
ప్రతి మహిళ ప్రతి నెల పీరియడ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, పీరియడ్స్‌లో వచ్చే రక్తం రంగు వల్ల కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. స్త్రీలల్లో అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే రక్తం రంగులో మార్పులు ఉంటాయి.
లేత ఎరుపు రంగు:
సహజంగా మన రక్తం లేత ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రంగులో రక్తం వస్తే.. ఫ్రెష్ బ్లడ్ పోతుందని అర్థం. ఇలా పీరియడ్స్ మొదట్లో వస్తే పర్వాలేదు. అలా కాకుండా ఎక్కువ రోజులు వచ్చినా, 7 రోజులకు మించి పీరియడ్స్ వచ్చినా వెంటనే డాక్టర్ని కలవాలని నిపుణులు చెబుతున్నారు.
ముదురు ఎరుపు రంగు:
ముదురు ఎరుపు రంగులో పీరియడ్స్ వస్తే నార్మల్ అని అర్థం. పీరియడ్స్ రక్తం ఆక్సిడైజ్డ్ అయితే ఈ రంగులోనే వస్తుంది. అలాగే నెలసరి ముగియనున్నప్పుడు కూడా ఈ రంగులో వస్తుంది.
డార్క్ బ్రౌన్ లేదా బ్లాక్:
ఎక్కువ రోజులకు రక్తం డార్క్ బ్రౌన్ లేదా బ్లాక్ రంగులోకి మారుతుంది. ఈ రంగులో నెలసరి వస్తే మీ శరీరంలోని పాత రక్తం బయటకు వస్తుందని అర్థం. ఒకవేళ మీరు గర్భం దాల్చిన తర్వాత ఈ రంగులో రక్తం వస్తే.. అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
లేత గులాబి రంగు:
మీ రక్తంలో కార్నివాల్ ఫ్లూయిడ్ కలిసినప్పుడు గులాబి రంగులోకి మారుతుంది. దీనిని మీరు నెలసరి చివరి రోజుల్లో గమనించవచ్చు. ఒకవేళ మీకు ఇలా లేత గులాబి రంగులో రక్తం వస్తే గర్భాశయానికి సంబంధించిన వ్యాధి ఏదైనా ఉండవచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
ఆరెంజ్ రంగు:
గర్భాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈ రంగులో నెలసరి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు వెంటనే గైనకాలజిస్ట్‌ని కలవండి. ఒకవేళ మీకు బ్లెడ్ క్లాట్ అవుతుంటే.. అది 2.5 గ్రాముల కంటే ఎక్కువ వస్తున్నా, పీరియడ్స్‌లో ఎక్కువగా ఇబ్బంది ఉన్నా గైనకాలజిస్ట్‌ని కలవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు