
స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వారికి వారెన్ బఫెట్ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది బఫెట్‌ని స్పూర్తిగా తీసుకుని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి బఫెట్ గురించి, ఆయన ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకోవడం వల్ల పెట్టుబడులు ఎలా పెట్టాలో తెలుస్తుంది. వారెన్ USలోని ఒమహాలో 1930లో జన్మించారు. అయన తండ్రి హోవార్డ్ స్టాక్ మార్కెట్లో బ్రోకర్‌గా పని చేసేవారు. బఫెట్‌కి చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. ఇతర పిల్లల లాగా ఆటలతో సమయం వృధా చేయకుండా తన ఖాళీ సమయం చదువుకే కేటాయించేవారు.
తన చదువును కొనసాగిస్తూనే డబ్బు సంపాదించడం కోసం కోకా-కోలా బాటిల్స్, చూయింగ్ గమ్స్ అమ్మడం, న్యూస్ మాగజైన్లు వేయడం వంటి పనులు చేసేవాడు. దీంతోపాటు తన తాతగారి షాపులో కూడా పని చేసేవాడు. ఇలా తనకు 9ఏళ్లు వచ్చేసరికి తండ్రి కార్యాలయానికి వెళ్ళి అక్కడ చేసే పనులు గమనిస్తూ వ్యాపారంలో మెళకువలు గ్రహించేవాడు. బఫెట్ కొన్ని రోజులకు తాను దాచుకున్న డబ్బుతో పొలం కొనుగోలు చేశాడు. 14 ఏళ్ల వయసుకే ఇన్కమ్ టాక్స్ కట్టాడు. తన పై చదువు గురించి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో దరఖాస్తు చేశాడు. కానీ అది తిరస్కరణకు గురైంది.
బెంజమిన్ గ్రాహం రాసిన The Intelligent Investor అనే పుస్తకం చదివి వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకున్నాడు. దీంతో బెంజమిన్ గ్రహం పని చేస్తున్న కొలంబియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సీటు పొందాడు. దీంతోపాటు బెంజమిన్ గ్రాహం నుంచి ఎన్నో ఇన్వెస్టింగ్ స్ట్రాటజీలను నేర్చుకున్నాడు.
చదువు పూర్తయ్యాక 1954 నుండి 1956 వరకు గ్రాహం న్యూమాన్ కార్పొరేషన్లో సెక్యూరిటీస్ అనలిస్ట్‌గా పని చేశాడు. 1970లో బెర్క్‌షైర్ హాత్వే కంపెనీని స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలా తన పార్టనర్ షిప్ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతో మిలినీర్గా మారాడు.
అప్పు చేసి ఎప్పుడు బిజినెస్ చేయకూడదని చెబుతారు బఫెట్. కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు చాలా పరిశోధన చేస్తారు.
అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే సూత్రాన్ని పాటిస్తాడు.
అందుకే స్టాక్ మార్కెట్ రేట్లు ఎక్కువగా ఉంటే బఫెట్ తక్కువ స్టాక్స్ కొంటారు.
తక్కువ రేట్లు ఉన్నప్పుడు ఎక్కువ స్టాక్స్ కొంటారు. అమెరికాలో మూతపడే కంపెనీలను కొని వాటిని పెద్ద కంపెనీలుగా మార్చేశాడు.
అలా తాను, తన పార్టనర్ చార్లీ మంగర్తో కలిసి కొన్న A గ్రేడ్ షేర్స్ కొనడం ద్వారా బఫెట్ బిలియనీర్‌గా ఎదిగాడు.
అలా బఫెట్ 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో 62 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచాడు.