Telugu NewsTRAVEL

భారతదేశ పర్యాటక ప్రదేశాలు.. వావ్ అనాల్సిందే..

నేడు జాతీయ పర్యాటక దినోత్సవం ఆధ్యాత్మిక పర్యాటక స్థలాలకు భారతావని నిలయం

భారతదేశంలో జనవరి 25 ను జాతీయ పర్యాటక దినోత్సవం గా జరుపుకుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యటకరంగం ప్రాముఖ్యమైనదిగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగం ప్రాముఖ్యతను తెలియజేస్తూ పర్యాటక దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. పర్యాటక రంగం వలన దేశానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని వాస్తవం.

పర్యాటకం గురించి కొన్ని మాటలు...

వినోదం, విశ్రాంతి,  ఆనందం కోసం కొన్ని ప్రదేశాలకు వెళ్లి గడపడాన్ని పర్యాటకం అంటారు.

కొందరికి వివిధ రకాల ఆహార పదార్థాలను తినాలని కోరిక ఉంటుంది. ఇంకొందరికి వస్త్రధారణ, అలంకరణ మీద ధ్యాస ఉంటుంది. మరికొందరికి డబ్బు ఇతర వ్యామోహాల పైన కోరిక ఉంటుంది. కానీ చాలామందికి పర్యటన అంటే థ్రిల్లింగ్ ఉంటుంది. యువత నుండి వృద్ధుల వరకు ఎక్కువమంది కొత్త కొత్త ప్రదేశాలను, సందర్శక ప్రాంతాలను, గుడులు, గోపురాలు అంటూ ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకొని వెళుతూ ఉంటారు. కొందరు కుటుంబ సభ్యులతో.. కొందరు స్నేహ బృందాలుగా.. మరికొందరు కపుల్స్  గా టూర్స్ కి వెళుతూ ఉంటారు. కొత్త కొత్త ప్రదేశాలను చూస్తూ పరవశించిపోతారు. అందమైన దృశ్యాలను తమ చరవాణిలోనూ, కెమెరాలలోను బంధించి ఆ మధుర గురుతులను  ఇతరులతో చెబుతూ  షేర్ చేసుకుంటారు. అందరూ టూర్స్ కు వెళ్లాలని ఆత్రుతతో ఉంటారు. అటువంటి పర్యాటకానికే ఒకరోజు ఉందని ఎంతమందికి తెలిసి ఉంటుంది.. ? అవును. పర్యాటక రంగం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక రోజుకు ప్రత్యేక స్థానం ఇచ్చింది. అదే జనవరి 25. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. 

పర్యాటక దినోత్సవం కోసం ప్రత్యేక కమిటీ…

పర్యటనతో ప్రజలు సేదతీరుతారు.  ఆ అద్భుత దృశ్యాలు హాయిని కల్పిస్తాయి. మరి అలాంటి పర్యాటక రంగానికి కూడా ఒకరోజు కల్పించాలంటూ.. 1948 వ సంవత్సరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి “టూరిస్ట్ ట్రాఫిక్” కమిటీని ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఢిల్లీ, ముంబై నగరాలలో కమిటీ యొక్క మొదటి ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయి. అనంతరం 1951 వ సంవత్సరంలో చెన్నై, కలకత్తా నగరాలలో సైతం మరిన్ని కార్యాలయాలు ప్రారంభించారు. తర్వాత 1958లో పర్యటకం అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖల ద్వారా ప్రత్యేకంగా పర్యాటక రంగానికి సంబంధించి ఒక విభా గం స్థాపించబడింది. దీనికి జాయింట్ సెక్రటరీ హోదాలో డిప్యూటీ జనరల్ నేతృత్వం వహిస్తారని నివేదిక పేర్కొంది.

