
ఎప్పుడు యంగ్ లుక్ లో కనిపించాలని ప్రతి ఒక్కరూ తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం ఎన్నో ఫేస్ క్రీమ్ లు, బ్యూటీ ప్రొడక్ట్ లను తెగ వాడేస్తుంటారు. ఎన్ని వాడినా అప్పటికప్పుడు ఎదో తేడా కనిపించినా.. శాశ్వత పరిష్కారం మాత్రం దొరకదు… అయితే ఈసారి ఇలా చేసి చూడండి.. తప్పకుండా తేడా కనిపిస్తుంది…
గుడ్డులోని తెల్లసొన… గుడ్డు ప్రొటీన్లకు కేరాఫ్ లాంటిది. అందుకే రోజుకో గుడ్డు తినాలని అంటారు డాక్టర్లు. ముఖంపై వచ్చే ముడతలకు ఇది ఉపాయకారిగా పని చేస్తుంది. ఇందుకు గుడ్డులోని తెల్లసొనను తీసుకొని నేరుగా చర్మంపై అప్లై చేయాలి. ఆపై మృదువుగా మసాజ్ చేసి ఓ పావుగంటసేపు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే సరి. ఇందులోని విటమిన్ల వల్ల మీ చర్మంపై ముడతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
ఆలివ్ నూనె… రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల ఆలివ్ నూనెతో ఫేస్ పై క్లాక్, ఆంటీక్లాక్ డైరెక్షన్ లో మసాజ్ చేయాలి. తర్వాత మృదువైన న్యాప్ కీన్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
కలబంద… దీనిలో మాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. నేచురల్ ఏజింగ్ క్రీమ్ లా బాగా పనిచేస్తుంది. ఇది రోజు ఫేస్ వాష్ లా వాడినప్పటికి, ఓ పదిహేను నిమిషాలు ఉంచుకొని, ఆరాక కడిగేస్తే చాలు. ముఖం కాంతివంతంగా మారుతుంది.
అరటిపండు… అరటిపండు నేరుగా తిన్నా కూడా ముఖంపై అప్లై చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇందుకోసం బాగా పండిన అరటిపండును పేస్టులా చేసి చర్మం ముడతలు పడిన చోట రాసి, అరగంట అయ్యాక ముఖం కడుక్కోవాలి. మొత్తంగా పండునే కాక కొద్దిగా ఆవకాడో, తేనెను కలిపి మిశ్రమంగా పెట్టుకోవచ్చు.
వీటన్నిటితో పాటు డైలీ నీరు ఎక్కువగా తాగడం వల్ల మన చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రధానంగా డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది. దీంతో చర్మం పొడిబారకుండా తేమను కలిగి ఉంటుంది. కాబట్టి రోజూకు రెండు లీటర్లకు తగ్గకుండా నీరు తీసుకోవడం మంచిది.