TRAVEL ATTRACTIONS

బిజీ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని. హార్స్లీ హిల్స్‌కి వెళ్లిపోదామా.?

ఇది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 4,100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్‌కి “ఆంధ్ర ఒటీ” అని కూడా అంటారు. చుట్టూ పచ్చని చెట్లు, హాయిగా వీస్తున్న గాలి, మేఘాలతో కప్పబడిన కొండలు.. హార్స్లీ హిల్స్‌కు వెళ్లిన ప్రతీసారి ఏదో కొత్త అనుభూతినిస్తాయి.

ఇక్కడికి వెళ్లాలంటే పెద్దగా ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మార్గం అందుబాటులో ఉంటుంది. పైకి వెళ్లే దారంతా అందమైన వృక్షాలతో నిండిపోయి ఉంటుంది. అక్కడి రాళ్ల మీద కూర్చుని కింద వైపు ఉన్న వ్యూ చూస్తుంటే ఒత్తిడి అన్నదే మరిచిపోతారు. ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫీ ఇష్టపడే వాళ్లకు హార్స్లీ బెస్ట్ ప్లేస్. అలాగే అక్కడున్న zoo park, wind rock point, వేంకటేశ్వర టెంపుల్, గాలి గుట్ట, viewpoint parkలూ చూడదగినవి. కొంచెం చలిగా ఉండే ఈ హిల్ స్టేషన్‌కి వేసవిలో వెళ్లడం అయితే ఇంకా బెస్ట్.

తెలుగు రాష్ట్రాల నుంచి హార్స్లీ హిల్స్‌కి వెళ్లాలంటే మొదటగా మదనపల్లెకు చేరాలి. హైదరాబాద్‌, విజయవాడ, కర్నూల్, తిరుపతి నుంచి మదనపల్లెకు బస్సులు, రైళ్లు ఉంటాయి. అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సులో హార్స్లీకి 15–20 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. వ్యక్తిగత వాహనంలో వెళ్లినా మంచి డ్రైవ్ అనిపిస్తుంది. ఈ టూర్‌కి రెండు రోజులు సరిపోతుంది.

ఆహారానికి రోజుకు ఒక్కరికీ రూ.200 నుంచి రూ.400 వరకు ఖర్చవుతుంది.

నివసించడానికి టూరిస్ట్ రెస్ట్హౌస్‌లు, ప్రైవేట్ హోటళ్లు ఉంటాయి. ఒక రూం రోజుకి రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉంటుంది. ముందుగా బుకింగ్ చేసుకుంటే బెటర్.

చిన్న షాపుల్లో చిత్తూరు స్పెషల్స్, హ్యాండ్‌మేడ్ వస్తువులు దొరుకుతాయి. షాపింగ్‌కు చిన్న బడ్జెట్ తీసుకెళ్లితే సరిపోతుంది.

Show More
Back to top button