
మహాభారత కాలం నాటి పురాణ రాగి పాత్ర అక్షయ పాత్ర. స్వయంగా సూర్యభగవానుడే పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠరుడికి (ధర్మరాజు) ఈ పాత్రను అందిస్తాడు. కొన్ని వేల మందికి ఈ పాత్ర ద్వారా అన్నదానం చేసారట పంచ పాండవులు. ఈ పాత్ర ద్వారా ఎంతమందికైనా అన్నదానం చేయొచ్చని ఇతిహాసం మహాభారతంలో ఉన్నట్టు ఓ పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. అయితే ఆ అక్షయపాత్ర విశేషాలు ఏమిటి.. అక్షయపాత్ర ఇప్పటికే ఉందా ? ఉంటే ఎక్కడ ఉంది ?అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ద్వాపర యుగంలో
శకుని పాచికల కారణంగా పాండవులు జూదంలో ఓడిపోతారు. దాంతో కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులకు 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, ఆ తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విధించాడు. అజ్ఞాతవాసం అంటే వారి ఉనికి తెలియకుండా మారువేశాల్లో గడపడం. ఇక చేసేదేమీ లేక పాండవులు, ద్రౌపతి, సుభద్ర, అభిమన్యుడు, ఉపమాండవులు, వారి సైనికులు అందరితో కలిసి దాదాపు 14వేల రథాలతో అరణ్యవాసానికి బయలుదేరారు. అయితే కౌరవుల పాలనలో ధర్మం లేని సామ్రాజ్యంలో మేము ఉండలేము అని.. పదివేల మంది బ్రాహ్మణులు మేము కూడా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని ధర్మరాజు తో అంటారు.
అప్పుడు ధర్మరాజు.. మీకు మాపై ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకోగలను. కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేర్లు, కందమూలాలు తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని, అందుకని మీరు ఇక్కడ ఆగిపోండి అని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణులు.. అన్యాయమైన పాలనలో మేము నివసించడం అసాధ్యమని ఎంత కష్టమైనా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని, అవసరమైతే మా తిండి మేమే సంపాదించుకుంటామని వాదించి పాండవులు ఎంత చెప్పినా వినకుండా వారితోపాటు అరణ్యవాసానికి బయలుదేరారు.
ఇక అరణ్యానికి బయలుదేరుతున్న ధర్మరాజు ఆలోచన అంతా ఒకటే. ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అని ఆలోచనలో ఉంటాడు. ఇది గమనించిన సోనక మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటాడు. ఈ భూమండలం మీద ఉన్న జీవకోటికి ఆహారాన్ని, నీటిని ఇచ్చేవాడు సూర్య భగవానుడు. ఆయనను ప్రసన్నం చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ధర్మరాజుకు 108 సూర్య నామాలను అర్థాలతో సహా ఉపదేశించి ప్రార్థనతో వీలైనంత తొందరగా మొదలు పెట్టమని చెప్పాడు.
అరణ్యానికి చేరుకున్న మరుసటిరోజే ధర్మరాజు తెల్లవారుజామున లేచి నదిలో స్నానమాచరించి నిష్ఠతో, అంతఃకరణ శుద్ధితో సూర్యభగవానుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఓ రాగి పాత్రను ఇచ్చి.. ధర్మరాజ ఈ 12 ఏళ్ల అరణ్యవాసంలో అడవిలో దొరికే కూరగాయలు, ద్రౌపది చేత వండించి ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్తాడు. కాకపోతే ఎవరైనా ఏ సమయంలోనైనా ఈ అక్షయపాత్ర పూర్తిగా కడిగేసి బోర్లిస్తే మాత్రం ఇక అది పనిచేయడం ఆగిపోతుంది అని చెప్పి అక్కడ నుండి అదృశ్యం అవుతాడు సూర్యభగవానుడు.
ఆరోజు నుండి పాండవులు వారితోపాటు అడవికి వెళ్ళిన కొన్ని వేల మందికి అక్షయపాత్ర ద్వారా ఏ లోటు లేకుండా ఆకలి తీరుస్తారు. అయితే మహాభారత కాలం నాటి ఈ అక్షయపాత్ర ఇప్పటికీ ఉందా ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం..
త్రేతా యుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు ఇద్దరు కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన వారే. అయితే అదే వాయుదేవుడు అంశతో కలియుగంలో పుట్టిన వారు మద్వాచార్యులు. ఆయనే ఆయన గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందులో ఆసక్తికరమైన ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకరోజు మధ్వాచార్యులు ఆయన శిష్యులతో ద్వాపర యుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశమైన ఇప్పటి హర్యానాకు వెళ్లారు. అక్కడ ఒక చోటుకు వెళ్లాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అంతు పట్టలేనంత ఆవేశంతో, సంతోషంతో ఈ మట్టికిందే తన కథ ఇప్పటికే ఉంది. ద్వాపర యుగంలో 100 ఏనుగుల శక్తి కలిగిన వాడిగా చెప్పుకునే భీమసేనుడిని నేనే అని శిష్యులతో చెప్తాడు. ఆ మాటలు విన్న శిష్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన చెప్పేది నిజమే అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠతో అక్కడ మొత్తం తవ్వి చూశారు. అప్పుడు వాళ్ల కళ్ళముందు కనిపించింది ఏంటో తెలుసా..
స్వర్ణ మనిమయ రత్నాక అలంకరణతో ఉన్న భీమసేనుడి ఆరడుగుల గథ. వెంటనే ఆ శిష్యులు మద్వాచార్యులు గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కాళ్ల మీద పడ్డారు. అప్పుడు మద్వాచార్యులు ఇది ఎవరి కంటపడకుండా ఇక్కడే తిరిగి పాతేయమని ఆజ్ఞాపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాంటి మహనీయుడైన మధ్వాచార్యులు 750 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట చేసి అక్షయపాత్రను, దాంతోపాటు గరిటను కూడా ఇచ్చి వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి మీరు అన్నదానం చేసిన ఇందులోని ఆహారం మాత్రం అయిపోదని చెప్పాడు.
అయితే ఈ అక్షయ పాత్ర పాండవులు ఉపయోగించిన అక్షయ పత్రం ఒకటేనా అనే సందేహం అందరికి వస్తుంది. అయితే పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర ఇచ్చేటప్పుడు తన మాటల్లో వివరించారు ఈ రాగి అక్షయ పాత్ర అని. అయితే ఇప్పుడు ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర చెక్కతో చేసింది. అంటే ఇది మద్యచార్యులు స్వయంగా తన తపోశక్తితో సృష్టించిన అక్షయపాత్ర.
అంతే తప్ప పాండవులు వాడిన పాత్ర కాదు. మరి అది ఇది ఒకటి కానప్పుడు ఈ అక్షయ పాత్రకు కూడా అటువంటి శక్తి ఉందా అంటే ఉందనే చెప్పవచ్చు. ఉడిపిలో ఇప్పటికి వారు వండిన అన్నాన్ని ఒక పాత్రలో నుంచి అక్షయపాత్రతో గరిటతో తాకించిన తర్వాత మద్వాచార్యులు చెప్పిన విధంగా ఎన్ని వేల మందికి పెట్టిన ఆహారం మాత్రం తరగట్లేదట. అందుకే మధ్వాచార్యులు వారు సృష్టించిన అక్షయపాత్ర ద్వారా 750 సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు. ఇదే అక్షయపాత్ర యొక్క అసలు కథ.