ఇలాంటి స్త్రీలు మీ ఇంట్లో అడుగుపెడితే అదృష్టమే.. శరీరాకృతిని బట్టి ఇటువంటి స్త్రీలు అదృష్టవంతులట

ఆడవారి శారీరక అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఆడవారికి అందంతోపాటు వారి శారీరక ఆకృతి ఎంతో ముఖ్యం. అందుకే పూర్వకాలంలో పెళ్లి చూపులకు వెళ్లే సమయంలో పెద్దవారు ఆడపిల్ల ఒడ్డు పొడుగు చూసేవారట. అమ్మాయి నడక తీరును మాట తీరు గమనించి వివాహం జరిపించుటకు సమ్మతించేవారు. పూర్వకాలపు ఆచారాలు నేటి జనరేషన్ వల్ల అడుగంటి పోతున్నాయి. ఇప్పుడు ఓ జంటకు వివాహం జరిపించాలంటే పూర్వపు కాలంలో మాదిరిగా పెళ్లి చూపులకు వెళ్లకుండా ఆన్లైన్లోనే చూపులు కానిస్తున్నారు. తర్వాత వారికి నచ్చితే వివాహము జరిపిస్తున్నారు. కాబట్టి పూర్వపు కాలంలో పట్టించుకున్నంతగా ఇప్పుడు అంత పట్టింపుగా ఎవరు చూడట్లేదు.
జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగమే సాముద్రిక శాస్త్రం…
అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహగమనాల ద్వారా మనిషి జీవన గమనాన్ని ఏ విధంగా అయితే జ్యోతిష్యులు తెలియజేస్తారు. సాముద్రిక శాస్త్రం కూడా మనిషి యొక్క శరీరాకృతిని ద్వారా గుణగణాలను, జీవితంలో జరగబోయే కష్టసుఖాలను, లాభనష్టాలను వెల్లడిస్తాయనేది సాముద్రిక శాస్త్రంలో పేర్కొనబడింది. సాముద్రిక శాస్త్రం ద్వారా మనిషి శిరస్సు నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. శరీర భాగాల పొడవు వాటి అమరిక బట్టి ఆ వ్యక్తి ఎలాంటివారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. చేతులు కాళ్లు పాదాల నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతోంది వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతాయి. ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుర్ధాయం ఎంత ఇలా ఎన్నో విషయాలను సాముద్రిక శాస్త్రం ద్వారా చెప్పవచ్చు.
సాముద్రిక శాస్త్రంలో స్త్రీల యొక్క శరీర భాగాలను గురించి ఏం పొందుపరచబడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నుదుటి భాగం వెడల్పుగా ఉన్న స్త్రీలు…
స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు ఎంతో అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే నుదుటి ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే వారికి అంత అదృష్టం కలిసి వస్తుందట. అదేవిధంగా రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉండడం, రెండు కళ్ళ మధ్య ఎక్కువ గ్యాప్ ఉండడం, కన్నులు విశాలంగా ఉన్న స్త్రీలు ఎక్కువ ధనం సంపాదిస్తారు.
కళ్ళు పెద్దగా ఉన్న స్త్రీలు…
కళ్ళు పెద్దగా ఉన్న స్త్రీలు ఎంతో అదృష్టవంతులట. కళ్ళ చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో కీర్తి పలుకుబడి గౌరవం లభిస్తాయట.
చేతివేళ్ల నిర్మాణం ఈ విధంగా ఉంటే…
ఇక చేతివేళ్ల నిర్మాణానికి వస్తే చిటికెన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండాలట. చిటికెన వేలికి ఉంగరపు వేలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వీలు ఎంతో అదృష్టవంతులైన స్త్రీలు అని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. చూపుడు వేలు కన్నా ఉంగర వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదట. ఇలాంటివారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినప్పటికీ, భవిష్యత్తు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉంటుందట. వీటితోపాటు అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ఎక్కువ ధనాన్ని పోగు చేస్తారు. వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది. కానీ పోవడం అనేది ఉండదట.
పాదాల నిర్మాణాన్ని బట్టి…
పాదాల నిర్మాణ విషయానికి వస్తే బొటనవేలు కంటే పెద్దగా ఉండి మిగిలిన వేలు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉండేవారు అదృష్టవంతులట. బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులు. వీరు దేనికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళతారు. సమాజంలో వీరికి ఎంతో గౌరవం ఉంటుంది. అయితే సమాజంలో వీరిని అందరూ గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ అని అనుకుంటారు. అవి అవన్నీ మాటలను వీరు పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటూ ముందుకు వెళతారు.
బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారు. అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుందట. అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా అంతే కొంతమంది కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎవరికైతే బాధ పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటివారు ఎంతో అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అలాకాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు అనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారి జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందట.
