
నేటి ఆధునిక కాలంలో ఏ రోగం ఎందుకు వస్తుందో.. ఏ వయసులో వస్తుందో అర్థం కాని పరిస్థితి. జీవనశైలిలో మార్పుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా రోగాల బారిన పడుతున్నారు. అలాంటి వాటిలో ఒకటే సర్వైకల్ స్పాండిలైటిస్. ఇది ఓ రకమైన వెన్ను నొప్పి.. ఈ నొప్పి కొందరికి తక్కువగా ఉంటే, కొందరికి ఎక్కువుగా ఉంటుంది. అసలు ఏంటి ఈ వెన్ను, నొప్పి ఎలా వస్తుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? వంటివి తెలుసుకుందాం.
సింపుల్‌గా చెప్పాలంటే.. వీపు దిగువ భాగంలో కండరాలు విపరీతంగా అలసిపోవటంతో వెన్ను నొప్పి మొదలవుతుంది. వీపు కింది భాగంలో ఉండే అనేక కండరాలు, లిగమెంట్స్ వెన్నుపూనలకు అతుక్కుని ఉండి మొత్తం వెన్నుని వీపు మధ్యలో నిలబెట్టి ఉంచుతుంటాయి. కూర్చుని, నిలబడి పనులు చేసే సమయంలో తెలియకుండానే ఆ కండరాలు విపరీతంగా సాగేట్లు చేస్తాం. ఫలితంగా వాటిపై ఒత్తిడి పెరిగి, వెన్నునొప్పికి దారితీస్తుంది. ఇవేకాకుండా సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వెన్ను నొప్పి మొదలైన వారిలో కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి.. ఆ కారణాలు, లక్షణాలు ఏంటో.. ముందుగానే తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోచ్చు.
సర్వైకల్ స్పాండిలైటిస్ కారణాలు..
* 2గంటల కంటే ఎక్కువ సేపు బైక్ డ్రైవింగ్
* ఎక్కువ సేపు కూర్చొని ఉండటం
* వెన్నెముకకు దెబ్బ తగలడం
* అధిక బరువును ఒకేసారి ఎత్తడం
* వయసు పెరగడంతో వెన్నెముక డిస్క్‌లలో అరుగుదల ఏర్పడడం
లక్షణాలు
* మెడ నుంచి భుజాల వరకు నొప్పి లేదా తిమ్మిర్లు
* మెడ కండరాలు బిగుసుకుపోవడం
* మెడ నొప్పితో తల కదల్చడం కష్టంగా మారడం
* చేతి కండరాలు బలహీనపడటం
* మూత్రవిసర్జనలో నియంత్రణ కోల్పోవడం
* కొందరిలో కళ్లు తిరగడం
* భుజాలు, చేతి వేళ్ల స్పర్శ తగ్గిపోవడం
* సరిగ్గా నిద్రపట్టకపోవడం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఎక్కువ సమయం కూర్చొని ఉండకండి.
* నిద్రపోయే సమయంలో తల కింద అనువైన దిండు వాడండి.
* యోగా, వ్యాయామం లాంటివి చేయండి.
* మానసిక ఆందోళన లేకుండా చూసుకోండి.
* అవసరం అనుకుంటే వేడి నీటితో లేదా ఐస్‌తో కాపడం పెట్టండి.
* ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.