CINEMATelugu Cinema

మిరాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ 

హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుండి వచ్చిన మిరాయ్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌తో పెరిగిన హైప్‌, ప్రమోషన్స్‌తో మరింత ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ అయ్యింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది?

కథాంశం

క్రీ.పూ. 232లో కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపానికి లోనైన సామ్రాట్ అశోకుడు, తన దివ్యశక్తులను తొమ్మిది గ్రంథాలలో దాచిపెడతాడు. వాటిని తరతరాలుగా యోధులు కాపాడుతుంటారు. కానీ మహావీర్ లామా (మంచు మనోజ్) ఎనిమిది గ్రంథాలను చేజిక్కించుకొని, తొమ్మిదో గ్రంథం కోసం అంభిక (శ్రియా శరన్)పై దాడి చేస్తాడు. తన కొడుకు వేద (తేజ సజ్జా)నే ఆ గ్రంథాన్ని రక్షించగలవాడిగా తయారు చేస్తుంది. వేద, శ్రీరాముడి కోదండం అనే ‘మిరాయ్‌’ ఆయుధాన్ని వెతికే ప్రయాణం ఈ కథ.

నటీనటుల ప్రదర్శన

తేజ సజ్జా వేద పాత్రలో సరైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. యాక్షన్, ఎమోషన్ రెండింటిలోనూ నెగ్గాడు. మంచు మనోజ్‌ విలన్‌గా గట్టిగా ఇంప్రెస్ చేశాడు. ఆయనకు ఉన్న ఎలివేషన్స్‌ సినిమాకు ప్లస్‌. శ్రియా శరన్‌ తక్కువ సీన్ టైమ్ ఉన్నప్పటికీ కీలకంగా కనిపించింది. జయరాం, రితికా నాయక్‌, జగపతి బాబు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

గౌర హరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సినిమాకు ప్రధాన బలం. సంపాతి ఎపిసోడ్‌, రాముడి ఎపిసోడ్‌లలో బీజీఎం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్‌ బడ్జెట్‌కి తగ్గట్టే అద్భుతంగా చేశారు. ఎడిటింగ్‌ పర్వాలేదు.

చివరిగా..

మిరాయ్‌ విజువల్స్‌, బీజీఎం, నటీనటుల నటనతో ఆకట్టుకున్నా, కథనం కొంత స్లోగా సాగుతుంది. అయినా ఇది తేజ సజ్జా కెరీర్‌లో మరో మంచి అడుగు.

రేటింగ్: 3/5

Show More
Back to top button