
శరీరంలో తగిన పాళ్లలో సోడియం ఉండాలి. సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటివి తగ్గుతాయి. నల్ల ఉప్పు తింటే గుండెల్లో మంట, కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
కాలి పిక్కలు పట్టేస్తున్న వారు నల్ల ఉప్పు తినడం ఉత్తమం. నల్ల ఉప్పుతో కాపడం కూడా పెట్టుకోవచ్చు. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. హై, లో బీపీ సమస్యలు ఉన్నవారు సాధారణ ఉప్పుకు బదులు నల్ల ఉప్పు వినియోగించాలి. ఉప్పు తిన్న అనుభూతితో వస్తుంది. రుచి కూడా మారదు. నల్ల ఉప్పు రక్తాన్ని పలుచగా చేస్తుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టదు. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
ఉప్పుకు బదులగా నల్ల ఉప్పు
నల్ల ఉప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత సమస్య ఉండదు. సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పు వాడడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. ఎముకలు దృఢంగా మారి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
కిడ్నీలో రాళ్లు ఉంటే కరిగిపోతాయి. శిరోజాలు, చర్మ ఆరోగ్యానికి కూడా నల్ల ఉప్పు సహాయ పడుతుంది. సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి. దీన్ని మామూలు ఉప్పులాగే వాడుకోవచ్చు. రోజూ ఉదయం నిమ్మరసం, తేనె, నీళ్లలో కలిపి కూడా పరగడుపునే తాగవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్ సాల్ట్ మనకు గొప్ప ప్రయోజనాలను చేకూర్చుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.