Telugu Special Stories

కొత్త క్రిమినల్ చట్టాలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

2024 జులై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్​చట్టాలు కేంద్ర ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీటిపై తప్పని సరిగా అవగాహన పెంచుకోవాలి.

* గతంలో కంటే ఎక్కువ రోజులు పోలీస్ రిమాండ్ విధించే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు 60 నుంచి 90 రోజుల వరకు రిమాండ్ విధించొచ్చు.

* నకిలీ నోట్ల తయారీ, నోట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది.

* ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత (ఇండియన్ జ్యుడీషియల్ కోడ్)లో ప్రవేశపెట్టారు. గతంలో వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి. ఇప్పుడు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకే తెచ్చారు.

*అంతేకాదు భారత్‌లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి.

* మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. 

* పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి.

* మహిళలు, 15 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటినుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు.

* పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్‌ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసే జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానం ప్రవేశపెట్టారు.

* భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు.  

* విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్‌ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు.

Show More
Back to top button