CINEMATelugu Cinema

ప్రభాస్ ‘కల్కి’లో దీపికా పాత్ర ఇదేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. కాగా… ప్రభాస్ సరసన దీపికా పడుకోణె, దిశా పటాని హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించాడు. అశ్వద్ధామ గ్లింప్స్ వీడియో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ విష్ణుమూర్తి “కల్కి” పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె పాత్ర గురించి ఓ ఆసక్తికర వార్త బాగా వైరల్‌గా మారుతోంది. ఈ సినిమాలో దీపికా పునర్జన్మ ఎత్తిన లక్ష్మీదేవిలా కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు ‘పద్మ ‘అని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఈ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Show More
Back to top button