Telugu Cinema

మూడు భాషలలో ఏక కాలంలో స్టార్ డమ్ పొందిన కథానాయిక.. గౌతమి..

దేవుడు గొప్ప స్క్రీన్ ప్లే రచయిత గౌతమి మనిషి జీవితాన్ని ఎలా ప్రారంభిపజేయాలో, ఎలా ముగింపజేయాలో, ఎలా కొనసాగింపజేయాలో లిఖించిన ఆ దేవుడుని మించిన గొప్ప స్క్రీన్ ప్లే రచయిత లేడేమో అనిపిస్తుంది.

మనిషి జీవితం లో కష్ట – సుఖాలు, బాధలు – సంతోషాలు సాధారణమైనవే కావచ్చు. అసాధారణ ప్రతిభ కలిగి, సినీ రంగంలో ముఖానికి మేకప్ వేసుకుని అందంగా నటించే నటీనటులను చూస్తే మనకు అలా అనిపించదు. తెరమీద అందంగా నటించగలరు, జీవించగలరు. కానీ నిజ జీవితంలో వాళ్లు కూడా సాధారణ మనుషులే.

బహుముఖ ప్రజ్ఞశాలి అయిన నటి గౌతమి గారి జీవితం కూడా అంతే. తెలుగు లో పుట్టిన తాను, తెలుగు చిత్ర రంగంతో పాటు తమిళంలో కూడా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.

ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతూ  సినిమాలలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని, దయామయుడు సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు.

తాను గురు శిష్యన్ సినిమాతో తమిళ సినిమా రంగములో ప్రవేశించి ఆదిలోనే అగ్ర హీరో రజనీకాంత్ గారి సరసన నటించేశారు.

నటిగా, టీవీ హోస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, సామాజిక కార్యకర్త గా, రాజకీయవేత్త గా ఇలా తన బహుముఖ ప్రజ్ఞ ను చాటుకొన్నారు.

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఒకే సమయంలో స్టార్ డమ్ చూసిన కథానాయిక గౌతమి గారు. జీవితంలో అనేక ఆటుపోట్లను చూసిన నాయిక తాను.

తన 35 యేట క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి, మెరుగైన చికిత్స తో తిరిగి కోలుకుని, క్యాన్సర్ రోగులకు సహాయం చేసేందుకు గౌతమి లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ (LAF)ని స్థాపించారు.

లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ క్యాన్సర్ రోగుల కోసం ప్రేరణాత్మక శిబిరాలు, క్యాన్సర్ అవగాహన ప్రచారాలు మరియు ఫుడ్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంది.

గౌతమి గారు 1997లో యల్.కె.అద్వానీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరిన తాను బీజేవైఎం ఉపాధ్యక్షురాలు గా పనిచేశారు.

వ్యక్తి గత జీవితం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న గౌతమి గారి వైవాహిక జీవితం మున్నాళ్ళ ముచ్చటే అయ్యింది.

ళ్లయిన ఏడాది కే విడాకులు తీసుకున్న గౌతమి గారు కొన్నాళ్ళు కమలహాసన్ గారితో సహజీవనం చేసి 14 ఏళ్ళ వాళ్ళ బంధానికి ముగింపు పలికారు.

@ జీవిత విశేషాలు…

జన్మ నామం :    తాడిమల్ల గౌతమి

జననం    :  1969 జూలై 2 (వయసు 53)

స్వస్థలం   :     శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

తండ్రి   :   టి. ఆర్. శేషగిరిరావు 

తల్లి     :    వసుంధరా దేవి 

వృత్తి      :    నటి, టీవీ హోస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త

విద్యాసంస్థ    :    గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) యూనివర్సిటీ, విశాఖపట్నం

భర్త     :     సందీప్ భాటియా (1998–1999) (విడాకులు)

జీవిత భాగస్వామి   :  కమలహాసన్ (2004–2016) 

పిల్లలు    :    సుబ్బులక్ష్మి (జననం.. 1999)

బంధువులు    :    సౌమ్య బొల్లాప్రగడ (మేనకోడలు)

నేపథ్యం…

తాడిమల్ల గౌతమి గారూ 2 జూలై 1969 లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం లోని నిడదవోలు లో టి.ఆర్.శేషగిరిరావు, వసుంధరా దేవి దంపతులకు జన్మించారు.

