Telugu News

స్వేచ్చ భారతం కోసం.. ఉరి కొయ్యను ముద్దాడిన విప్లవవీరుల దినోత్సవం..షహిద్ దివాస్..!

3 సంవత్సరాల వయసులో తుపాకీ మొక్కలు నాటిన విప్లవ వీరుడు. 20 సంవత్సరాల వయసులోనే బ్రిటీషర్స్ ను గడగడలాడించిన యువ నాయకుడు. 23 సంవత్సరాల భారతమాతను దాస్య సుంకలాల నుంచి విడిపించడం కోసం ప్రాణత్యాగం చేసి ప్రతి భారతీయుడిలో విప్లవాన్ని రగిల్చిన విప్లవకారుడు. 

ఉరికొయ్యను ముద్దాడిన యోధుడు.. భారతమాత కన్న మరో ముద్దుబిడ్డ. 

అతడే భగత్ సింగ్.. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగానికి ఒడిగట్టిన తీరు ప్రతి భారతీయుడుకి గర్వకారణం. భగత్ సింగ్, తనతో పాటు తన స్నేహితులైన సుఖ్ దేవ్ సింగ్, రాజ్ గురులకు ఉరి శిక్ష ఖరారు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే తొలుత 1931 మార్చి 24న వీరికి ఉరిశిక్ష విధించాలని తేదీని ఖరారు చేసింది. ఆ ప్రకటనతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని భయపడిపోయి, వారిని, ఆ ముందు రోజు మార్చి 23న అంటే దాదాపు 7 గంటల ముందే ఉరి వేసింది. క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉరి తాడును వేలాడదీసినప్పుడు… దాన్ని ముద్దాడి… మృత్యువును ఆహ్వానించి, అమరుడైన భగత్ సింగ్ బాల్యం, ఉద్యమ జీవిత విశేషాలను తెలుసుకుందాం..

జననం…

1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లోని లాహోర్ జిల్లాలో ఖత్కర్ కాలన్ అనే గ్రామంలో కిషన్ సింగ్, విధ్యవతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. బాల్యంలో తన తండ్రి భగత్ సింగ్ ను ఎత్తుకొని ఆయన మిత్రుడైన నందకిశోర్ మెహతాతో కలిసి తోటని చూడడానికి వెళ్లారు. అక్కడ భగత్ సింగ్ చిన్న చిన్న మొక్కలు, గడ్డి పరకలు నాటుతుండగా, భగత్ సింగ్ నాన్న ఉండి, ఏం చేస్తున్నావని అడిగితే తుపాకీలు నాటుతున్నానని అన్నాడట. అది విని వారిద్దరూ ఆశ్చర్యపోయారట. 

భగత్ సింగ్ తన అన్న జగత్ సింగ్ తో కలిసి స్కూల్ కి వెళ్లి, ఆడుకునేవారు. సరదాగా సాగిపోతున్న వారి బాల్యంలో, అనారోగ్యం కారణంగా 11 సంవత్సరాల వయసులో జగత్ సింగ్ మరణించాడు. ఇది తెలిసి భగత్ సింగ్ చాలా బాధ పడ్డాడు. అక్కడే ఉంటే చనిపోయిన అన్న గుర్తొస్తున్నాడని, వారంతా ఆ ఊరిని వదిలేసి, కొంత పొలం ఉన్న నవన్ కోట అనే గ్రామానికి వెళ్లిపోయారు. ఆ ఊర్లో భగత్ సింగ్ ను హై స్కూల్లో చేర్పించాలనుకున్నారు. అక్కడ పనిచేసేవారు బ్రిటిష్ వారికి తొత్తుల్లా, బానిసల్లా పనిచేస్తున్నారని గ్రహించి, దయానంద సరస్వతి ఆధ్వర్యంలో నడుస్తున్న డిఏవీ దయానంద్ ఆంగ్ల వేదిక స్కూల్ లో చేర్పించాడు.

1919 ఏప్రిల్ 15న  జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో సిక్కులు ప్రార్ధన చేస్తున్న సమయంలో అనేకమంది సిక్కులను బ్రిటిష్ అధికారి డయ్యర్ ఆధ్వర్యంలో సైనికులు పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపేశారు. దీనిలో దాదాపు 1000 మంది సిక్కులు చనిపోయారు. ఆ తరువాతి రోజు తన తండ్రితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు అతడి రక్తం మరిగిపోయింది. బ్రిటిష్ వారంటే మరింత కోపం పెరిగిన సంఘటన అదే..

1921 వచ్చేసరికి గాంధీజీ రాజకీయాల్లో చురుకుగా ఉంటూ అహింసా మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఈ ఉద్యమానికి చిన్నా పెద్దా అంతా మద్దతునిస్తూ గాంధీజీ వెనుక నడిచారు. ఉత్తరప్రదేశ్ చౌరీ చౌరా అనే గ్రామంలో ఒక బట్టల షాపును తగలబెట్టడంతో అది హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఈ ఉద్యమాన్ని అంతటితో నిలిపివేశారు. యువకులందరూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెయ్యాలని భావించారు. అప్పుడే మన భగత్ సింగ్.. వాళ్లు నిర్వహించిన సభలు, సమావేశాలకు హాజరయ్యాడు. వాళ్లకు తన వంతు సహయం చేసేవాడు. విప్లవకారులందర్నీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం మొదలు పెట్టింది. భగత్ సింగ్ ని అరెస్ట్ చేస్తారేమోనని భావించి కొడుకుని తల్లి కాన్పూర్ పంపించింది.

కాన్పూర్ వచ్చాక గణేష్ శంకర్, జోగేష్ చంద్ర ఛటర్జీ అనే ఇద్దరు విప్లవంలోనే స్వతంత్రం వస్తుందని నమ్మి, హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ను స్థాపించారు. భగత్ సింగ్ కు ఇది నచ్చి, వీరితో పరిచయం ఏర్పడటంతో కలిసి ఆ సంస్థలో చేరాడు. తన పేరును బలవంత్ గా మార్చుకొని జోగేష్ చంద్ర ఛటర్జీతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. అప్పటికి తన వయసు 15. ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేశాక 1925 ఆగస్టు 5న నాపకొరే అనే గ్రామంలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మరికొంతమంది కలిసి రైలు దోపిడీ చేశారు. దీంతో బ్రిటిష్ వారు ఉద్యమాలు చేసేవారిని కొట్టడం, ఆపై అరెస్టులు చేయడంతో అక్కడ నుంచి లాహోర్ కి వచ్చి, కాలేజీలో చేరాడు. అనేక పుస్తకాలు చదివాడు. బ్రిటిషర్లు భారత్ లోకి ఎలా చొరబడ్డారు?, ఎందుకు వచ్చారనే విషయాలను తెలుసుకున్నాడు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడే 1925 డిసెంబర్ 19న పకొరి రైలు దోపిడిలో దొరికినవారికి ఉరిశిక్ష వేశారు. దాంతో హెచ్ ఆర్ఏ సంఘం బలహీనపడింది.

వారి మరణం, వారి తప్పులేకుండానే జరిగిందని ఊరూరు తిరిగి బ్రిటీషర్ల పట్ల వ్యతిరేకతను మొదలుపెట్టాడు. లాహోర్ లో ఊరేగింపు జరుగుతుండగా ఎవరో బాంబు దాడి చేశారు. దాంతో దొరికిన వాళ్లని దొరికినట్లుగా ఉద్యమకారులని అరెస్ట్ చేశారు. అలానే భగత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. కోర్టుకి కేసు వెళ్లినప్పుడు భగత్ సింగ్ వి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో రూ. 60,000ల జరిమానా కట్టి, తనను విడిపించుకోవాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తన తండ్రి ఆ డబ్బుని కట్టి, భగత్ సింగ్ ను విడిపించాడు. ఆ తరువాత నవ జవాన్ భారత్ సభ అనే సంస్థను స్థాపించి యువతను ఒక తాటి పైకి తెచ్చాడు.

భారత్ లో స్వతంత్ర ఉద్యమాలను అరికట్టడానికి లాలా లజపతి రాయ్ ని చంపేశారు. ఈ సంఘటనను తట్టుకోలేక నెల రోజుల తరువాత రాజ్ గురు, భగత్ సింగ్ లు స్కాట్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొంతమంది పోలీసులు, ఏఎస్పీ స్కాండర్ చనిపోయారు. అక్కడ్నుంచి తప్పించుకొని రహస్య స్థావరానికి వెళ్లిపోయారిద్దరు. వెంటనే పోలీస్ బెటాలియన్ మొత్తం దిగింది. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారన్న విషయం భగత్ సింగ్ కి తెలిసింది. వెంటనే అక్కడ నుంచి లాహోర్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడు భగవతి చరణ్ ఊహారా భార్య సాయం అడిగి భగత్ సింగ్ తన జుట్టు కత్తిరించుకొని, గడ్డం తీయించుకొని యూరోపియన్ లాగా వేషం మార్చుకొని, లక్నో వెళ్లాడు. ఆగ్రా వెళ్లి బాంబులు తయారు చేయడం నేర్చుకున్నాడు.

1929 లార్డ్ ఐర్విన్ రెండు బిల్లులు ప్రవేశపెట్టాలనుకున్నారు.  అవి: పబ్లిక్ సెల్ఫ్ బిల్, ట్రేడ్ డీస్ప్యూట్ బిల్.

మొదటి బిల్ ఏంటంటే, పబ్లిక్ సేఫ్టీ కోసం ఏ ఒక్కరినైనా ఏ సమయంలోనైనా అరెస్ట్ చేసే అధికారం గవర్నమెంట్ కి ఉంటుందని ఈ బిల్ చెప్తుంది. 

