Telugu Opinion Specials

హిందుత్వం.. ఒక ఫ్యాషనా? లేక జీవన విధానమా?

 ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అనేక దేశాల ప్రజలు భారతదేశం పేరు ఎత్తగానే ఎంతో గౌరవంగా చూస్తారు. మరి కొందరికి చాలా వినయం, విధేయత,  దేశ ప్రాముఖ్యత గుర్తుకు వస్తుంది. 140కోట్ల ప్రజలున్న ఈ దేశంలో ఎలాంటి 

విద్వేషపూరిత అల్లర్లు, అనుదాడులు, భారీ ప్రమాదాలు విదేశాలతో పోల్చుకుంటే చాలా వరకు జరగవు. మరి ఎందుకు ఈ దేశాన్ని అందరూ అంత గొప్పగా చూస్తారు. మనదేశం, మన అఖండ భారతం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం..

భారతదేశం యొక్క ఉనికి, విశిష్టత మొత్తం సనాతన ధర్మం మీద ఆధారపడి వుంది. సనాతన ధర్మాన్ని సాక్షాత్తు పరమశివుడే వ్యాపింపజేశాడు అని వేదం చేబుతుంది. భారతదేశం వేద వాఙ్మయం. దేవుడు ఉన్నాడు అనే నమ్మే భూమి భారత భూమి. అసలేంటి ఈ సనాతన ధర్మం. ఎందుకు పాటించాలి. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పరమాత్మ సృష్టిని నడిపించడానికి సనకసనందనాదులు అనే మునులను సృష్టి వ్యాప్తి చేయాలని ఆదేశించాడు. వీరి పేరుమీదగా ఏర్పడిందే సనాతన ధర్మం. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం ‘కర్మ – పునర్జన్మ’ సిద్ధాంతం.

దీనిప్రకారం.. పరమాత్మ నుండి విభజన చెంది పుట్టిన ప్రతి ప్రాణి.. ఒక ఆత్మగా పరిగణింపబడుతుంది. ఈ ఆత్మ అనేక ఏళ్లుగా ప్రతి జీవిలో వసించి కామ, క్రోధ మొహాలను అనుభవించి.. చివరికి పరమాత్మను చేరుకోవాలి. ఈ ప్రాణి తన జీవితకాలంలో మంచి పని చేస్తే.. మంచి కర్మఫలితాన్ని, చెడు చేస్తే.. చెడు కర్మఫలితాన్ని అనుభవిస్తాడు. అందువల్ల పరమేశ్వరుణ్ణి చేరడానికి చెడు మార్గాన్ని అనుసరించకుండా.. దైవిక కార్యాలు చేస్తూ పరమాత్మలో లీనం అవడమే జీవుడి చిట్టచివరి ప్రయత్నమని ఈ సిద్ధాంతం చెబుతుంది.

అయితే ఈ సిద్ధాంతాన్ని సృష్టి ప్రారంభం నుంచి ప్రతి ప్రాణి అనుభవిస్తూనే.. అనుకరిస్తూనే వస్తుంది. ఇలా భారతదేశం ఏర్పడటానికి పూర్వం వరకు మాహాజనపదాలుగా రాజ్యాలు అనుకరిస్తూ వచ్చేవి. అయితే ఒక్కొక రాజ్యం ఒక్కొక్క విధానపరమైన పాలనా వ్యవస్థలో రాజులు పాలనా చేసేవారు. అయితే ధర్మాన్ని అనుసరించే క్రమంలో అధర్మ కార్యాలు చేస్తూ వచ్చారు. ధర్మం పూర్తిగా నశించి.. అకృత్యాలు పెరగడంతో భూమిపై ధర్మాన్ని పునస్థాపించేందుకు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో మహాభారత గాధను నడిపించి.. భీకర యుద్ధంతో కలియుగానికి పునాదులు వేశాడు. అనేక రాజ్యాలుగా ఉన్న ఈ దేశం మొట్టమొదటిసారిగా భరత రాజ్యాంగా అవతరించింది. ఇలా మన భారత దేశం ఏర్పడింది. 

