
ఆమె ఆత్మవిశ్వాసం అంతరిక్షమంత. ఆమె ధైర్యం హిమాలయమంత. ప్రపంచ మహిళా లోకానికి ఆమె జీవితమే ఒక అద్వితీయ ఆదర్శం. ఆమె పట్టుదలకు ఉడుం కూడా తోక ముడిచింది. ఆమె చూపిన అంకితభావం అనన్యసామాన్యం. భారతీయ సంతతికి చెందిన ఆమె పేరు ప్రపంచవ్యాప్త 8.2 బిలియన్ల విశ్వ మానవాళి నాలుకల్లో నాట్యమాడుతోంది. ఆమె అంతరిక్ష ప్రయాణం ప్రపంచవ్యాప్త 402 కోట్ల మహిళా లోకానికి ధైర్యం నూరి పోయిన వైనం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 8 రోజుల్లో రావలసిన ఆమె ప్రయాణం అనివార్య కారణాల వల్ల 288 రోజుల పాటు పొడిగించబడి, చివరకు ఉత్కంఠకు తెర దించి భూమాత ఒడికి సురక్షితంగా చేరడం మహదానందదాయకం. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండడం వల్ల తన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని శతకోటా దేవతలను వేసుకుందాం. శబాష్ సునిత అని ఆశీర్వదిద్దాం.
సునీతా విలియమ్స్ వ్యక్తిగత ఘనత:
వ్యోమగామి, అంతరిక్ష పరిశోధకురాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర కమాండర్, రిటైర్డ్ నావీ ఆఫీసర్, అనుభవం కలిగి స్పేస్‌వాకర్‌గా సినీతారా విలియమ్స్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పదే పదే రుజువు చేసుకున్నారు. అంతరిక్షంలో (9 సార్లు) 62 గంటల 6 నిమిషాలు నడిచి రికార్డును నెలకొల్పిన సునిత 2012, 2016, 2024-25ల్లో మూడు సార్లు విజయవంతంగా అంతరిక్షయానం చేశారు. మొత్తంగా 608 రోజుల 20 నిమిషాల పాటు అంతరిక్షంలో గడిపిన సునితో విలియమ్స్. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన 2వ మహిళగా రికార్డును నెలకొల్పిన ఘనత మన సునితది. 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో అత్యధిక కాలం పాటు సంచరించిన జాబితాలో 4వ స్థానం పొందిన వ్యోమగామిగా చరిత్ర సృష్టించింది.
సునీతా విలియమ్స్ బాల్యం – విద్యాభ్యాసం – నావల్ అధికారిగా సేవలు
గుజరాత్‌కు చెందిన బోను పాండ్యా – దీపక్ పాండ్యా దంపతులకు కూతురుగా సునీతా విలియమ్స్ అమెరికాలో 19 సెప్టెంబర్ 1965న జన్మించారు. 1083లో నీధమ్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్, యూఎస్ నావల్ అకాడమీలో బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ మెనేజ్‌మెంట్ పిజీ డిగ్రీ పూర్తి చేశారు. 1987 నుంచి యూఎస్ నావీలో కమీషన్ పొంది 2017 వరకు అమెరిన్ నావల్ విభాగంలో పలు బాధ్యతలు నిర్వహించారు.
అమూల్య నాసా కెరీర్:
1998లో జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి వ్యోమగామిగా శిక్షణ పొందిన యునికా విలియమ్స్ తొలిసారి 2006-07లో (09 డిసెంబర్ 2006 నుంచి 22 జూన్ 2007 వరకు) డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం చేశారు. 2వ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర యాత్రను జూలై 2012న ప్రారంభించి నవంబర్ 18, 2012 వరకు పూర్తి చేసింది. ఎనిమిది రోజుల పాటు చేసిన 3వ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర యాత్ర 05 జూన్ 2024లో ప్రారంభమైన వారం తర్వాత తిరిగి రావలసి ఉన్నది. కాని స్పేస్‌క్రాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక కారణాలతో తన తిరుగు ప్రయాణం పొడిగించబడుతూ చివరకు 18 మార్చి 2025 రాత్రి భూతలంపై సురక్షితంగా చేరడంతో గత 9 నెలల ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది.
వ్యక్తిగత విషయాలు:
మైఖేల్ జె. విలియమ్స్‌ను వివాహమాడిన సునిత తదనంతరం ఒక బాలికను దత్తత తీసుకున్నారు. హిందూ మత ఆచారాలను నిష్టగా నమ్మే సునీత 2006 అంతరిక్ష యాత్రలో భగవద్గీతను కూడా తోడుగా తీసుకు వెళ్లారు. 2007లో భారత్ వచ్చినపుడు సాబర్మతీ ఆశ్రమం కూడా సందర్శించింది 2012లో ఓం సంకేతం కలిగిన ఉపనిషత్తులను తీసుకొని అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
పురస్కారాలు-అవార్డులు:
సునీతా విలియమ్స్ చేసిన అమూల్య సేవలకు గుర్తుగా డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్, లీజియన్ ఆఫ్ మెరిట్, నావీ కమెండేషన్ మెడల్, నావీ అండ్ మెరైన్ కార్ప్స్ అచీవ్‌మెంట్ అవార్డు, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్, భారత ప్రభుత్వ పద్మ విభూషన్, గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, గోల్డెన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ విశ్వ ప్రతిభ పురస్కారం, 2024లో బిబిసి రూపొందిందని 100 మంది ప్రతిభగల ప్రపంచ మహిళల జాబితాలో చోటు దక్కించుకోవడం లాంటి అవార్డులు లేదా విశిష్ట సేవా పురస్కారాలు ఆమెను వరించి మురికి పోయాయి.