
నాన్వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వంటల్లో ఒకటి చేపల కూర. అయితే దీనిపట్ల కొంతమందికి ఓ డౌట్ ఉంటుంది. అదేంటంటే.. సముద్రపు చేపలు ఆరోగ్యానికి మంచివా లేదా చెరువు చేపలు ఆరోగ్యానికి మందివా. అయితే, సముద్రపు చేపల కన్నా చెరువుల్లో పెంచే చేపలు ఆరోగ్యానికి కొంతవరకు మంచివని నిపుణులు సూచిస్తున్నారు.
సముద్రపు నీటిలో పాదరసం వంటి రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల సముద్రపు చేపలు తినేవారిపై, ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులపై ప్రభావం పడవచ్చు. పరిశ్రమల వ్యర్థాల వల్ల ఏర్పడే పీసీబీలు మెదడు, వ్యాధి నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. అయితే, చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా సముద్రంలో కలవడం వల్ల చేపల ఆరోగ్యం ప్రభావితమవుతుంది.
ఇక చేపల కూర వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చేపలు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.
సాలమన్, టూనా వంటి చేపల్లో ఉండే మెరైన్ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని మంటలను అదుపుచేస్తాయి.
పెంపుడు చేపల్లో ఒమేగా-3 సముద్రపు చేపల కన్నా ఎక్కువ ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది.