తన తండ్రి వైద్యులు (ఆంకాలజిస్ట్) కాగా, తల్లి కూడా వైద్యులే (పాథాలజిస్ట్). గౌతమి గారు బెంగుళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో చదువుకున్నారు.

తాను విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా తనకు సినిమాలలో నటించే అవకాశమొచ్చింది.

ఏసుక్రీస్తు జీవితగాథను చిత్రీకరించిన దయామయుడు సినిమాతో తాను రంగప్రవేశం చేశారు.

తాను “గురు శిష్యన్” సినిమాతో తమిళ సినిమా రంగములో ప్రవేశించారు. ఇందులో రజనీకాంత్ సరసన నటించారు.

గౌతమి గారు జెంటిల్మన్ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేసిన చికుబుకు రైలే పాట చాలా ప్రాచుర్యము పొందినది.

సినిమా నేపథ్యం…

గౌతమి గారు ఇంజినీరింగ్‌ చేసేందుకు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడే ట్రిపుల్ ఈ (EEE) లో ఇంజనీరింగ్ చదువుతుండగా మలయాళ చిత్రం గాంధీనగర్ 2వ వీధికి పునర్నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న పి.ఎన్.రామచంద్రరావు గారు తెలుగు లో దర్శకత్వం వహించిన గాంధీనగర్ రెండవ వీధి లో తొలిసారిగా కథనాయికగా నటించడానికి ఒప్పుకున్నారు. దీనికంటే ముందుగా దయామయుడు అనే సినిమా లో చిన్న పాత్ర పోషించారు గౌతమి గారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం తోనే సినీ రంగ ప్రవేశం చేసిన గౌతమి గారు శరత్ బాబు సమర్పణలో సుశీల ఆర్ట్స్ బ్యానర్‌పై జి. రెడ్డి శేఖర్, జె.గోపాల్ రెడ్డి మరియు పి. పార్ధసారధి రెడ్డి నిర్మించిన భారతీయ తెలుగు భాషా హాస్య చిత్రం గాంధీనగర్ రెండవ వీధి నుండి హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. పి.ఎన్.రామచంద్రరావు గారు దర్శకత్వం వహించిన గాంధీనగర్ రెండవ వీధి చిత్రం 16 జూలై 1987లో విడుదలైంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ , చంద్ర మోహన్ , గౌతమి గార్లు నటించగా, జి.ఆనంద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం సినీ పరిశ్రమలో నటి గౌతమి యొక్క తొలి చిత్రం.

ఆ తర్వాత గౌతమి గారు వెంకటేష్ మరియు భానుప్రియ గార్లతో కలిసి శ్రీనివాస కళ్యాణం లో నటించారు. “ఎందాకా ఎగిరేవమ్మా గోరింకా”, “తుమ్మెద ఓ తుమ్మెద ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మెద”లాంటి వినసొంపైన పాటలతో మురారి దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.

ఆ తరువాత బజార్ రౌడీ (1988), భార్య భర్తలు (1988), తోడల్లుళ్ళు (1988) ఆగస్టు 15 రాత్రి (1988), ప్రఛండ భారతం (1988), కృష్ణ గారి అబ్బాయి (1989), అన్న తమ్ముడు (1990), అగ్గిరాముడు (1990), బామ్మ మాట బంగారు బాట (1990), చైతన్య (1991), చక్రవ్యూహం (1992), ప్రియమైన సోదరా (1993), సంకల్పం (1993), అన్నా (1994), పల్లెటూరి మొగుడు (1994), ద్రోహి (1996), అదిరిందయ్య అల్లుడు (1996), చిలక్కొట్టుడు (1997), మనమంతా (2016), అన్నీ మంచి శకునములే (2023) వంటి చిత్రాలలో నటించారు.

