Telugu News

‘స్నాప్డీల్’ పతనానికిఅసలుకారణాలేంటి..!

మనకు ఇంట్లోకి ఏదైనా అవసరమయ్యే వస్తువు కావాలనుకుంటే.. ఒకప్పుడు బజారుకు వెళ్లి.. షాప్ టు షాప్ తిరిగి రేటు, నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఆ వస్తువును కొనేవాళ్ళం.. కానీ ఇదంతా అయ్యేందుకు కొన్ని గంటల సమయం పట్టేది.. కానీ తర్వాతి కాలంలో ఇంట్లోనుంచే కావాల్సిన వస్తువులను క్షణాల్లో చేతివేల మీద ఆర్డర్ పెట్టుకునేంత వెసులుబాటు దొరికింది.. దీనివల్ల మన టైం కూడా సేవ్ అయ్యేది.. ఇలా మనకు కావాల్సిన ప్రతి వస్తువును ఇప్పుడు ఆన్లైన్ ఈ.కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఎంతో సులువుగా కొనగలుగుతున్నాం. నచ్చినదాన్ని త్వరితగతిన ఆర్డర్‌ చేసుకోవడం.. ఆఫర్ తో కూడిన సేఫ్ పేమెంట్స్.. క్యాష్ ఆన్ డెలివరీ.. నచ్చకుంటే రిటర్న్ పాలసీ.. విధానాల వల్ల మన పని సులువైపోయింది.. ఇలా ఈజీ బైయింగ్ ఆప్షన్ ను అందించిన ప్రముఖ ఈ.కామర్స్ వెబ్ సైట్ లలో 

ఒకానొక సమయంలో మన దేశంలోనే అత్యంత పాపులారిటీని పొందిన కంపెనీయే.. స్నాప్ డీల్..

ఇప్పుడు ఈ స్నాప్ డీల్ ప్లేస్ లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి మరో అతిపెద్ద కంపెనీలు వచ్చి చేరాయి.

స్నాప్ డీల్ ప్రారంభించిన 6 సంవత్సరాల్లోనే.. దేశంలోనే రెండవ అతిపెద్ద ఈ.కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దీని నెట్‌వర్త్‌ సుమారు 6.5 బిలియన్ డాలర్లుగా ఉంది. పైగా ఇందులో రతన్ టాటా, ఈబే, సాఫ్ట్‌ బ్యాంక్, నెక్సస్‌, ఫాక్స్ కాన్, అలీబాబా… లాంటి ప్రముఖ దిగ్గజ కంపెనీలన్నీ ఇందులో పెట్టుబడులు పెట్టాయి. కానీ 2016 నుంచి పరిస్థితి అంతా మారిపోయింది.. ఉన్నట్టుండి స్నాప్‌డీల్ మార్కెట్‌ షేర్‌ వాల్యూ 25 నుంచి 4 శాతానికి పడిపోవడం మొదలుపెట్టింది.. 2017 వచ్చేసరికి ఈ కంపెనీ దివాలా తీసే స్థాయికి చేరుకుంది. ప్రముఖ బిజినెస్‌ పర్సనాలిటీస్‌ సైతం ఈ స్నాప్ డీల్ లో ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ ఈ కంపెనీ ఎందుకు ఫెయిల్‌ అయ్యింది… కస్టమర్స్ ను ఎందుకనీ అట్రాక్ట్ చేసుకోలేకపోయింది… అంత రైజింగ్ లో ఉన్న కంపెనీలో ఒక్కసారిగా కుదుపు రావడానికి గల కారణం ఏంటి..? ఇలా స్నాప్ డీల్ ఫెయిల్యూర్ వెనుక దాగివున్న అసలు విషయాలను మనం 