సనాతన ధర్మానికి  నిలయం భరతభూమి

భారతదేశం అంటే సనాతన ధర్మం, బహుళ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. పురాతన నాగరికతలకు పెట్టింది పేరు. దేశం నలుమూలల నుండి యాత్రికుల సందర్శనకు అనేక గొప్ప గొప్ప సందర్శన ప్రాంతాలను ఆకర్షణీయమైన ప్రదేశాలను కలిగి ఉంది. భారతదేశ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేయడానికి పర్యాటక దినోత్సవం ఏర్పాటు చేశారు. 

రాయిలో కూడా దేవుడిని పూజించే గొప్ప సంస్కృతి ఉన్న  దేశం భారతదేశం. ఆధ్యాత్మికమైన, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలకు నిలయం భారతావని. విభిన్న సంస్కృతి, సాంప్రదాయలు, వైవిధ్య భరితమైన ప్రకృతి అందాలు, అద్భుతమైన సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలు, గలగల పారే గోదారమ్మ పరుగులు.. బిరబిరా నడిచే కృష్ణమ్మ నడకల సముదాయం భారతదేశ భూమి. అటువంటి భారతదేశానికి పర్యాటకులు ఎందరో దేశ, విదేశాల నుండి చేరుకొని తమ సంతోషకర లక్షణాలను గడుపుతారు.

సాహసోపేతమైన విహారయాత్రలు…

సాహసోపేతమైన విహారయాత్రలకు కూడా భారతదేశం పేరుపొందిందని చెప్పుకోవచ్చు. ఉదృతంగా ప్రవహించే నదులు, పర్వతశ్రేణులు, ట్రెక్కింగ్, క్యాంపింగ్, స్కై డ్రైవింగ్ ఎయిర్ బెలూనింగ్ వంటి ఉత్కంఠభరితమైన విహారయాత్రలు చేయవచ్చు.

ఆధ్యాత్మికత కోసం పవిత్ర స్థలాలు…

భరతభూమిలో ఆధ్యాత్మికతకు కొదువ ఉండదు. ఆధ్యాత్మికతలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ.. ఎంతోమంది హిందువులు, సర్వమతస్తులు తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలకు లోటు లేదు. హరిద్వార్, రిషికేష్, వారణాసి ఈ మూడు ప్రదేశాలు ఆధ్యాత్మిక సందర్శనకు మొదటి స్థానంలో ఉన్నాయి. హరిద్వార్ లోని గంగా ఘాట్ లో సాయంత్రం జరిగే నదీ హారతి వైభవంగా ఉంటుంది. నదిలో తెలియాలి మట్టి దీపాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ప్రదేశాలలో సంపూర్ణ ఆధ్యాత్మికతను అనుభవించవచ్చు.

అత్యధిక పర్యాటకులను ఆకర్షించే రాజస్థాన్…

దేశంలోని అగ్ర పర్యాటక ప్రదేశాలలో జైసల్మేర్, రాజస్థాన్ ఒకటిగా చెప్పవచ్చు. అక్కడ ఉంటే వెనుక తిరగడం ఇసుకలో జీపును ట్రైల్ చేయడం ఓ థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది. గ్రేట్ కచ్ లో జరిగే రాన్ ఆఫ్ కచ్  అని పిలవబడే వార్షికోత్సవం అద్భుత వేడుకలా కనిపిస్తుంది. ఈ ఉత్సవానికి వేల సంఖ్యలో పర్యటకులు హాజరవుతారు.

దేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు…

దేశవ్యాప్తంగా ఎన్నో  పరాటక ప్రదేశాలు ఉన్నాయి.  అందులో ప్రసిద్ధమైనవిగా చెప్పుకునే పర్యాటక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవి ఢిల్లీ, ఆగ్రా, సిమ్లా, మనాలి, కూర్గ్, ఊటీ, మన్నార్, గోవా, పాండిచ్చేరి, నైనిటాల్, మహాబలేశ్వర్, ఉదయపూర్, ద్వారక, సోమనాథ్, మదురై, అజంతా గుహాలు, గ్యాంగ్ టక్, డార్జిలింగ్ అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలుగా చెప్పవచ్చు.