తమిళం లో…

గౌతమి గారు ఎస్పీ ముత్తురామన్ గారు దర్శకత్వం వహించిన గురు శిష్యన్ (1988) చిత్రం లో నటించారు. రజనీకాంత్ మరియు ప్రభు లతో కలిసి నటించిన ఈ చిత్రం ద్వారా తాను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అపూర్వ సగోధరార్గల్ (1989) అనే తమిళ భాషా చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ , జైశంకర్ , నగేష్ , గౌతమి , రూపిణి , మనోరమ , శ్రీవిద్య , జనగరాజ్ , మౌలీ , ఢిల్లీ గణేష్ మరియు నాసర్ వంటి తారాగణం నటించారు. చిన్నతనంలో విడిపోయిన రాజు మరియు అప్పు అనే కవలలు మరియు తన తండ్రిని చంపిన నేరస్థులపై ప్రతీకారం తీర్చుకోవాలనే కథాంశం పై తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారు నిర్మాణంలో SP ముత్తురామన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం రాజా చిన్న రోజా (1989). నటుడిగా మారడానికి నగరానికి వచ్చిన రాజా ( రజనీకాంత్ ) చుట్టూ కథ తిరుగుతుంది. రాజా చిన్న రోజా 20 జూలై 1989న విడుదలైంది మరియు 175 రోజుల థియేట్రికల్ రన్‌తో కమర్షియల్‌గా విజయం సాధించింది. పనక్కారన్ (1990), ఊరు విట్టు ఊరు వంతు (1990) , నమ్మ ఊరు పూవాత (1990), ధర్మ దురై ( 1991), నీ పతి నాన్ పతి (1992 మా1, రాజ్‌వన్ 9 మా1), (1994) , నమ్మవార్ (1994), కురుతిపునల్ ( 1995) అలాగే మణిరత్నం యొక్క ఇరువర్ (1997) వంటి చిత్రాలలో నటించారు.

ఇరువర్ (1997)…

ఇరువర్ అనేది 1997లో విడుదలైన భారతీయ తమిళ భాషా పురాణ రాజకీయ నాటక చిత్రం. మణిరత్నం గారు సహ-రచయిత గా నిర్మించి మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం M. కరుణానిధి , MG రామచంద్రన్ మరియు J. జయలలిత జీవితాల నుండి ప్రేరణ పొందిన మణిరత్నం గారు చిత్రీకరించారు. తమిళనాడులోని సినిమా మరియు రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మోహన్ లాల్ , ప్రకాష్ రాజ్ , ఐశ్వర్య రాయ్ ,రేవతి , గౌతమి , టబు మరియు నాసర్ లాంటి నటీనటులు నటించారు.

ఈ చిత్రం 1997 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాస్టర్స్ విభాగంలో ప్రదర్శించబడింది. ఇరువర్ బెల్గ్రేడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డును మరియు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడంతో పాటు విమర్శనాత్మక విజయం సాధించింది. విమర్శకుడు రాచెల్ డ్వైర్ “ఇరువర్‌”ను 2012 బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ సైట్ & సౌండ్ 1000 అత్యుత్తమ చిత్రాలలో చేర్చారు. 2013 ఇంటర్వ్యూలో, మణిరత్నం “ఇరువర్‌”ని తనకు నచ్చిన తన చిత్రాలలో ఉత్తమ చిత్రంగా చెప్పుకొచ్చారు.

గౌతమి గారు జెంటిల్‌మన్ (1993) చిత్రంలో ప్రభుదేవాతో కలిసి “చిక్కు బుక్కు రైలు” పాటలో అతిథి పాత్రలో కనిపించారు. అరవింద్ స్వామి తో నటించిన తన చిత్రం శాసనం , 2006లో విడుదలైంది. వాస్తవానికి ఈ చిత్రం 1996లో చిత్రీకరించబడింది. గౌతమి గారు తమిళ సీరియల్ “ఇందిర”లో ప్రధాన పాత్ర పోషించారు. గౌతమి గారు సన్ టీవీలో “అన్బుదన్” అనే టాక్ షోను నిర్వహించారు. తాను కలైంజర్ టీవీలో ప్రసారమైన “అభిరామి” సీరియల్‌లో నటించారు.

