Telugu News

డిజిటల్ స్కామ్ నుంచితప్పించుకోండిలా.!

టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో డిజిటలైజేషన్ పెరుగుతుంది. దీనివల్ల ఆన్‌లైన్ స్కాములు కూడా పెరుగుతున్నాయి. అయితే, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న స్కామ్ డిజిటల్ అరెస్ట్. ఇందులో ఎక్కువగా వృద్ధులను, రిటైర్ అయిన వారిని టార్గెట్ చేస్తున్నారు. వీరి వాట్సాప్ నెంబర్ సేకరించి, వీడియో కాల్ చేసి.. ఈడీ, సీబీఐ లేదా పోలీస్ అధికారులమని చెప్పుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. బాధితులకు వీడియో కాల్ చేసి మీ మీద కేస్ అయింది.

మిమ్మల్ని అరెస్టు చేయాలని చెబుతూ.. గంటల తరబడి కాల్స్‌లో నిర్బంధిస్తున్నారు. వారికి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి మానసిక ఒత్తిడికి గురిచేయడం వారి ప్రధాన అస్త్రం. ఇలా చేసిన తర్వాత కేసు నుంచి బయట పడాలంటే మాకు డబ్బు చెల్లించమని అడుగుతూ రూ.లక్షల్లో డబ్బు వసూళ్లు చేస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థ లేదా దర్యాప్తు సంస్థ వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయదు. అలాగే డబ్బులు కూడా అడగరు. ఇలాంటి మోసాలు నుంచి తప్పించుకోవడానికి ఈ 4 స్టెప్స్ తప్పకుండా పాటించండి.

OTP షేర్ చేయకండి: మీకు కాల్ వచ్చినప్పుడు పలు సార్లు వారు ఓటీపీ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సమయాల్లో మీరు OTP షేర్ చేయకండి.

పోలీసులకు ఫిర్యాదు: మీకు ఇలాంటి కాల్ వస్తే వెంటనే దాన్ని కట్ చేసి మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వండి.

1930 నెంబర్ కు డయల్ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఆశ్రయించండి. లేదా www.cybercrime.gov.in లో లాగిన్ అవ్వండి.

మీకు తెలియని నెంబర్ నుంచి కాల్స్ వస్తే వాటిని లిఫ్ట్ చేయకపోవడం ఉత్తమం.

మరిన్ని వ్యాసాలు చదవండి:

ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక పునాదులు
తియ్యగా ప్రాణాలు తీసే కూల్‌డ్రింక్స్‌
గ్యాస్ అవసరం లేకుండా ఈజీగా చేసుకునే 5 హెల్తీ ఫుడ్స్

Show More
Back to top button