
అత్యవసర పరిస్ధితుల్లో చేసే ప్రథమ చికిత్స అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే కొన్ని సమయాల్లో వైద్యం అందుబాటులో ఉండక ప్రాణాల మీదకు వస్తుంది. అలాంటి వాటిల్లో పాము కాటు ఒకటి. సాధారణంగా పాము కోరల్లో నిల్వ ఉండే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే. పాము కాటు ఆకస్మిక ప్రమాదం, ఊహించలేనిది. కాటు వేసిన భాగంలో 2 గాట్లు ఉంటే అది విష సర్పం అని భావించాలి.
పాము విషం శరీరంలోకి వెళ్లి నాడీ వ్యవస్థ ద్యారా గుండెకు, గుండె నుండి శరీర భాగాలకు చేరుతుంది. ఇలా జరగడానికి 3 గంటల సమయం పడుతుంది, ఈ లోగా వైద్యం అందించకపోతే రోగి బతికే అవకాశాలు లేనట్టే. విషాన్ని నోటితో తీసే ప్రయత్నం చేయోద్దు. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్ల పై పెట్టి రక్తాన్ని సిరంజ్‌లోకి లాగాలి. ఇలా చేస్తున్నప్పుడు మొదట వచ్చే రక్తం కాస్త నల్లగా ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి.
తాడు కడితే విషం గుండెకు చేరదా..
విష సర్పం కాటు వేస్తే వేంటనే కరిచిన చోటుకు పై భాగాన గట్టిగ తాడు కట్టాలి అంటారు. నిజానికి అలా కట్టు కట్టినా రక్తప్రసరణ ఆగిపోదు కానీ కొంత నిదానంగా జరుగుతుందని చెప్తుంటారు. కానీ రోగి కంగారు పడితే రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది, కట్టు కట్టినా ప్రయోజనం ఉండదు.
ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి. దీని ధర 10 రూపాయలు మాత్రమే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే.. పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లి తగిన చికిత్సనందించాలి. అయితే, పాము కరిచిన వెంటనే భయంతో పరిగెత్తితే విషం మరింత వేగంగా గుండెకు చేరి ప్రాణాలు త్వరగా పోయే ప్రమాదం ఉంది.