Telugu News

ఏ ఖర్చూ లేకుండా GST రిజిస్ట్రేషన్

ప్రస్తుత కాలంలో GST అనేది ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో అదరికీ తెలిసిందే.. అలాంటిది మీరు ఏదైన వ్యాపారం ప్రారంభించాలంటే అది రూ.20 లక్షల రెవెన్యూ దాటితే.. తప్పనిసరిగా GST తీసుకోవాలి. ఒకవేళ వస్తు రూపిత వ్యాపారం(కమాడిటీ బిజినెస్) అయితే, సంవత్సరానికి రూ.40 లక్షలు దాటితే GST తీసుకోవాలి.

ఇవే కాకుండా ఈ-కామర్స్ సైట్లలో వ్యాపారం చేయడానికి కూడా తప్పనిసరి GST తీసుకోవాలి. అలా మీరు GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే.. ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చేసుకోండి.ముందుగా GST పోర్టల్‌కి వెళ్లాలి. అందులో Service ఆప్షన్‌ క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్‌ ఎంచుకోండి. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఎంచుకుని, కావాల్సిన వివరాలు సమర్పించాలి. మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. మీకు ఒక TRIN నంబర్ వస్తుంది. 

తర్వాత ఏం చేయాలంటే?

TRIN నంబర్ వచ్చాక ప్రొసీడ్ నొక్కండి. తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ TRIN పిన్, OTP ఎంటర్ చేసి మరల ప్రొసీడ్ ప్రెస్ చేయండి. అక్కడ మీకు ఒక డ్యాష్‌బోర్డ్ కనిపిస్తుంది. అక్కడ ACTION అనే ఆప్షన్‌ క్లిక్ చేసి మీ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించి, వెరిఫై చేయండి. ఆ తర్వాత మీకు అప్లికేషన్ రిఫరల్ నంబర్ వస్తుంది. GST వచ్చే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 

నోట్: ఒకసారి GST తీసుకున్న తర్వాత తప్పనిసరిగా ప్రతి నెల లేదా త్రైమాసికానికి ఒకసారి GST ఫైల్ చేయాలి. లేకపోతే ఫైన్ చెల్లించాల్సి వస్తుంది.

Show More
Back to top button