ఇప్పుడు తెలుసుకుందాం…

స్నాప్‌డీల్‌ను కునాల్‌ బహన్‌, రోహిత్‌ భన్సాల్ లు ఇద్దరు కలిసి 2010 ఫిబ్రవరిలో మొదలుపెట్టారు.. ఆన్లైన్ సైట్ గా రాకముందు ఈ సంస్థను కొన్నాళ్ళు ఆఫ్ లైన్ లో నడిపారు.. అలా మూడు నెలలపాటు ట్రయల్స్ అయిన తరువాత మంచి ఇన్వెస్టర్ లను కలిశారు.. అట్నుంచి ఆన్లైన్ సైట్ గా అవతరించింది. చైనాకి చెందిన ప్రముఖ ఈ.కామర్స్ అలీబాబా.కామ్ కంపెనీకి స్ఫూర్తిగా ఈ కంపెనీని వీరిద్దరూ తీసుకొచ్చారు. 2011నాటికి, అంటే ఏడాదికే ఊహించని రీతిలో స్నాప్ డీల్ పురోగతిని సాధించింది. 12 మిలియన్ల ప్రొడక్ట్ లతో, 1,50,000 సెల్లర్స్ తో, 25 బిలియన్ యూజర్ బేస్ తో దూసుకుపోయింది. ఆ టైంలో స్నాప్ డీల్ కు పోటీగా మన దేశంలో ఉన్న మరొక కంపెనీ ఏదైనా ఉందంటే అది ఫ్లిప్‌కార్ట్‌… 

అయినా కూడా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదరణ పొందింది. ఎక్కువమంది సెల్లర్స్‌ ను గ్రాబ్‌ చేసుకోగలిగింది. తనకంటూ విడిగా యూజర్ బేస్ ను క్రియేట్ చేసుకుంది.. కస్టమర్‌లను రెడీ చేసుకుంది. చాలామంది ఇన్వెస్టర్‌లను ఆకర్షించగలిగింది. భారీ పెట్టుబడులను సైతం రాబట్టింది. దాదాపు 500ల కేటగిరీలలో 20 మిలియన్ ప్రొడక్ట్స్ ను అందిస్తూ.. 2 లక్షల సెల్లర్స్ తో, 100 మిలియన్ యూజర్స్ తో కనెక్ట్ అయ్యి, 2015వరకు విపరీతమైన లాభాలను చవిచూసింది. ఈ క్రమంలో ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలానే కొనసాగితే మరో మూడేళ్లలో మిలియన్ మార్క్ కు చేరుకునేది కూడా..

ఇలా కునాల్, రోహిత్ లు ఇద్దరూ కూడా తమ హార్డ్ వర్క్, ముందుచూపుతో 2015లో 600 శాతం వృద్ధిని సాధించారు. దీంతో స్నాప్ డీల్ తన వ్యాపారంలో వేగాన్ని పెంచడంపై దృష్టి సారించింది. మరికొంతమంది ఇన్వెస్టర్ ల నుంచి పెట్టుబడులు తీసుకొని.. వివిధ స్టార్టప్ లను కొనుగోలు చేయడం ప్రారంభించింది. అలా 14 అక్విజిషన్ లు, 5 ఇన్వెస్ట్మెంట్ ల కోసం దాదాపు 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేసింది. ఫ్రీఛార్జ్, రూపీపవర్, గ్రాబాన్.కామ్, స్మార్ట్ ప్రిక్స్, యునికామర్స్ లాంటి ఎన్నో స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేసింది.

అంతేకాక ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ మొబైల్స్ కేటగిరీలో ఫోకస్ పెట్టింది.. కానీ స్నాప్ డీల్ తో పోలిస్తే.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు తమ కస్టమర్ల కోసం కొత్తగా లాంఛ్ అయిన స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. వినూత్న ఆఫర్ లను అందిస్తూ వచ్చాయి. కానీ ఈ విషయంలో స్నాప్ డీల్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. లేటెస్ట్ వెర్షన్లను అందించడంలో కొంత స్లో అయ్యింది.. 

స్టార్టప్ లలో ఏ ఒక్కటి సక్సెస్ కాకపోగా.. డైలీ డీల్స్ విషయంలోనూ రోజురోజుకు కస్టమర్ల నుంచి రెగ్యులర్ కంప్లయింట్స్‌ ఎక్కువైపోయాయి. క్రమంగా సెల్లర్స్‌ దూరమైపోయారు. ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఈ ఇబ్బందులు తట్టుకోలేక జాబ్‌లో ఇమడలేక వదలివెళ్లే పరిస్థితి ఏర్పడింది. 

