Telugu News

ఇతరులనుచూసి.స్టాక్ కొంటున్నారా.?

పెట్టుబడులు పెట్టడం చాలామంది విషయం. ఇన్వెస్ట్‌మెంట్ వల్ల డబ్బుతో డబ్బు సంపాదించినట్లే. కానీ, చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ఇతరులను చూసి.. వాళ్లలాగా ఇన్వెస్ట్ చేయడం. వారు ఎందులో పెట్టుబడులు పెడితే.. వీరు కూడా అందులోనే పెట్టుబడులు పెడుతుంటారు. ఇలా ఒకరి కాపీ కొట్టి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. ఎందుకు పక్కవారిని చూసి స్టాక్స్ కొనకూడదో ఇక్కడ చూడండి..

మీ లక్ష్యాలు వేరు.. వారి లక్ష్యాలు వేరు: మీ పొరుగువారు ఆ స్టాక్‌ను కేవలం రెండు నెలల లాభం కోసం కొని ఉండవచ్చు. కానీ మీరు మీ కూతురి పెళ్లి కోసమో లేదా రిటైర్మెంట్ కోసమో పెట్టుబడి పెడుతుండవచ్చు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులకు వ్యత్యాసం ఉంటుంది.

రిస్క్ తీసుకునే సామర్థ్యం: ఒకవేళ ఆ స్టాక్ 20% పడిపోతే, మీ పొరుగువారికి అది పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ అదే నష్టం మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయవచ్చు. అందరి రిస్క్ తీసుకునే శక్తి ఒకేలా ఉండదు.

ఎగ్జిట్ ప్లాన్: వారు ఆ స్టాక్‌ను ఎప్పుడు అమ్మేయాలో ముందే నిర్ణయించుకుని ఉంటారు. లాభం రాగానే వారు సైలెంట్‌గా బయటకు వచ్చేస్తారు. కానీ మీరు మాత్రం “ఇంకా పెరుగుతుంది” అనే ఆశతో ఉండిపోయి, చివరకు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

సగం జ్ఞానం ప్రమాదకరం: మీ స్నేహితుడు ఆ కంపెనీ గురించి పూర్తి పరిశోధన చేసి ఉండవచ్చు. వారు కొన్నప్పుడు ఆ షేర్ ధర తక్కువగా ఉండవచ్చు. మీరు కొనే సమయానికి అది గరిష్ట స్థాయికి చేరి ఉంటే.. పెరిగిన ధర వద్ద కొనడం అంటే నష్టాన్ని ఆహ్వానించడమే.

Show More
Back to top button