CINEMATelugu Cinema

గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రకటిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల వివరాలను జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ వెల్లడించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డులకు మొత్తం 1248 నామినేషన్లు రావగా, జ్యూరీ సమీక్షించిన అనంతరం విజేతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ‘పుష్ప 2’ సినిమాతో అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాల కేటగిరీలో ‘కల్కి’తో పాటు మరికొన్ని సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి.

గ‌ద్ద‌ర్ అవార్డుల జాబితా చూస్తే..

బెస్ట్ మూవీ- కల్కి
బెస్ట్ డైరెక్టర్- నాగ్ అశ్విన్ (కల్కి)
బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లురీ ( లక్కీ భాస్కర్)
బెస్ట్ సెకండ్  ఫిల్మ్ – పొట్టేలు
బెస్ట్ థర్డ్  ఫిల్మ్ – లక్కీ భాస్కర్
బెస్ట్ హీరో- అల్లు అర్జున్ (పుష్ప-2)
బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్. జె సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్
ఉత్తమ సామాజిక చిత్రం : కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్నకథ కాదు
ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ : రజాకార్
ఉత్తమ నూతన దర్శకుడు : ఎదు వంశీ
హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ : ఆయ్
 స్పెషల్ జ్యురీ అవార్డు_ దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్ )
బెస్ట్ స్టోరీ రైటర్ _ శివ పాలడుగు
స్పెషల్ జ్యురీ అవార్డు ఫీమేల్ – అనన్య (పొట్టేలు)

Show More
Back to top button