
మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా? మీకు EPFO ఖాతా ఉందా? అయితే మీకు గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు బీమా లభిస్తుంది. అది కూడా పూర్తి ఉచితంగా ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఈ స్టోరీ మీకోసమే. EPFO తమ చందాదారుల కోసం భవిష్యనిధిని జనుచేస్తుందన్న విషయం తెలిసిందే. అలాగే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పేరిట గతంలో ఓ బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చింది. కానీ, చాలామందికి ఈ స్కీమ్ గురించి పెద్దగా తెలియదు.
ఈ పధకంలో భాగంగా.. ఖాతాదారుడు మరణిస్తే నామినీకి (లేదా) వారి చట్టపరమైన వారసులకు రూ.7 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తారు. EPF, EPSతో కలిసి పనిచేసే EDLI రూ.15 వేల లోపు మూల వేతనం ఉన్న ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఈ బీమాకు చందాదారుడు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. EPF ఖాతాకు చందా సహకారం అందిస్తే సరిపోతుంది.
EDLI నిబంధనల ప్రకారం ఉద్యోగి బేసిక్, డీఏలో నుంచి 0.5% (లేదా) గరిష్టంగా నెలకు రూ.75 ఈ స్కీమ్ కోసం జమవుతాయి. అప్పుడే నామినీకి డబ్బు అందుతుంది. ఆ డబ్బును ఏకమొత్తంలో అందిస్తారు. ఒకవేళ నామినీ లేకపోతే.. ఆ మొత్తం చట్టబద్ధమైన వారసుడికి అందుతుంది.
ప్రయోజనాలు
మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు ఏడాది పాటు సర్వీసులో ఉంటే.. అర్హతగల కుటుంబసభ్యులకు రూ.2.5 లక్షలు చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తొలి సంవత్సరంలో మరణిస్తే గతంలో ఎలాంటి బీమా ప్రయోజనాలు లభించేవి కావు, కానీ, కొత్త రూల్స్ ప్రకారం.. ఉద్యోగి కుటుంబానికి రూ.50 వేల బీమా అందించనున్నారు. ఉద్యోగం మానేసిన తర్వాత కూడా ప్రయోజనాలు అందుతాయి. కంపెనీ రోల్ నుంచి ఉద్యోగి పేరును పూర్తిగా తొలగిస్తే మాత్రం కష్టమవుతుంది.వేతనం, ఉద్యోగ పదోన్నతి కోసం ఉద్యోగులు కంపెనీలు మారడం సహజమే, అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు గ్యాప్ కూడా వస్తుంది. అలాంటప్పుడు కూడా బీమా వర్తిస్తుంది. రెండు ఉద్యోగాల మధ్య తేడా రెండు నెలల్లోపు ఉంటే ఉద్యోగి కంటేమ్యయస్ సర్వీస్ గానే పరిగణించి బీమా ఇస్తారు.
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
EPF స్కీమ్కు యాక్టివ్ కంట్రిబ్యూటర్గా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు నామినీ సభ్యులు బీమా స్వీకరించడానికి వీలు ఉంటుంది. EDLI ఫామ్ 51Fను నింపి ఆ క్లెయిమ్ ఫామ్స్ పై సంస్థ యజమాని సంతకం తీసుకోవాలి. ఆ ఫామ్ తో పాటు మిగితా సర్టిఫికెట్లను కూడా తీసుకొని సమీపంలో ఉన్న EPF కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి. వారు 30 రోజుల్లోగా క్లెయిమ్ సొమ్మును అందిస్తారు. లేటైన కొద్దీ వడ్డీతో సహా చెల్లిస్తారు.
ఈ-నామినేషన్ తప్పనిసరి
ఉద్యోగి మరణిస్తే, ఈ బీమా డబ్బు ఎవరికి చెందాలో తెలపడానికి ఈ-నామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చట్టపరమైన చిక్కులు లేకుండా, చట్టు త్వరగా అర్హులకు చేరుతుంది. దీన్ని ఆన్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. EPFO పోర్టలను ఓపెన్ చేసి, UANతో నంబర్ లాగిన్ అయ్యి, యాడ్ ఫ్యామిలీని ఎంచుకుని నామినీ వివరాలు నమోదు చేయాలి. ఒకరికన్నా ఎక్కువ మందిని యాడ్ చేయవచ్చు. అలాగే ఎవరికెంత ఇవ్వాలో ఇక్కడ ఎంటర్ చేసి ఆ వివరాలు సేవ్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.