ఉత్తమ పర్యాటక ప్రదేశాలు…

దేశవ్యాప్తంగా అనేక రకాలుగా మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ.. తాజ్ మహల్, రాజస్థాన్, కేరళ, గోవా, వారణాసి, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రముఖ ప్రదేశాలు ముందు స్థానంలో ఉన్నాయి.

భారతదేశంలో ప్రతి ప్రదేశం పర్యాటక ప్రదేశమే.. దేశ నలుమూలల నుండి ఎటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో తెలుసుకుందాం..

ఉత్తర భారత దేశంలో ప్రముఖ పర్యటక ప్రదేశాలు…

శ్రీనగర్ లోని దాల్ సరస్సు.  – గుర్గావ్ లోని సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. – వారణాసి లోని మున్సిపాట్.

బాన్గర్ కోట,  ఆల్వార్ లోని ప్రసిద్ధ కోట. – ఉదయపూర్ సిటీ ప్యాలెస్ – నైనిటాల్ నగరంలోని నైని సరస్సు 

ఢిల్లీలోని లోటస్ టెంపుల్ – లడక్ లోని పాంగొంగ్ మొరిరి, నుబ్రావ్యాలీ – గోల్డెన్ టెంపుల్ అమృతసర్

– ఖడ్జిమార్ హిమాచల్ ప్రదేశ్ – అయోధ్య నగరం రాముని జన్మస్థలం – కాశ్మీర్లోని పాహల్గాం – కాశ్మీర్లోని గుల్ మార్గ్, సొన్ మార్గ్ – ఢిల్లీలోని  లోది గార్డెన్స్, చతర్ పూర్ ఆలయం, అక్షరధామ్ ఆలయం 

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలు…

తిరుమల తిరుపతి దేవస్థానం – కర్ణాటకలోని మడికేరి, కూర్గ్ – కేరళ లోని రాణిపురం కొండలు

కేరళలోని బ్యాక్ వాటర్స్ లో హౌస్ బోట్ – హంపిలోని రాతిరథం – కుద్రేముఖ్ నేషనల్ పార్క్ లోని గడ్డి భూములు – మైసూర్ ప్యాలెస్ – తంజావూరు బృహదీశ్వరాలయం – కేరళ, ఇడుక్కి డ్యాం – శ్రావణ బేలగోళ గొమ్మటేశ్వర విగ్రహం – తీర దేవాలయం మహాబలిపురం – హేవ్ లాక్ ద్వీపంలో బీచ్ – నీల్ ద్వీపంలో సహజ వంతెన – అండమాన్ లోని జాలి బోల్స్ ద్వీపంలోని పగడపు దిబ్బ.

మధ్య భారత దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు…

చిత్రకూట జలపాతం జగదల్పూర్, దేశంలోనే అతిపెద్ద జలపాతం ఇది.

లక్ష్మణ దేవాలయం సిర్పూర్ – బెట ఘాట్ లోని మార్బుల్ ట్రాక్స్ – దుందర్ జలపాతం

గ్వాలిమర్ కోట భారత్ లోని అతి పురాతన కోట – మాండ్వా జలపాతాలు  – ఇండోర్ లోని రాజ్వాడ ప్యాలెస్

ఉజ్జయిని మహాకల్ లోక్ కారిడార్ – ఇండోర్ సమీపంలోని పాతలపాని జలపాతాలు – భోపాల్ లోని బోటింగ్ క్లబ్ సిటి ఆఫ్ లేక్స్ – భోపాల్ సమీపంలో సాంచి స్తూపం

భీమ్ బెట్కా రాక్ షెల్టర్స్ భూపాల్ సమీపంలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం

