
నడిచినవాడు జయించెద, కూర్చున్నవాడు క్షయించెద అన్నట్లు.. ఎప్పుడూ నడిచేవాడు ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. అదే అసలు నడవడమే మానేసి ఏసీ కింద కూర్చున్నోడు సర్వరోగాలకు బాధ్యుడు అవుతాడు. అవునండీ.. అది నిజం. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రహస్తులు రోజులు కొంత నడవడం మానేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఇప్పుడు షుగర్ ఉన్నవారు రోజులో ఎంత సమయం నడావాలి? నడిస్తే ప్రయోజనాలు ఏంటి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహారం, వ్యాయామం కీలకం. దీంతోపాటు రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయడం చాలా మంచిది. వారానికి 150 నిమిషాలు (5 రోజులు × 30 నిమిషాలు) నడిస్తే గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యం అవుతాయి. దీంతో షుగర్ కంట్రోల్‌కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది
అయితే…. ఎలా నడవాలి?
ఒకేసారి అరగంట సమయం కేటాయించలేనివారు, 10 నిమిషాల చొప్పున మూడు సార్లు (భోజనం తర్వాత) నడవొచ్చు. గంటకు 3-4 మైళ్లు వేగంతో నడిస్తే ఇన్సులిన్ ప్రభావం మెరుగవుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరి వాకింగ్‌కి ముందు జాగ్రత్తలు ఏంటి?
* సమతలమైన నేలపై నడవాలి, రాళ్లు, మెట్లు తప్పించుకోవాలి.
* ఉదయం లేదా సాయంత్రం వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు నడవాలి.
ఇక వాకింగ్ వల్ల లాభాలు?
* రక్తంలో చక్కెర నియంత్రణ
* బరువు తగ్గడం, శరీరాకృతి మెరుగవడం
* హార్ట్ హెల్త్ మెరుగవడం
* మెదడు చురుకుదనం, మానసిక ఉల్లాసం