Telugu News

ఈ పథకంతో 40 పైసల వడ్డీకే రూ.3లక్షల రుణం

ప్రస్తుతం చాలామంది ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకుంటున్నారు. వ్యాపారం ప్రారంభించాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది. రుణం తీసుకుంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల చాలామంది వ్యాపారం చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. మీరు అందులో ఒకరైతే ఈ సమాచారం మీకోసమే. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనతో రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు.

అది కూడా కేవలం 40 పైసల వడ్డీకి మాత్రమే. అంటే 4 సంవత్సరాలకు 5% వడ్డీ రేటు. అది కూడా ఎలాంటి పూచీకత్తు లేకుండా తీసుకోవచ్చు. ఇది MoMSME (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) ప్రారంభించిన కేంద్ర రంగ పథకం. దీని ముఖ్య ఉద్దేశం మార్కెట్ లింకేజ్ సపోర్ట్, స్కిల్ ట్రైనింగ్, నిర్దిష్ట ట్రేడ్‌లలో నిమగ్నమైన చేతివృత్తుల వారిని ప్రోత్సహించడం.

బుట్ట/చాప/చీపురు మేకర్/కొయిర్ నేత, కుమ్మరి లాంటి చేతి వృత్తి పని చేసే వారు ఈ పథకానికి అర్హులు. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీరు ఈ రుణానికి అర్హులైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికారిక వెబ్‌సైట్‌ (pmvishwakarma.gov.in )కి వెళ్లి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా దరఖాస్తుల కోసం సాధారణ సేవా కేంద్రాలను సందర్శించవచ్చు. రుణం లభించిన వారికి వృత్తిపరమైన శిక్షణ కూడా అందిస్తారు.

ఏదైనా ప్రభుత్వ సేవలో (సెంట్రల్/స్టేట్) ఉద్యోగం చేస్తున్న వారు, వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకంలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

Show More
Back to top button