ఇలా మన భారతం కేవలం సిద్దాంతాలకె పరిమిత కాలేదు. అన్ని విద్యల్లోనూ ఆరితేరింది. సర్వేశ్వరుడు ఋషుల ద్వారా మన దేశానికి అందించిన విద్య.. మరి ఏ ఇతర దేశాల్లో కనిపించదు. మన భారత దేశంలో యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, శాస్త్రాలు, మల్లయుద్ధం, కలరీ యుద్ధ విద్య, ఈటెలు వేయడం, గదా యుద్ధం, బాణాలతో యుద్ధం చేయడం, అనేక యుద్ధ వ్యూహాలు ఇవన్నీ మన భారత దేశం స్వంతం. అలాగే.. సర్వేశ్వరుడు నటరాజస్వరూపమై మన దేశంలో కళలకు జీవం పోశాడు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మణిపురి, ఒడిస్సి ఇలా అనేక శాస్త్ర కళలను సృష్టించాడు. ఇంతటి సౌమ్యమైన మనసు, పరుల హితం కోరే గుణం ఈ దేశప్రలకు ఉండటంలో ఈ దేశంలో హింస చోటుచేసుకోవడానికి తావు లేదు.   

ఇలా అద్భుతమైన యుద్ధవిద్యలు, కళలు, వైద్య సంబంధింత విధానాలు అన్నీ మన భారతదేశ స్వంతం. ఏ దేశం అభివృద్ధి చెందకముందే మన భారత దేశం వైభవోపేతంగా చరిత్ర పుటలో నిలిచే విధంగా అభివృద్ధి చెందింది. కాల క్రమేణా దేదీప్యమానంగా వెలుగుతున్న భారతదేశానికి చీడ పురుగు పట్టినట్లు మన దేశంలో బ్రిటిష్ వారు చేరి సర్వనాశనం చేశారు. మనదేశంలో ఉన్న అపూర్వమైన జ్ఞానం చూసి ఒక్కసారిగా షాక్ కు గురై.. ఎప్పటికైనా ప్రపంచాన్ని శాసించే జ్ఞానం ఈ దేశానికి ఉందని మన దేశ అపూర్వజ్ఞానాన్ని వేద వాఙ్మయాన్ని ఖండఖండాలుగా ముక్కలు చేశారు.

ఏ దేశంలో లేని విద్యాలయం మన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయాన్ని అక్కడి శిక్షణ చూసి నివ్వెరపోయారు. దేశానికే విద్యలన్నిటికి కేంద్రంగా ఉన్న విశ్వవిద్యాలయాన్ని నామరూపాల్లేకుండా చేయాలని భావించి విధ్వంసం సృష్టించారు. మన తాళపత్ర గ్రంథాలు, అనేక విద్యలకు సంబందించి జ్ఞానం, గురువులు, జ్ఞానులను హింసాకాండ సృష్టించి చంపేశారు. ఇలా మన భారతం పతనం అయింది. బ్రిటిష్ విద్యావ్యవస్థను ఇక్కడికి తీసుకువచ్చి దేశానికి నేర్పించి అల్లకల్లోలం సృష్టించారు. మన దేశం నుంచి అనేక గ్రంథాలను ఎత్తుకెళ్లారు. సుగంధ ద్రవ్యాలను ఎత్తుకెళ్లారు. కేవలం మిరియాల కోసమే యుద్ధం చేసి మరి.. దౌర్జన్యంగా తీసుకెళ్లారు. 

