
సుధీర్ బాబు హీరోగా షాయాజీ షిండే, సాయిచంద్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? సుధీర్‌కు విజయాన్ని రుచి చూపించిందా? వంటి విషయాలు తెలుసుకుందాం.
కథ…
చిన్న వయస్సులోనే నాన్న ప్రకాష్ (సాయి చంద్)ని దూరం చేసుకున్న జాని(సుధీర్ బాబు) ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు. అయితే తనని గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి (షయాజి షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ ఆ తర్వాత తన జీవితంలో కలిగే నష్టాలు జాని వల్లే అని నమ్మి మాట్లాడ్డం మనేస్తాడు. నాన్న అంటే అమితమైన ప్రేమ ఉన్న జాని తన తండ్రి చేసిన తప్పులు, అప్పులు సరిచేస్తుంటాడు. ఈలోపు షయాజిని పోలీసులు జైల్లో వేస్తారు. తను బయటకి రావాలంటే జానికి రూ.1 కోటి అవసరం అవుతాయి. వాటి కోసం తాను ఏం చేస్తాడు? ఈ క్రమంలో తనకి పరిచయమైన కొత్త వ్యక్తులు ఎవరు? తర్వాత జరిగే సన్నివేశాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సినిమా కొంత స్లో నేరేషన్‌తో ఉండటంతో అందరికి తొందరగా కనెక్ట్ కాలేకపోవచ్చు. తండ్రి కొడుకులు కలుసుకుంటారా అని క్లైమాక్స్ ఎమోషన్‌ని చాలా బాగా రాసుకోవచ్చు కానీ సింపుల్‌గా అయిపోయింది అనిపిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. సుధీర్ బాబు కామిడీ, యాక్టింగ్ సినిమాకి మంచి ప్లెస్ పాయింట్స్‌గా చెప్పవచ్చు. కథలోని కొత్తదనం, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశాలు సినిమాని పైకి లేపాయనే చెప్పవచ్చు. అయితే, నెమ్మదిగా సాగే కథ వల్ల సినిమాకి కొంత మైనస్‌గా చెప్పుకోవచ్చు. నాన్న ఎమోషన్ ని మాత్రం బాగా పండించగలిగాడు దర్శకుడు.
రేటింగ్: 2.75/5