ఏ వ్యాపారానికైనా.. కస్టమర్ ల సాటిసిఫ్యాక్షన్ నే ముఖ్యం కానీ స్నాప్ డీల్ ఒకానొక సమయంలో ఆ సాటిసిఫ్యాక్షన్ ను పూర్తిగా అందివ్వలేకపోయిందనే చెప్పాలి. చాలావరకు కస్టమర్లకు ప్రొడక్ట్‌లు డెలివరీ డేట్‌ అయిపోయాకనే వచ్చేవి. అంతేకాక ఒక ప్రొడక్ట్‌కు బదులు మరొక ప్రొడక్ట్‌ డెలివర్‌ అయ్యేది. ఇలా కొంతమందికి ఫేక్‌ ప్రొడక్ట్స్ వస్తే.. మరికొంతమందికి లేట్‌గా డెలివరీ అయ్యేవి. కొందరికైతే తమ డబ్బులు రిఫండ్‌ అయ్యేవి కాదు. కారణం.. వీరివద్ద పార్సిల్స్ ను చెక్‌ చేయడానికి ఎటువంటి విధివిధానం లేదు.. దీంతో ఫేక్‌ సెల్లర్స్‌ దీన్ని అడ్వాన్‌టేంజ్‌గా తీసుకుని కస్టమర్లను మోసం చేసేందుకు ప్రయత్నించేవారు. అందుకే ఈ కంపెనీ కస్టమర్లు ఈ కంపెనీని వదిలేసి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీలవైపు మళ్లారు. 

ఇకపోతే సెల్లర్స్ కూడా కస్టమర్లలానే తీవ్ర నిరాశ చెందారు. మొదట్లో ఎక్కువమంది సెల్లర్స్‌ ఈ కంపెనీలో అసోసియేట్ అవ్వాలని కోరుకునేవారు. ఎందుకంటే అప్పుడు స్నాప్‌డీల్‌ అతిపెద్ద ఫ్రాపిటబుల్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉంది. పైగా రోజూ పెద్దమొత్తంలో ఆర్డర్స్‌ రావడంతో సేల్స్‌ ఎక్కువగా జరిగేవి. వీటితోపాటు కంపెనీ పాలసీలు, యాజమాన్యం చాలా క్లియర్ గా ఉంటూ, నిబద్ధతతో పనిచేసేది. ముఖ్యంగా ఇతర కంపెనీలు సెల్లర్స్ కి 21రోజులు అయితే తప్ప పేమెంట్స్‌ చేసేవికావు. కానీ ఒక్క స్నాప్ డీల్‌ మాత్రం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చి వారంరోజుల్లోనే డబ్బులు పే చేసింది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ పాలసీ ఎక్కువకాలం కొనసాగలేదు.. మెల్లమెల్లగా ఈ కంపెనీతో డీలింగ్స్ సెల్లర్స్‌ కి తలనొప్పిగా మారిపోయాయి. చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందుల వల్ల ట్రస్టెడ్‌ కస్టమర్స్ అకౌంట్లను బ్లాక్‌ చేసేది. వీటిని తిరిగి అన్‌బ్లాక్‌ చేయడం.. వారి సమస్యలను పరిష్కరించడంపై ఒక క్లారిటీ ఉండేది కాదు. దీంతో కస్టమర్లు తగ్గడంతో సెల్లర్స్‌ కూడా క్రమంగా స్నాప్ డీల్ నుంచి తప్పుకున్నారు.