దీనర్థం లేబర్స్ యూనియన్స్ పెట్టొద్దని ఎందుకంటే తక్కువ వేతనాలు ఇచ్చినప్పటికీ, తిరిగి ప్రశ్నించేవారు వుండరు. ఈ రెండు బిల్లులను పెట్టడం వల్ల మన దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇవి మనల్ని అణిచివేయడానికి చేసినవే అని, దీనికి నిరసనగా అసెంబ్లీలో బాంబు దాడి చేయాల్సిందేనని భగత్ సింగ్ భావిస్తాడు. కాకపోతే ఎవరికి ప్రాణనష్టం జరగకూడదని అనుకుంటాడు. అలాగే అసెంబ్లీలో ఎవరు లేని చోట బాంబు పేల్చి, కేవలం నిరసనను మాత్రమే తెలియజేయాలనుకుంటాడు. సుఖ్ దేవ్, ఆజాద్, భగత్ సింగ్ ఆగ్రాలో కలిసి, చర్చించి పక్కాగా ప్లాన్ చేశారు.

1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, బట్కేసరి ఇద్దరు కలిసి అసెంబ్లీకి వెళ్లి ఎవరు లేనిచోట మరోమారు బాంబును విసురుతారు. ప్రాణనష్టం ఏమాత్రం జరగలేదు. కానీ వారిద్దరూ పారిపోకుండా పోలీసులకి దొరికిపోయారు. అసెంబ్లీలో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదాలు చేస్తూ జైలుకు వెళ్లారు భగత్ సింగ్, బట్కేసరిలు. 

దేశంలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి, ప్రజలకు తెలియజెప్పడానికి చేసిన ఈ చర్యతో.. ప్రజలు ఈ విషయాలను పత్రికల ద్వారా తెలుసుకొని, మరింత ప్రభావితులు కావాలని, బాంబు దాడి అనంతరం వాళ్లే స్వయంగా లొంగిపోయారు. భగత్ సింగ్ ను మొదట ఢిల్లీ జైల్లో పెట్టారు. అక్కడి నుంచి లాహోర్ జైల్లో ఉంచారు. ఇక్కడ ఖైదీలను తీవ్రంగా హింసించేవాళ్లు. అందుకు వ్యతిరేకంగా భగత్ సింగ్ మిగిలిన ఖైదీలతో కలిసి జైల్లోనే నిరాహారదీక్ష చేశాడు. ఈ దీక్షతో 1929 సెప్టెంబర్ 13న జతిన్ దాస్ చనిపోయారు. ఇది దేశమంతా పాకింది. సుభాష్ చంద్రబోస్ వచ్చి బ్రిటిష్ వారి అరాచకాలను తీవ్రంగా ఖండించారు. చివరిగా బ్రిటిషర్లు భగత్ సింగ్ డిమాండ్ లకు తలవంచారు. ఈ దీక్ష మొదలైన119 రోజులకి, అంటే 1929 అక్టోబర్ 5న భగత్ సింగ్ దీక్ష విరమించాడు. దీంతో భగత్ సింగ్ పై రకరకాల కేసులు మోపడం జరిగింది. అతడ్ని చంపాలని 450 మంది దొంగ సాక్ష్యులను కోర్టులో హాజరుపరిచి, భగత్ సింగకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించారు.

1930 అక్టోబర్ 7న భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు ఉరి శిక్ష విధించింది. భగత్ సింగ్ ను విడిపించడాని తన తండ్రి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అది భగత్ సింగ్ కు ఇష్టం లేదు. చంద్ర శేఖర్ ఆజాద్ ఏకంగా పోలీస్ స్టేషన్ గోడలు ధ్వంసం చేయాలని చూశాడు. అయితే భగవతి చరణ్ బాంబు తయారు చేస్తున్న సమయంలో పిన్ వదులుగా ఉండటం వల్ల అది పేలి అక్కడికక్కడే మరణించాడు. ఈ సమయంలో  గాంధీజీ వీటికి పరిష్కారంగా ఇర్విన్ కు అనేక ఉత్తరాలు రాశారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అంతగా స్పందించలేదు.

కాగా ఆ ముగ్గురుని 1931 మార్చి 24న ఉరి తీయడానికి సిద్ధమైంది బ్రిటిష్ ప్రభుత్వం. దీనికి దేశ ప్రజలంతా ఆగ్రహ జ్వాలతో ఊగిపోయారు. అందువల్ల దానికన్నా ముందు రోజైన, మార్చి 23న రాత్రి 7 గంటలకు  వీరిని ఉరితీయడం జరిగింది. ఆ తరువాత సట్లెజ్ నది ఒడ్డున వారి అంత్యక్రియలు జరిగాయి. దీంతో ప్రతి ఏటా వారిని గుర్తు చేసుకుంటూ, మార్చి 23న దేశమంతటా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 

Show More
Back to top button