ఏదైన టూర్‌కి వెళ్లాలని ఉంటుంది. కానీ, ఎక్కువ ఖర్చు అవుతుందేమో అనే భయం ఉందా.. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ ప్లాన్ చేసేద్దాం. ఈ సమయంలో వార్కల చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇది కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ తీరప్రాంత పట్టణం. ఇది అరేబియా సముద్రం ఒడ్డున, ఎత్తైన కొండల, అందమైన బీచ్‌లకు ఎంతో ప్రసిద్ధి. దీనిని ‘పాపనాశనం బీచ్’ అని కూడా పిలుస్తారు, ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని కొందరి నమ్మకం. ఇక్కడికి చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు ఉన్నాయి. మీ బడ్జెట్, సమయం బట్టి మీ రవాణ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ టూర్ పూర్తి చేయడానికి కనీసం 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది.
వార్మలలో చూడాల్సిన ప్రదేశాలు..
వార్మల బీచ్
జనర్ధన స్వామి ఆలయం
కప్పిల్ లేక్
బెకల్ ఫోర్ట
పొన్నుంతురుతు ద్వీపం
టూర్ బడ్జెట్..
మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది.
రోజుకు రూం రూ.300 నుంచి ప్రారంభం.
ఆహారానికి రోజుకు ఒకరికి రూ.300 – రూ.500 వరకు అవుతుంది.
షాపింగ్‌కి, అనుకోని ఖర్చు వస్తే దానికి మరో రూ.1500 నుంచి రూ.2000 వరకు తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
తక్కువ ఖర్చుతో ట్రిప్ ఐడియాలు:
మహబలేశ్వర్ టూర్ ప్లాన్ చేద్దామా..?
బడ్జెట్లో ఇంటర్నేషనల్ టూర్‌కి వెళ్లొద్దామా..!
వేసవి సెలవులకు టూర్ ప్లాన్ చేయండిలా..!