అంతేకాదు… సెల్లర్స్‌ వేర్‌ హౌజ్‌ను మూసేసి తమ సామాన్లన్నింటినీ స్నాప్‌డీల్‌ వేర్‌హౌజ్‌కి తరలించాలని మరొక విచిత్రమైన పాలసీని కూడా తీసుకొచ్చింది. మామూలుగా అయితే సెల్లర్స్‌ వద్ద సొంతంగా, విడిగా వేర్‌హౌజ్‌లు ఉంటాయి. తమ సౌకర్యాన్ని బట్టి సామాన్లను అరేంజ్ చేసుకొని, డెలివరి చేస్తుంటారు. దీంతో కొంతమంది సెల్లర్స్‌ తమ వేర్‌హౌజ్‌ నుంచి స్నాప్‌డీల్‌ వేర్‌హౌజ్ కు తమ ప్రొడక్ట్స్ ను తరలించేందుకు నిరాకరించారు. దీంతో స్నాప్‌డీల్‌.. సెల్లర్స్‌ తమ వేర్ హౌజ్‌ నుంచి రోజుకు కేవలం ఐదు ప్రొడక్ట్‌లను మాత్రమే సేల్‌ చేయాల్సి ఉంటుందనే మరో కొత్త నిబంధనను పెట్టింది. ప్రతిరోజు వేలకొద్దీ ఆర్డర్లు తీసుకునే సెల్లర్స్ కాస్త.. తప్పక ఐదు ఆర్డర్ లనే తీసుకోవడం మొదలు పెట్టారు.. ఇలా వారి పేమెంట్స్ తగ్గడం పెద్ద మైనస్ అయ్యింది. దీనికితోడు ఇకపై సెల్లర్స్.. తమ సామాన్లను స్నాప్ డీల్ వేర్ హౌజ్ లో పెట్టేందుకు స్నాప్ డీల్ కు రెంట్ పే చేయాల్సి ఉంటుందని అన్నారు.

ఒకవేళ రెంట్ పే చేయని పక్షంలో సామాన్లు తీసుకువెళ్లడం కుదరదని కూడా చెప్పింది. తీరా చూస్తే ఈ స్నాప్ డీల్ వేర్ హౌజెస్ లో సామాన్లు పెట్టేందుకు ఖాళీ లేదు.. దీంతో నిర్వహణ లోపం, సరైన సెక్యూరిటీ సిస్టమ్ లేకపోవడంతో సెల్లర్స్ సామాన్లు దొంగతనానికి గురయ్యాయి. ఆ దొంగతనంలో మేనేజర్ల హస్తం ఉందని తెలుసుకున్న సెల్లర్స్ అందరూ ఈ విషయం గురుంచి కంపెనీ సీఈఓలకు కంప్లెయింట్ చేశారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి కంపెనీ సెల్లర్స్ కు ఎటువంటి నష్టపరిహారాన్నిగానీ, హామీగానీ ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన చాలామంది సెల్లర్స్ అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ వంటి కంపెనీలకు షిఫ్ట్ అయిపోయారు. నిజానికి ఇతర కంపెనీల సెల్లింగ్ కాస్ట్ తో పోలిస్తే స్నాప్ డీల్ సెల్లింగ్ కాస్ట్ మూడురెట్లు ఎక్కువ.. 

ఇలా రకరకాల పాలసీలను, అర్థం పర్థం లేని విధానాలను తీసుకొచ్చినా.. స్నాప్ డీల్ బిజినెస్ బాగానే జరిగేది.. కానీ ఫోకస్ అంతా కూడా ఎక్కువగా టెక్నికల్ ఇష్యూస్, కస్టమర్ కేర్ సమస్యల మీద పెట్టాల్సి వచ్చేది. ఒకే సమస్యపైన అక్కడ ఉండే కస్టమర్ సపోర్ట్ టీం రకరకాలుగా సమాధానం ఇచ్చేవారు. దీంతో అవి పరిష్కారం అవ్వడంలో లేట్ అవ్వడంతో కస్టమర్స్ నుంచి ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ అయ్యాయి. దీంతో సెల్లర్ సపోర్ట్ సిస్టమ్ కూడా డీలా పడిపోయింది. దీంతో స్నాప్ డీల్ తన బిజినెస్ లో కొత్త రకమైన ప్రొడక్ట్ లను తీసుకురావడంలో ఘోరంగా విఫలమైంది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఫ్లాట్ ఫామ్ లతో పోటీపడి మెరవాలనుకుంది. కానీ ఏ కేటగిరిలోనూ తన మార్క్ ను చూపించలేకపోయింది. స్నాప్ డీల్ కు తనకంటూ సొంత గుర్తింపు లేదు. వీళ్ళ యూజర్స్ కు మంచి యూజర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలోనూ, లోయల్ కస్టమర్ బేస్ ను ఏర్పాటు చేయడంలోనూ విఫలమైంది. వీటన్నిటినీ కప్పిపుచ్చుకునేందుకు డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వడంలో బిజీగా ఉండేది. దీంతో కస్టమర్ ను అట్రాక్ట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి.

