
మహేంద్ర సింగ్ ధోనీ పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. తాను భారత క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్నారు. దీనికి తన ఆట తీరు మాత్రమే కాదు.. ఒత్తిడిలో సరైన నిర్ణయాన్ని సులభంగా తీసుకునే లక్షణం ఉండటం. అలాంటి ధోనీ ఇప్పటివరకు ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే ‘హోటల్ మహి రెసిడెన్సీ’ అనే హోటల్ వ్యాపారాన్ని ఎప్పుడో ప్రారంభించారు ధోనీ. ఇది జార్ఖండ్‌లోని రాంచీ నగరంలో ఉంది. దీనికి ఎలాంటి ఫ్రాంచైజీలు లేవు. ధోనీ తన వృత్తికి తగిన వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ అనే ఒక ఫిట్నెస్, జిమ్‌కు సంబంధించి ఆయనకు వ్యాపారాలున్నాయి. క్రీడాకారులకు కావాల్సిన అన్నిరకాల వస్తువులు, సౌకర్యాలు సమకూర్చే వేదిక. స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ పేరుతో మన దేశవ్యాప్తంగా 200లకు పైగా జిమ్‌లు ఉన్నాయి.
బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
రెండు సంవత్సరాల క్రితం ధోనీ హోమ్ లేన్ అనే ఒక ఇంటీరియర్ కంపెనీతో కలిసి పని చేస్తున్నారు. కంపెనీ ఈక్విటీ పార్ట్నర్ కావడంతో పాటు దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ధోనీకి వాహనాలపై ఉన్న ఇష్టం అంతా ఇంతా కాదు. 2019 ఆగస్టులో కార్స్-24 అనే కార్లు విక్రయించే ఈ-కామర్స్ ప్లాట్ ఫారంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం, కంపెనీ ఈక్విటీలో భాగంతో పాటు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆహార, పానీయాల వ్యాపారంలో కూడా అడుగు పెట్టారు మన ధోనీ. 7ఇంక్ బ్రూస్ అనే కంపెనీతో లింక్ అయ్యారు. రెండు సంవత్సరాల క్రితం ఏప్రిల్‌లో ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కావడంతో పాటు స్టార్టప్‌ల షేర్ హోల్డర్‌గా ఉన్నారు.
రితి గ్రూప్
స్పోర్ట్స్ మార్కెటింగ్ & మేనేజింగ్ కంపెనీ అయిన రితి స్పోర్ట్స్‌లో కూడా ధోనీకి వాట ఉంది.
ధోనీ సెవెన్
2016లో ధోనీ ‘సెవెన్’ కంపెనీ లాంచ్ చేశారు. సెవెన్ అనేది ఇండియన్ లైఫ్ స్టైల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. క్యాజువల్, స్పోర్ట్స్ డ్రెస్సులు, ఫుట్‌వేర్ తయారు చేస్తుంది.
చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్
ఎంఎస్.ధోనీకి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టమనే విషయం చాలామందికి తెలిసిందే. అందుకే.. తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌లో ఎలాగైనా భాగమయ్యేందుకు ధోనీ ప్రయత్నించేవారు. ఈక్రమంలోనే ఇండియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌కి ధోనీ జాయింట్ కోఓనర్ అయ్యారు. ఇది 2014లో ప్రారంభమైంది. ఇది సంవత్సరానికి దాదాపు రూ.100కోట్ల టర్నోవర్ సాధిస్తోంది.
రాంచీ రేస్
ధోనీ హాకీ జట్టులో కూడా పెట్టుబడులు పెట్టారు. ‘రాంచీ రేస్’ జట్టుకు ధోనీ యజమాని. ఝార్ఖండ్కి చెందిన ఈ టీమ్.. హాకీ ఇండియా లీగ్‌లో ఆడుతూ ఉంటుంది.
మహీ రేసింగ్ టీమ్ ఇండియా
ప్రతి క్రీడలోనూ పెట్టుబడి పెట్టిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది ధోనీ ఒక్కడేనేమో. ధోనీకి రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. రేసింగ్‌లోనూ ధోనీ పెట్టుబడులు పెట్టారు. మహీ రేసింగ్ టీమ్ ఇండియా అనే జట్టు ధోనీ చేతిలోనే ఉంది.
* ధోనీ నెట్ వర్త్ ఎంతంటే?
ధోనీస్ ప్రొడక్షన్ హౌస్
ధోనీస్ ప్రొడక్షన్ హౌజ్ పేరుతో ఎంటర్టెయిన్మెంట్ రంగంలో కూడా అడుగుపెట్టారు. తమిళ భాషలో సినిమా ప్రొడక్షన్ చేయనున్నారు ధోనీ. ఇప్పటికే ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అనే సినిమాను కూడా ప్రకటించారు.
రైతుగా ధోనీ
అన్ని రంగాలతో పాటు వ్యవసాయంలో ధోనీ భాగస్వామ్యం అవుతున్నారు. దాదాపు 10 ఎకరాల భూమిలో ధోనీ వ్యవసాయం చేయిస్తున్నారు. 2020 మార్చి నెలలో మనం తరచూ ఒక ప్రకటన చూసాం. అదే అండీ.. ఖాతా బుక్ యాడ్. దానికి మన కెప్టెన్ కూల్ బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కంపెనీ సంవత్సరంలోపు 12 భాషాల్లో దాదాపు 5 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ను స్వీకరించింది. దీని బట్టి చెప్పవచ్చు ధోనీకి ఎంత క్రేజ్ ఉందో. గత సంవత్సరం రూ.846 కోట్లుగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ నెట్ వర్త్ ప్రస్తుతం చూసుకుంటే రూ.1,030 కోట్లకు చేరింది. అంతే కాదు IPL శాలరీ రూ.12 కోట్లు.