవారిలో జుట్టు రాలటం ఎక్కువ జరుగుతుంది. బట్టతల కూడా అధికంగా కనబడుతుంది. బట్టతల రాకుండా నియంత్రించడానకి ప్రస్తుతం చాలా పద్దతులు ఉన్నాయి. ఇవేవి కూడా 100శాతం ఫలితాలను ఇవ్వడం లేదు. జుట్టు రాలడానికి కారణాలను అడ్డుకుంటే బట్టతలను కొంతమేరకు అరికట్టవచ్చు. చాలామంది కెమికల్ ఉన్న షాంపూలు, ఆయిల్ వాడతారు. వీటి వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. హెర్బల్ ప్రాడక్ట్స్ ఉపయోగించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.