గౌతమి గారు 2000ల చివరలో తన భాగస్వామి కమలహాసన్ గారు నటించిన చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా తిరిగి చిత్ర పరిశ్రమకు విచ్చేశారు. కమల్ హాసన్ గారు నటించిన దశావతారం (2008) కోసం గౌతమి గారు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా విజయ్ అవార్డును గెలుచుకున్నారు. విశ్వరూపం (2013) మరియు ఉత్తమ విలన్ (2015) తో సహా ఆమె అనేక ఇతర చిత్రాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు.

ఇతర భాషలలో…

గౌతమి గారు మోహన్‌లాల్‌ గారితో కలిసి హిస్ హైనెస్ అబ్దుల్లా (1990) చిత్రం లో నటించారు. సిబి మలయిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తో తొలిసారి మలయాళ చిత్ర పరిశ్రమ లో రంగ ప్రవేశం చేశారు.

విద్యారంభం (1990), అరవింద్ స్వామి తో డాడీ ( 1992), మమ్ముట్టి తో  ధ్రువం ( 1993)తో  మరియు జయరామ్‌తో అయలతే అధేహం (1993) మలయాళంలో తన చెప్పుకోదగ్గ చిత్రాలు.

హరి కుమార్ దర్శకత్వం లో మమ్ముట్టి, గౌతమి, శాంతి కృష్ణ, మనోజ్ కె. జయన్ లు నటించిన “సుకృతం” (1994) లో గౌతమి పాత్రను రచయిత MT వాసుదేవన్ నాయర్ వ్రాశారు.

ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.

గౌతమి గారు తన కన్నడ చిత్రాలలో ఏలు సుట్టిన కోటే (1987), చిక్కేజమన్రు (1992), చెలువ (1997), చిత్రాలలో నటించారు.

హిందీ చిత్రాలలో ప్యార్ హువా చోరీ చోరీ (1991), ఆద్మీ (1993), జంతా కి అదాలత్‌ (1994), త్రిమూర్తి (1995), ధాల్ (1997) మరియు హైవాన్ (1998) లాంటి చిత్రాలలో కూడా నటించారు.

వ్యక్తిగత జీవితం..

గౌతమి గారు తన 28 ఏళ్ళ వయస్సులో వ్యాపారవేత్త అయిన సందీప్ భాటియా ను 1998లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 1999లో కుమార్తె జన్మించింది. తన పేరు సుబ్బలక్ష్మి. వీరి వైవాహిక జీవితంలో ఉన్న మనస్పర్థల కారణంగా వీరు 1999లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకు నటుడు కమలహాసన్ గారితో సహజీవనం చేశారు. 2004 నుండి కొనసాగిన వీరి బంధం 2016 వరకు కొనసాగింది. ఆ తరువాత వీరివురు విడిపోయారు. ఇదే విషయాన్ని 2016లో గౌతమి గారు తన బ్లాగ్‌ వ్రాస్తూ అతనితో తన సంబంధాన్ని ముగించుకున్నట్లు ప్రకటించారు. గౌతమి తన బ్లాగ్‌లో ఇలా వ్రాశారు.

“నేను మరియు మిస్టర్ హాసన్ ఇక కలిసి లేమని ఈ రోజు చెప్పడం నాకు హృదయ విదారకంగా ఉంది. దాదాపు 13 సంవత్సరాల పాటు కలిసి ఉన్న నేను తీసుకున్న అత్యంత వినాశకరమైన నిర్ణయాలలో ఇది ఒకటి. నా జీవితంలో ఇలా చేయవలసి వచ్చింది”.

ప్రాచీన సంప్రదాయాలకు అత్యంత విలువలనిచ్చే గౌతమి గారు తన కూతురు పేరు సుబ్బలక్ష్మి అని పెట్టుకున్నారు.

నటిగా ఒక విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తాను వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తాను 35 సంవత్సరాల వయస్సులో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడ్డారు. కీమోతెరఫీ చికిత్స అనంతరం కోలుకున్నారు.

చిత్ర సమాహారం… 

దయామయుడు.. శ్రీనివాస కల్యాణం.. పృథ్వీరాజ్.. అగ్గి రాముడు.. అన్న.. విచిత్ర సోదరులు..

