HEALTH & LIFESTYLE

చలికాలంలో  హైపోథెర్మియా తో జాగ్రత్త

శీతాకాలం చలి తీవ్రత పెరుగుతుంది. వణికించే చలికి తోడు మంచు కూడా కురుస్తోంది. వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పడిపోతోంది. ఈ సమయంలో అల్పోష్ణస్థితి(హైపోథెర్మియా)కు గురవుతారు. దీని వల్ల శరీరంలో వేగంగా టెంపరేచర్ తగ్గిపోతుంది. హైపోథెర్మియాకు గురైన వారిలో వణుకు, కండరాలు పట్టేయడం, మాట్లాడటానికి ఇబ్బంది, అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన అనారోగ్య పరిస్థితి ఎక్కువగా చిన్న పిల్లలకు, వృద్ధులకు వస్తుంది. ఆయాసం, మానసిక సమస్యలు ఉన్న వారు తర్వాత హైపోథెర్మియాకు గురవుతారు. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ స్తంభించిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి, ఈ గడ్డకట్టించే చలిలో కొన్ని జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

హైపోథెర్మియా నివారణ మార్గాలు
* బయట చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు గడపొద్దు.
* నిండైన దుస్తువులు ధరించాలి. వదులుగా ఉండి.. శరీర మొత్తాన్ని కవర్ చేసే బట్టలు వేసుకోండి.
* బ్లడ్ సర్క్యూలేషన్ తగ్గించే అవకాశమున్న టైట్ డ్రెస్సులు వద్దు.
* శరీరంలో హీట్ తగ్గకుండా చూసుకోండి. ఎక్కువ చెమట వచ్చే పనులు మానుకోండి.
* ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నాన్-ఆల్కహాల్, కేఫిన్ లేని డ్రింక్స్ తాగాలి.
* ఆహారంలో సూప్, టీ.. ముతక తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. అవి శరీరానికి వెచ్చదనాన్ని తెస్తాయి. చలి ప్రభావాన్ని తగ్గిస్తాయి.
* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తేనె, అల్లం, పసుపు, తులసి.. బెల్లం వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.

Show More
Back to top button