కళ్ళు విశాలంగా ఉన్న స్త్రీలు అదృష్టవంతులు…
కొంతమంది ఆడవాళ్ళకి కళ్ళు చాలా పొడుగ్గా విశాలంగా ఉంటాయి. ఆ విధంగా పొడవైన కళ్ళు ఉన్న స్త్రీలు ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుందట. వాళ్ళు ఎంతో అందంగా ఉంటారు. అభిమానులు ఎక్కువగా ఉంటారు. జీవిత భాగస్వామిని ఈ స్త్రీలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారట. జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమాభిమానాలను కలిగి వారి అడుగుజాడల్లో నడుస్తారట.
పొడవైన జుట్టు కలిగిన స్త్రీలు…
జుట్టు పొడవుగా ఉన్న స్త్రీలు అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి ఎంతో అదృష్టాన్ని తెచ్చి పెడతారట. కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటారు. అయితే వీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అందంగా ఉండటమే కాకుండా అదృష్టవంతులు కూడా.
ఏ అక్షరంతో పేర్లు మొదలయ్యే అమ్మాయిల అదృష్టవంతులు జ్యోతి శేశాస్త్రంలో చెప్పబడింది.
జ్యోతిష్యం పరంగా ఆరు అక్షరాలతో పేర్లు ఉన్న అమ్మాయిలు ఇంట లక్ష్మీదేవి తాండవిస్తోంది. చుట్టూ ఉన్నవారికి కూడా వీరి వల్ల అదృష్టం కలిసొస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆరు అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్య అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడపడితే అక్కడ ఆనందం కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ అక్షరాలలో పేర్లు మొదలయ్యే వ్యక్తులు అదృష్టవంతులని చెబుతారు. లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం
A అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు…
ఏ అక్షరంతో పేర్లు మొదలయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. తెలివైన వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. ఎంతో సంతోషంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వారి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది. వీరు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావున ఎంతో డబ్బు సంపాదిస్తారు. కాబట్టి వారికి డబ్బు కొరత ఉండదు. ఈ స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు. ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి హృదయాలను గెలుచుకుంటారు. ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరి ఏదైనా కొరత ఉండదు. వీళ్ళు తమ స్వభావంతో ఎవరి మనసు ఆయన ఇట్టే గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు అదృష్టవంతులుగా నిరూపిస్తారు. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు.
C అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు…
అలాగే సి అక్షరంతో పేర్లు మొదలయ్యే అమ్మాయిలు ఎంతో ధైర్యంగా నిర్భయంగా ఉంటారట. వారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అనుకున్నది సాధిస్తారు. వారి జీవితంలో దేనికి లోటు ఉండదట. వారు తమకే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారికి కూడా అదృష్టవంతులనే చెప్పవచ్చు.
L అక్షరంతో పేర్లు ప్రారంభమయ్య స్త్రీలు…
ఎల్ అక్షరంతో పేర్లు మొదలయ్యే ఆడవాళ్లు ఏ క్షణంలో ఎవరినైనా తమ వైపుకు మలుచుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి ఈ అమ్మాయిలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారట. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. తమ భర్త అత్తమామలకు అదృష్టవంతులు. తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ మహిళలు వెళ్లే ఇల్లు ఆనందంతో నిండి ఉంటుంది.
N అక్షరంతో పేర్లు ప్రారంభమై ఏ స్త్రీలు…
ఎన్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలు అదృష్టవంతులు. వారు చేయాలనుకున్న పనిని పూర్తిచేసే వరకు వదిలిపెట్టరట. వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధ గలవారు. లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అధికంగా ప్రేమిస్తారు. అదే సమయంలో మహిళలకు అత్తగారి పట్ల గౌరవం ఉంటుంది. సాధారణంగా వారు ఉన్నచోట సంతోషకరమైన వాతావరణ నెలకొంటుందట.
T అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు…
టి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు. అదృష్టవంతులు కూడా. కష్టపడి పని చేసేవారు. అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు. భర్తకు ఆమె లక్ష్మి అవతారం. అంటే డబ్బుకు సంపదకు లోటు ఉండదు.
Y అక్షరంతో పేర్లు ప్రారంభమయ్య స్త్రీలు…
వై అక్షరంతో పేర్లు మొదలయ్యే అమ్మాయిలు ఎంతో కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. ఈ మహిళలు ఓపెన్ మైండెడ్. ఎక్కువ ఓపికతో కష్టపడి పనిచేస్తారు. వారు చేయాలనుకున్నది చేస్తారు. కాబట్టి విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలు తమ భాగం జీవిత భాగస్వామికి అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఈ మహిళలు వారు వెళ్లే ఇంట్లో ఆనందాన్ని పంచుతారు. వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడు సంతోషకరమైన వాదన ఉంటుంది. డబ్బు విషయంలోనూ వీరికి చాలా అదృష్టవంతులుగా భావిస్తారు.