Telugu News

మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ.. ఫిన్లాండ్‌!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఆందోళన, స్ట్రెస్, అసంతృప్తి వంటివి రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో మనస్ఫూర్తిగా నవ్వుకోవడం కూడా అరుదైపోయింది. అలాంటిది ఈ దేశంలో మాత్రం ఆనందం నిత్యం వెల్లివిరుస్తోంది. అందుకే ఇప్పుడు వరుసగా ఎనిమిదోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. అదే ఫిన్లాండ్‌… అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని వరల్డ్ హ్యాపీనెస్ డేను పురస్కరించుకుని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని వెల్‌బీయింగ్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఆనందకర దేశాల జాబితా (World Happiness Report) ను తాజాగా విడుదల చేసింది. ఇందులో మరోసారి ఫిన్లాండ్‌ హ్యాపీ కంట్రీగా మొదటి స్థానం దక్కించుకుంది. 

కారణాలు..

*ఈ దేశంలో అవినీతి చాలా తక్కువ. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పొలిటీషియన్స్ గానీ లంచాలు తీసుకోరు, ప్రోత్సహించరు. 

*ఇక్కడ నివసించే పౌరులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

*ఇక్కడి ప్రకృతి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఎటు చూసినా స్వచ్ఛమైన గాలి, దట్టమైన అడవులు, పార్క్ లు, జలపాతాలు ఉంటాయి. ఒత్తిడిని అధిగమించేందుకు నగరవాసులు ఇక్కడే సేద తీరుతారు.

*మన దగ్గర కనీసం పని గంటలు 8 కదా.. అయితే ఇక్కడ మాత్రం తక్కువ పని గంటలను అమలు చేస్తున్నారు. ఆ లెక్కన వారానికి 40 గంటలు.. అంటే, రోజుకు సుమారు 6 గంటలు పని మాత్రమే ఉంటుంది.

*మరో విశేషం ఏంటంటే, ఇక్కడ పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో సమానంగా ఉండటం. లింగ సమానత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తారు.

*ఇరుగుపొరుగులతో సత్సంబంధాలు, కలిసి వేడుకలు, పండుగలను చేసుకోవడం.. సామూహిక భోజనాలు చేయడం వల్ల స్నేహభావం పెరిగి, ఐకమత్యంతో సంతోషంగా ఉంటారు.

*ఇక్కడ ఎక్కువగా ఆవిరి స్నానాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. 75% మంది ఇళ్ళల్లో ఆవిరి స్నానాల గదులు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇవి ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడతాయని నమ్ముతారు.

*తాజా ఆహారాన్ని తినడానికి మాత్రమే ఇష్టపడతారు. 

*ఇక్కడ ప్రతి అరగంటకోసారి ఒక పార్క్ తారసపడుతుంది. ఐలాండ్ లు ఎక్కువే. అందువల్లే పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ గడిపేందుకు ఇష్టపడతారు.

ఇక ఇతర నార్డిక్‌ దేశాలైన డెన్మార్క్‌ (2), ఐస్‌లాండ్‌ (3), స్వీడన్‌ (4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇకపోతే భారత్‌ 118వ ర్యాంక్‌ ను దక్కించుకుంది. గతేడాది మన దేశం 126వ స్థానంలో ఉండగా.. ఈ సారి ఆరు స్థానాలు దాటి ముందుకు వచ్చింది. చైనా (68), పాకిస్థాన్‌ (109) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. మరోవైపు, అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 24వ స్థానంలో ఉండగా.. పన్నెండేళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న యూఎస్‌.. ఆ తర్వాత నుంచి అంతకంతకూ పడిపోతూ వస్తోందని నివేదిక తెలిపింది. సంపద, వృద్ధి మాత్రమే కాకుండా.. సంబంధాలు, వ్యక్తుల మధ్య విశ్వాసం, ఆత్మ సంతృప్తి, సామాజిక మద్దతు, జీవనకాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

ఇదేకాక ప్రపంచవ్యాప్తంగా హ్యాపీనెస్ వీకెండ్ ను

గత నాలుగు దశాబ్దాలుగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రాణాయామం, ధ్యానం, శక్తివంతమైన సుదర్శన క్రియ ద్వారా ఆనందాన్ని పంచుతున్నారు.

అత్యంత సులువుగా.. శక్తివంతంగా ఉండే ఆయన ప్రక్రియలు ప్రజల్లో మానసిక ఒత్తిడిని నియంత్రించడంతోపాటు కార్పొరేట్‌ సంస్కృతుల్ని తీర్చిదిద్దడం, సమాజంలో పరివర్తన తీసుకురావడం, ప్రపంచ శాంతి ప్రయత్నాలకు దోహదం చేయడంలో కీలకంగా మారాయి. 

ఈ నేపథ్యంలో ప్రపంచ అతి పెద్ద ధ్యాన ఉత్సవంగా పేర్కొనే హ్యాపీనెస్ వీకెండ్ (ఆనందపు వారాంతం) ప్రోగ్రామ్ ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్యన నిర్వహిస్తున్నారు. ఈ ధ్యాన ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లోని కోట్లాది ప్రజలు పాల్గొంటున్నారు. 20న అంటే, రాత్రి 8 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ కు చెందిన సత్వ యాప్ ద్వారా గురుదేవ్ ప్రత్యక్షంగా చేయించే ధ్యానంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ ధ్యాన ప్రక్రియ వల్ల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, వివిధ వయసులకు చెందినవారు, ఆరోగ్య కార్యకర్తలు.. ఇలా అనేక వర్గాల ప్రజలపై జరిపిన పరిశోధనలు అందరిలోనూ మానసిక, శారీరక ఆరోగ్యంలో మెరుగైన ఫలితాలు కలిగించినట్లు తేలింది.

Show More
Back to top button