అన్న-తమ్ముడు.. జంటిల్ మేన్.. ఖైదీ అన్నయ్య.. బొబ్బిలి రాయుడు.. డియర్ బ్రదర్.. రత్నగిరి అమ్మోరు..

అన్నీ మంచి శకునములే..

పురస్కారాలు…

1990  వ సంవత్సరంలో “నమ్మ ఊరు పూవాత” అనే తమిళ చిత్రం లో అభినయించినందుకు గానూ తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతిని అందుకున్నారు.

1991వ సంవత్సరంలో “నీ పతి నాన్ పతి” తమిళం చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.                     

1991వ సంవత్సరంలో “నీ పతి నాన్ పతి” తమిళం చిత్రానికి గానూ ఉత్తమ నటిగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు దక్కించుకున్నారు.

1991  వ సంవత్సరంలో “చక్రవ్యూహం” తెలుగు చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు పొందారు.

1994  వ సంవత్సరంలో సుకృతం అనే మలయాళం చిత్రంలో నటించినందుకు గానూ ఉత్తమ నటిగా రాము కార్యాట్ అవార్డు అందుకున్నారు.

2009  వ సంవత్సరంలో దశావతారం చిత్రానికి గానూ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా విజయ్ అవార్డు అందుకున్నారు. 

2017  వ సంవత్సరంలో విశ్వరూపం చిత్రానికి గానూ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు దక్కించుకున్నారు.

రాజకీయం…

గౌతమి గారు 1997 లో యల్.కె.అద్వానీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. తాను BJYM ఉపాధ్యక్షురాలు గా కూడా ఎన్నికైంది.

ఆ సమయంలో తాను ఆంధ్ర, కర్ణాటక మరియు తమిళనాడు లలో అటల్ బిహారీ వాజ్‌పేయి కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.

గౌతమి గారికి కూతురు సుబ్బలక్ష్మి పుట్టిన తర్వాత రాజకీయాలకు విరామం ఇచ్చారు. ఆమె తిరిగి 2017లో  బీజేపీలోకి వచ్చారు. 2021లో రాజపాళయం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా నియమితులయ్యారు.

స్వచ్ఛంద సేవ…

గౌతమి గారు తన 35 ఏళ్ళ వయస్సులో క్యాన్సర్ బారిన పడ్డారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళ నాన్న గారు క్యాన్సర్ కు రోగులకు చికిత్సను ఇతర దేశాల నుండి భారతదేశానికి తీసుకు వచ్చిన మొట్టమొదటి వైద్యులు. పిన్న వయస్సులోనే క్యాన్సర్ బారిన పడ్డ తాను మెరుగైన చికిత్స ద్వారా తిరిగి కోలుకున్నారు. క్యాన్సర్ రోగులకు సహాయం చేసేందుకు గౌతమి లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ (LAF)ని స్థాపించారు. లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ క్యాన్సర్ రోగుల కోసం తాను 360 కంటే ఎక్కువ ప్రేరణాత్మక శిబిరాలను, క్యాన్సర్ అవగాహన ప్రచారాలు మరియు ఫుడ్ డ్రైవ్‌లను నిర్వహించారు.

ఈ ఫౌండేషన్ యోగా మరియు ప్రత్యామ్నాయ చికిత్స కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.

ఇది క్రమానుగతంగా క్యాన్సర్ మరియు మొత్తం ఆరోగ్యాన్ని పరీక్షించే పరీక్షలను నిర్వహించడానికి అనేక ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుంది. LAF 2 మొబైల్ ఆసుపత్రులను కూడా నడుపుతోంది.

ఇది ఉన్నత విద్య కోసం అండర్ ప్రివిలేజ్డ్ విద్యార్థులకు కూడా స్పాన్సర్ చేస్తుంది.

ఈ ఫౌండేషన్ అనుబంధ విద్యా కేంద్రాలు మరియు వృత్తి శిక్షణా కేంద్రాలను కూడా నిర్వహిస్తుంది.

Show More
Back to top button