CINEMATelugu Cinema

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ రివ్యూ

మాస్ కా దాస్‌గా పేరు పొందిన విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దాగా ఆకట్టుకోలేపోయింది.  ఇప్పుడు మరో డిఫరెంట్‌ మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. అయితే చాలాసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..

ఈ సినిమా కథంతా 90లో కథలా సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్‌ అలియాస్‌ రత్న(విశ్వక్‌ సేన్‌) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది.

దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే  రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్‌) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి అక్కడి నుంచి మొదలౌవుతోంది అసలు కథ. అయితే ఈ సినిమాలో విలేజ్‌ రాజకీయాల కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు డైరెక్టర్. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.

గత సినిమాల్లో  గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్‌ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్‌ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.

చివరిగా..

* బ‌లాలు

+ విష్వ‌క్‌సేన్ న‌ట‌న

+ క‌థా నేప‌థ్యం

+ ఛాయాగ్ర‌హ‌ణం, నేప‌థ్య సంగీతం

* బ‌ల‌హీన‌త‌లు

– భావోద్వేగాలు

– నాట‌కీయ‌త‌తో కూడిన స‌న్నివేశాలు

రేటింగ్:  2.5/5

Show More
Back to top button