అయితే బ్రిటిష్ వారు పలికే భాష కాస్త భిన్నంగా ఉండటంలో మనల్ని ఏమని పిలవాలో తెలియక.. సింధూనది పరివాహక ప్రాంతం వద్ద మన నాగరికత విలసిల్లింది కాబట్టి ఇండోయిలు అని పిలిచేవారు. మనదేశాన్ని ఇండియా అని పిలిచేవారు. ఇలా ఇందు అనే శబ్దం నుంచి ‘హిందూ’ అన్న పదం వచ్చింది. అయితే దేశం బ్రిటిష్ వ్యవస్థలో ఏంతో చిన్నాభిన్నమవడంతో అనేక దేశస్తులు మన దేశంలో నివసించడం మొదలు పెట్టారు. ముస్లింలు, క్రిస్టియన్లు దేశంలో ఎక్కువగా పెరిగిపోయారు. శాంతి, ప్రేమ, కరుణ ఇవే మన సనాతన ధర్మానికి ప్రతీకలు కావునా వారిని కూడా మనదేశంలో స్వేచ్ఛగా బ్రతకడానికి ఎలాంటి అడ్డు చెప్పలేదు సరికదా.. వారికి సరియైన గౌరవం ఇచ్చి సౌబ్రాత్రుత్వంగా మెలిగారు. ఇలా అంతరించిపోతున్న సనాతన ధర్మాన్ని.. సర్వేశ్వరుడు పునప్రతిష్టించేందుకు మహా పురుషులను ఎప్పటికప్పుడు పుట్టిస్తూనే ఉంటారు. అలా వచ్చిన మహాయోగే జగద్గురు ఆది శంకరాచార్యులు. 

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 సార్లు పాదయాత్రలు చేసి.. సనాతన ధర్మాన్ని పునః ప్రతిష్టించేందుకు ‘ఆత్మ – పరమాత్మ’ ఒక్కటేనని అద్వైత సిద్ధాంతాన్ని బోధించి దేశ ప్రజలందరినీ ఒప్పించాడు. ఇలా ఆదిశంకరులు మన ధర్మాన్ని దేశ ప్రజలకు చాటిచెప్పాడు కనుక.. హిందూ మత గురువుగా ఆదిశంకరులను భావిస్తారు. ఇలా మన మతమే కాకుండా.. మిగితా మతాలైన క్రిస్టియన్, ముస్లిం తదితరులు మన విధానాలను అవహేళన చేస్తూ వచ్చారు. ముస్లిం, క్రిస్టియన్ అగ్రరాజులు కూడా మన సంస్కృతిని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నించారు. మన ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను చర్చిలను నిర్మించారు. మనదేశంలోకి వచ్చి మన భూమిపై నివసించడమే కాకుండా.. ఇంతటి విధ్వంసం సృష్టిస్తే ఏ దేశమైన వాళ్ళ దేశం నుంచి తరికికొడతారు. కానీ మనదేశం ఎవరో ఒక్క ముస్లిం, లేదా క్రిస్టియన్, ఇతర మతస్తుడు చేస్తే మిగితావారు తప్పుచేయాలని భావించి క్షమాగుణం చూపించే నైజం మన భారతీయులది. ఇంతటి ఔదార్యం కేవలం సనాతన ధర్మం వలనే సాధ్యం. 

ఇంతటి విధ్వంసం జరిగిన కారణంగానే నేటి భారతం మేల్కొంది. మన ఉనికిని కాపాడటానికి మన చరిత్రను చాటిచెప్పే ఆలయాలు, శిల్పకళా కట్టడాలను పునరుద్ధరిస్తోంది. సనాతన ధర్మాన్ని నిరంతరం పాటించే మానవ దైవం శ్రీరామ చంద్రమూర్తి. అలాంటి శ్రీరాముడు ఉన్న ఆలయాన్ని పడగొట్టి ముస్లింలు మసీద్ ను నిర్మించారు. ఇందుకోసమే మన భారత పౌరులు మేల్కొని..బాబ్రీ మసీదును చట్టం ప్రకారం తొలగించి మన హిందువుల అస్తిత్వాన్నికి ప్రతీక అయిన శ్రీ బాలరామున్ని (రామ్ లల్లా) ప్రతిష్ట చేసుకున్నారు. ఈ ఆలయ నిర్మాణంతో దేశప్రజల్లో ధైర్యం పెరిగింది. చరిత్రలో కూరుకుపోయిన మన దేశ సంపదను ఎప్పటికప్పుడు రక్షించుకుందాం.  జై భారత్..

Show More
Back to top button