
ఈ కల్త్కీ ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం వస్తుందో తెలియడం లేదు. ఓ పక్క ఎండలు,.. మరోపక్క ఏవేవో వ్యాధులు. అయినా సరే ఎందుకొచ్చిందిరా ఈ జీవితం అనుకుంటా సమయానికి బ్యాగు తగిలించుకొని ఆఫీసులకు, పనులకు బయలు దేరుతాం.. మధ్యలోకి వెళ్లగానే తల నొప్పో.. జలుబో, జ్వరంమో. ఇంకా ఎక్కువ అయితే ఆఫీసుకు మెడికల్ లీవు పెట్టడం .. తీరా నెలాఖరుకు లాస్ ఆఫ్ పేతో జీతం తీసుకోవడం.. ఇలా జరుగుతుంటాయి. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే పసుపు పాలను తాగాలి. వీటికి ఆయర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. అసలు ఏంటి ఈ పాలు ప్రత్యేకత? పసువు పాలను ఎలా, ఎప్పుడు, తీసుకుంటే మంచిది. వంటి విషయాలు చూద్దాం.
ఎలా తయారు చేయాలి?
1 గ్లాస్ పాలు
½ టీస్పూన్ పసుపు
చిటికెడు మిరియాల పొడి
½ టీస్పూన్ తేనె
ఏ సమయానికి తాగాలి?
రాత్రి పడుకునే ముందు లేదా ఉదయాన్నే తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ప్రయోజనాలు విషయానికి వస్తే..
రోగనిరోధక శక్తి..
పసుపు కుర్కుమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ-బాక్టీరియల్, యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి మీ రోగనిరోధక శక్తి పెంచుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది.
కీళ్ల నొప్పులు..
పసుపులో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడంతో ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుదల..
పసుపు పాలు జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, bloating (ఉబ్బరం) సమస్యలు దాదాపు దరిచేరవు.
గుండె ఆరోగ్యం మెరుగుదల
పసువులో ఉండే కుర్కుమిన్ రక్తంలో కొవ్వును తగ్గించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, హై బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
పసుపు పాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే గుణాలను కలిగి ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పసువు పాలు తాగడం ఎంతో మంచిది.