Telugu News

OYO విజయ గాధ..

OYO గురించి తెలియని వారంటూ ఈ రోజుల్లో ఎవరూ లేరు. తీర్థయాత్రకు వెళ్లేవారు, స్నేహితులతో సరదాగా సమయం గడపాలి అనుకునే వారు ఓయో ఫ్లాట్‌ఫాంను వినియోగిస్తున్నారు. ఇలా ప్రతీ ప్రదేశంలో హోటల్‌ను ఏర్పాటు చేసి ప్రయణికులకు హోటల్‌/రూం సౌకర్యాన్ని తక్కువ ధరకు అందిస్తుంది. హోటల్‌లు, గృహాలు, నివాస స్థలాలలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నహోటల్ చెయిన్‌ OYO. మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ ఘన విజయం సాధించింది ఒక కాలేజీ డ్రాప్-అవుట్ విద్యార్థి. అతడే రితేష్ అగర్వాల్‌. ఇతను ఎప్పటి నుంచో సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన ఉన్నాడు. దానివల్లే విజయం సాధించారు. అలాంటి విజయాన్ని గురించి తెలుసుకుందామా..

రితేష్ అగర్వాల్‌ ఒడిశాలోని రాయగడలో జన్మించారు. తన పాఠశాల విద్య పూర్తి అయ్యాక కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, కోడింగ్‌లో ఉన్నఇంట్రెస్ట్‌తో కాలేజిలో చేరారు. కానీ డ్రాప్-అవుట్ అయ్యారు. దానితో చాలా ఖాళీ సమయం దొరికింది. అందుకని ఆ సమయన్ని ఉపయోగించి “ఎ కంప్లీట్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ టాప్ 100 ఇంజినీరింగ్ కాలేజీ” అనే పుస్తకంపై పని చేయడం ప్రారంభించారు.. అది హిట్ అయ్యింది. ఆ తర్వాత కేవలం 17 సంవత్సరాల వయస్సులో అంటే 2011లో అతను ఒరావెల్ స్టే పై ఆలోచనతో ముందుకు వచ్చాడు. దాని తర్వాత 2013లో OYOగా ప్రారంభించబడింది. ఇది మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి చెందింది.

2020లో కైలీ జెన్నర్ తర్వాత, రితేష్ అగర్వాల్ ప్రపంచంలోనే అత్యంత చిన్నవయస్సు వాడైన స్వీయ-నిర్మిత బిలియనీర్‌ అనే ఘనత సాధించాడు. ఈ విజయాలతో పాటు కంపెనీ అనేక సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదు. పట్టు విడవకుండా సాధించాలనే ఒక లక్ష్యంతో సాగిపోతున్నా రితేష్ ఒపిక, తెలివి వల్ల వచ్చిన సక్సెస్. కోవిడ్ దెబ్బకు ప్రభావితమైన వ్యాపారాల్లో ఇది ఒకటి. అయినప్పటికీ వ్యాపారం సాగించారు. దీన్ని భారతదేశంలో ప్రారంభించారు. ప్రస్తుతం అది ప్రపంచంలోనే 80 కంటే ఎక్కువ దేశాలలో, 800 నగరాల్లో పనిచేస్తుంది.

కంపెనీ తన అంతర్జాతీయ విస్తరణ 2018లో మలేషియాతో ప్రారంభించి యూకే, దుబాయ్, చైనా, సింగపూర్, ఇండోనేషియా వంటి దేశాల వరకు విస్తరించింది. ఇది 2018లో 75 మిలియన్ల గ్లోబల్ స్టేడ్ రూమ్ నైట్‌లను రికార్డ్ చేసింది. ఇది 2017 కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని సేకరించింది. ఓయో 2019లో $951 మిలియన్ల ఆదాయాన్ని సంపాదించింది. ప్రస్తుతం ఇది 43వేల హోటళ్లలో పది లక్షల కంటే ఎక్కువ గదులను కొనుగోలు చేసింది. దాని వెకేషన్ హోమ్స్ వ్యాపారం ద్వారా, కంపెనీ ప్రయాణికులు, నగరవాసులకు ప్రపంచవ్యాప్తంగా 130,000 గృహాలను అందిస్తుంది.  

Show More
Back to top button