Telugu News

ఆలయాలు ఎందుకు..?నిత్యపూజలో గంట ఉపయోగం..?

సహజంగా భగవంతుడ్ని చేరే మార్గం ధ్యానం అని తెలుసు. మరీ ధ్యానం అయితే ఈ ఆలయ సంప్రదాయం ఎందుకు వచ్చింది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు?! ఆలయ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది పెద్దలేగా? ఏ ప్రయోజనం లేకుండా ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టి ఉండరు..?!

ఆలయ సంప్రదాయంలో భాగంగా కొండల మీదున్న గుళ్లకు నడిచి వెళ్తే పుణ్యం వస్తుందనీ అంటారు.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పుణ్యం అంటారు. ఉదయాన్నే ఆలయ క్షేత్రంలో కొలనులో స్నానమాచరిస్తే పుణ్యం అంటారు. సాష్టాంగ నమస్కారం చేస్తే పుణ్యం అంటారు. శఠగోపం తీసుకున్నా, హుండీలో కానుకలు వేసినా, ప్రసాదం తీసుకున్నా, విగ్రహాన్ని దర్శించినా పుణ్యం అంటారు. ఇవన్నీ పుణ్యాన్ని చేకూర్చేవి కాబట్టే మనం ఆచరిస్తున్నాం. 

మరీ వీటివల్ల కలిగే ప్రయోజనం అదే పుణ్యం ఏంటి అంటారా? నిజానికి ఏ లాభం లేకుండా పూర్వం పెద్దలు ఇలాంటి సంప్రదాయాన్ని ప్రవేశపెట్టలేదు.

ఎందుకంటే.. ఇప్పుడున్న సమాజంలో రోజురోజుకు దోపిడీలు, నేరాలు, హత్యలు, ఆగ్రహావేశాలు, హింస మొదలుకొని తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళు, కంటికి కనిపించే వాళ్ళు, కనపడనివాళ్ళు.. ఇలా మాయలు, మోసం, స్వార్థం పెరిగి జీవితాల్లో ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. 

కారణాలు ఏవైనా ఉండొచ్చు.. తమ స్వార్థం, అవసరం మూలానా వ్యక్తులు పాపాత్ములు, పుణ్యాత్ములుగా మారుతున్నారు.

అట్టి మానవుల్లో గుణాలు మార్చి సాత్విక గుణాన్ని పెంపొందించేందుకు ఈ ఆలయ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా మనం పాటించే ఆచారాలు, పద్ధతులు అన్ని కూడా వారి గుణాల్ని మార్చే విధంగా ఉంటాయి. నిజానికి మనం ఈ పని చేస్తే ఇంత లాభం వస్తుందని చెప్తే చేయలేం. అదే పుణ్యం అని చెబితే.. ఆ పని చేసేందుకు కొంత ఆసక్తి పెరుగుతుంది. పుణ్యం వస్తుందంటే ఆ పని చెయ్యడానికి, పూనుకోవడానికి వెనుకాడరు.. కావున ఈ క్రతువు వారిని అంతర్గతంగా

మార్చడమే కాక లోకోపకారిణి అవుతుంది. అందువల్లే ఈ ఆలయ సంప్రదాయం అనేది ఏర్పడింది.

ఇకపోతే నిత్యం పూజారాధన చేసే సమయంలో తప్పనిసరిగా గంటను మోగిస్తాం. దీనికి గల కారణమేంటో చూద్దాం..

పూజా ‘గంట’ అనేది మన సంస్కృతిలో అంతర్భాగం. మన ఇంట్లో ప్రతిరోజు పూజలో భాగంగా  దేవున్ని పూజించి, నైవేద్యం సమర్పించిన అనంతరం అగరొత్తులతో పాటుగా పూజా గంటను మోగిస్తాం. దీనర్థం పూజ ఇంతటితో ముగింపుకు చేరుకుందని. అదే దేవాలయాల్లో అయితే దేవతామూర్తులకి ఎదురుగా కాస్త పెద్దదైన గంటలను చూస్తుంటాం. అక్కడ స్వామివారిని దర్శించి, ప్రదక్షిణలతో పాటుగా మధ్యమధ్యలో గంటను మోగిస్తాం. ఇంతటితో ప్రదక్షిణలు పూర్తయ్యాయి అనే అర్థంలో. గంట శబ్దాన్ని ఎల్లప్పుడూ శుభప్రదంగా భావిస్తాం. గంట నుంచి వెలువడే ‘ధ్వని’ అంతటా నిశ్శబ్దం అలుముకునేలా చేస్తుంది. ఒక్కసారిగా అక్కడి ప్రాంతమంతా పవిత్రత సంతరించుకునేలా చేయడంలో తోడ్పడుతుంది.

దీంతో అప్పటివరకు మనసులో చేరిన ప్రతికూల ఆలోచనలు నియంత్రణలోకి వచ్చి, శరీరానికి ప్రశాంతతను అందిస్తుంది. అంత గొప్ప ప్రయోజనం దాగి ఉంది కనుకే పూజలో గంట మోగించడాన్ని ప్రధాన ఆచారంగా పాటిస్తారు. ఒక్కో దేవాలయంలో ఆయా దేవుని మహిమననుసరించి పూజా గంటలు ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు శివుని దేవాలయంలో పూజా గంటలు నంది లేదా ఎద్దు ఆకారంతో కనిపిస్తుంటాయి. విష్ణు దేవాలయాల్లో గరుడ పక్షి లేదంటే సుదర్శన చక్రం ఆకారాన్ని కలిగి ఉంటాయి. పూజా గంటను రాగి లేదా ఇత్తడి లాంటి నిర్దిష్టమైన లోహా మిశ్రమాలతో ధ్వనిరంజకంగా తయారు ఆచేస్తారు. మొత్తంగా గంట అశుభాలను, అనుచిత ఆలోచనలను దూరం చేసి, మంచివైపు ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. 

Show More
Back to top button