
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప”తో మైథలాజీని మాస్‌కి కనెక్ట్ చేయాలనుకున్నారు. భక్తికథలో యాక్షన్, విజువల్ గ్రాండియర్ కలిపి తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం ఉంది. ప్రభాస్, మోహన్‌లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ వంటి పెద్ద తారాగణం ఉండటంతో హైప్ ఎక్కువైంది. అయితే, సినిమాకి ఆ క్రేజ్ ఎంతవరకు న్యాయం చేసింది అన్నదానిపై మిక్స్‌డ్ అభిప్రాయాలే.
ప్లస్ పాయింట్లు:
మంచు విష్ణు నటనలో కమిట్‌మెంట్ కనిపిస్తుంది. పాత్రపై ఆయన నమ్మకంతో నటించారు.
ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
విజువల్స్, గ్రాఫిక్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. కొన్నిపాట్లలో డెవోషనల్ ఫీలింగ్ బాగుంది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలం. కొన్ని సన్నివేశాల్లో goosebumps ఇచ్చేలా ఉంది.
మైనస్ పాయింట్లు:
కథలో కొత్తదనం పెద్దగా లేదు. మైథ్ & మాస్ మిక్స్ బాగా వర్కౌట్ కాలేదు.
స్క్రీన్‌ప్లే స్లోగా సాగుతుంది. ఎమోషన్లు బలంగా కనెక్ట్ కావు.
ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ పాత్రలు చాలా చిన్నవి. వాడకంలో లోపం అనిపిస్తుంది.
క్లైమాక్స్ వరకు వెళ్లే దారి బోరింగ్ గా అనిపించవచ్చు.