ఖజురహో దేవాలయాలు – పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్

పశ్చిమ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు…

స్టాట్యూ ఆఫ్ యూనిటీ – రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ – గోకర్ణ కర్ణాటక – మహారాష్ట్ర కోటలు – షిర్డీ సాయిబాబా ఆలయం – ఆలిబాగ్ సముద్ర తీరం మహారాష్ట్ర – ఎల్లోరా కైలాష్ దేవాలయం – ఎలిఫెంట్ గుహలు – గిర్ నేషనల్ పార్క్ – అజంతా గుహలు – లూనావలలోని పశ్చిమ కనుమలు

తూర్పు భారతదేశంలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలు…

కోణార్క్ సూర్య దేవాలయం – చిలికా సరస్సు

మేఘాలయలోని చిరపుంజిలో క్రాంగ్ సూరి జలపాతం, రెయిన్ బో జలపాతం, సావ్ డాంగ్ జలపాతం

శాంతి నికేతన్ – బక్కలి పశ్చిమ బెంగాల్ – నలంద విశ్వవిద్యాలయం -ఉమియం సరస్సు, దాకి తీరం మేఘాలయా – పార్శ్వా నాధుని శ్వేతాంబరాలయం – బుద్ధగయాలోని మహాబోధి ఆలయం – వేద ప్లానిటోరియం.

ఈశాన్య భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు…

సిక్కిం లోని గోచాల – అస్సాంలోని కజిరంగా – టిబేట్ రోడ్డు గ్యాంగ్ టక్ – ఎంజీ రోడ్డు గ్యాంగ్ టక్

మణిపూర్ లోక్ తక్  సరస్సు – అరుణాచల్ ప్రదేశ్ సేలాపాన్

భారతదేశంలోని యునెస్కో గుర్తింపు పొందిన పర్యాటక ప్రదేశాలు…

భారతదేశంలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలు ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాలలో ప్రపంచ వారసత్వ జాబితాలో 41 ప్రదేశాలు చేరాయి. వాటికి యునెస్కో గుర్తింపు లభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

● ఆంద్రప్రదేశ్ రాష్ట్రం: తిరుపతి, పాపికొండలు, బొర్ర గుహాలు, అరకులోయ, లంబసింగి, అమరేశ్వరాలయం.

● తెలంగాణ రాష్ట్రం: రామప్ప దేవాలయం ములుగు

● మహారాష్ట్ర: అజంతా గుహలు, చత్రపతి శివాజీ టెర్మినస్, ఎలిఫెంట్ గుహలు, ఎల్లోరా గుహలు.

● ఉత్తరప్రదేశ్: ఆగ్రా కోట, తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ.

● మధ్యప్రదేశ్: బీమ్ బెట్కా శిలా గుహలు, ఖజురహో, శాంతి స్తూపం.

● గుజరాత్: చంపనీర్, పావగడ్ పురావస్తవనం

● పశ్చిమ బెంగాల్: సుందరబన్స్ జాతీయ ఉద్యానవనం

● గోవా: గోవా చర్చిలు, కాన్వెంట్లు

● తమిళనాడు: చోళులు నిర్మించిన మహాదేవాలయాలు, మహాబలిపురం, స్మారక కట్టడాలు

● కర్ణాటక: పట్టాడకల్ స్మారక కట్టడాలు

● ఢిల్లీ: కుతుబ్మినార్, హుమాయున్ సమాధి, ఎర్రకోట

● అస్సాం: కాజీ రంగా జాతీయ వనం, మానస్ జాతీయవనం

● రాజస్థాన్: కియో లాడియో జాతీయ వనం, జంతర్ మంతర్ వేదశాల

● బీహార్: మహాబోధి దేవాలయం

● ఉత్తరాంచల్: నందా దేవి జాతీయవనం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ వనం

● ఒడిస్సా:  కోణార్క్ సూర్యదేవాలయం

● మేఘాలయ: శాంతినికేతన్

Show More
Back to top button