తన వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం కోసం స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ తో మెర్జ్ అవుతుందనే వార్త ఒకటి బయటకు వచ్చింది. అది కాస్త స్నాప్ డీల్ కు ముఖ్యమైన ఫండింగ్ సోర్స్ అయిన సాఫ్ట్ బ్యాంక్ ఫండ్ మేనేజర్ నికేశ్ అరోరాకు చేరింది. ఇక ఇంకేముంది.. ఆయన ఈ కంపెనీకి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఈయనా వెళ్లిపోవడంతో ఫండింగ్ మొత్తం ఎక్కడిక్కడే ఆగిపోయింది. దీంతో ఈ కంపెనీ సీఈఓలు.. 50 శాతం లాస్ తో ఫ్లిప్ కార్ట్ కు లేదా పేటీఏంకు స్నాప్ డీల్ ను అమ్మాలని చూశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇన్వెస్టర్లు ఆందోళన చేపట్టారు. దీంతో స్నాప్ డీల్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. తరువాత ఒక్క రూపాయి సంపాదన కోసం రెండు రూపాయలు ఖర్చు చేస్తూ పోయింది.

దీంతో నష్టాలు కూడా నాలుగు రెట్ల చొప్పున పెరిగిపోయాయి. ఇది చాలదన్నట్లు.. తన ఇంటర్నల్ సమస్యలను సాల్వ్ చేయడం పక్కన పెట్టి.. మరికొంతమంది ఇన్వెస్టర్ ల నుంచి పెట్టుబడులు తీసుకొని.. వివిధ స్టార్టప్ లను కొనుగోలు చేయడం ప్రారంభించింది. అలా 14 అక్విజిషన్ లు, 5 ఇన్వెస్ట్మెంట్ ల కోసం దాదాపు 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేసింది. కానీ ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా సక్సెస్ చేయలేకపోయింది. దీంతో చాలావరకు కస్టమర్లు స్నాప్ డీల్ ను వదిలి వెళ్లారు.

2016లో ఫండింగ్ ఇష్యూస్, క్యాష్ బర్న్ సమస్యలు పెరిగాయి. దీంతో ఈ కంపెనీ లొసుగులు బయటపడ్డాయి. సంస్థలో ఉన్న యాజమాన్యం, పనిచేసే ఉద్యోగుల్లో సరైన లీడర్ షిప్, మెంటార్ షిప్ ఎబిలిటీస్ లేవు.. ప్రతి నిర్ణయం కంపెనీ సీఈఓలే తీసుకునేవారు. అనాలోచిత పాలసీల వల్ల అటు ఎంప్లాయ్, ఇటు సెల్లర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారంతా చేసేదేంలేక రిజైన్ చేసి వేరే కంపెనీలకు షిఫ్ట్ అయ్యేవారు. 

ఈ కంపెనీ డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వచ్చిన భారీ పెట్టుబడులను విచ్చలవిడిగా స్టార్టప్ లు తెరిచేందుకు వినియోగించింది. ఐఐఏం, ఐఐటీ నుంచి ఎంప్లాయిస్ ను తీసుకోవడం.. ఇష్టారీతిన ఖర్చు చేసి లాభాలు పొందలేక స్నాప్ డీల్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. అదే టైంలో రీబాండింగ్ దివాలి సేల్ పేరుతో 2వేల కోట్లు పెట్టుబడిగా పెట్టింది.. ఇలా తన కొమ్మను తానే నరుకున్నట్లు.. అనాలోచిత నిర్ణయాల వల్ల.. ట్రస్టెడ్ యూజర్ బేస్ ను కోల్పోయి.. సర్వీసెస్ అందించడంలో పూర్తిగా విఫలమై మార్కెట్ లో నిలవలేకపోయింది.

Show More
Back to top button